Saturday, December 11, 2010

మైక్రో‍సాప్ట్ పవర్‍పాయింట్ కి ఉచిత బెస్ట్ ప్రత్యామ్నాయ వెబ్అప్లికేషన్లు!!!


స్లైడ్ షో ప్రెజెంటేషన్ తయారుచెయ్యాలంటే కనుక మనం ఎక్కువగా మైక్రోసాప్ట్ పవర్‍పాయింట్ నే ఉపయోగిస్తూ ఉంటాం. మైక్రోసాప్ట్ పవర్‍పాయింట్ లానే అందమైన మరియు ఆకర్షణీయమైన ప్రెజెంటేషన్లు తయారుచెయ్యటానికి ఉపయోగపడే ఉచిత ప్రత్యామ్నాయ అప్లికేషన్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

౧. గూగుల్ డాక్స్ ప్రెజెంటేషన్:

గూగుల్ డాక్స్ గురించి మనందరికి తెలుసు, దానిలోని అంతర్భాగమే ప్రెజెంటేషన్, ఇది వెబ్ ఆధారిత అప్లికేషన్. గూగుల్ డాక్స్ కి సైన్-ఇన్ అయ్యి డ్రాప్ డౌన్ మెనూ ’Create New' పై క్లిక్ చేసి 'presentation' సెలెక్ట్ చేసుకోవటమే. దీనిని ఉపయోగించటం కూడా చాలా సులువు బ్యాక్‍గ్రౌండ్, థీమ్ మార్చుకోవచ్చు, ఇమేజ్ లేదా వీడియోలను ఇన్‍సర్ట్ చెయ్యవచ్చు. ప్రెజెంటేషన్ పూర్తి అయిన అవసరమైతే షేర్ కుడా చేసుకోవచ్చు.




2.SlideRocket :

స్లైడ్‌రాకెట్ ఉచిత అకౌంట్ లో పైల్ సైజ్ 15MB కలిగి 250 MB స్టోరేజ్ స్పేస్ ని అందిస్తుంది. ప్రెజెంటేషన్లను పీడీఎఫ్ లోకి ఎక్స్‌పోర్ట్ చేసుకొనే సదుపాయం కూడా కలదు. స్లైడ్‌రాకెట్ కి సంబంధించిన వీడియోని ఇక్కడ చూడండి.


3. 280 Slides :

ప్రెజెంటేషన్ తయారుచేసుకోవటానికి ఉపయోగపడే మరొక మంచి అప్లికేషన్ 280 Slides. మన ప్రెజెంటేషన్ లను అప్‌లోడ్ చేసి 280 Slides లోకి ఇంపోర్ట్ చేసి ఆన్‌లైన్ లో స్టోర్ చేసుకోవచ్చు మరియు ప్రెజెంటేషన్స్ ని పవర్‌పాయింట్ 2007 ఫార్మెట్ లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరొక మంచి ఫీచర్ ఆటో్‌సేవ్ మరియు రికవరీ.



4.Prezi:


ధన్యవాదాలు