ఏదైనా పీడీఎఫ్ రూపం లో వున్న అప్లికేషన్/ఫారాలను ప్రింట్ తీసుకొని చేతితో వ్రాయకుండా లేదా తిరిగి టైప్ చెయ్యకుండా పీడీఎఫ్ డాక్యుమెంట్ లోనే నింపటానికి FillAnyPDF.com అనే సైట్ కి వెళ్ళి Upload Form to Fill దగ్గర 'Browse' పై క్లిక్ చేసి నింపవలసిన పీడీఎఫ్ డాక్యుమెంట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. మన ఫార్మ్ ని ఇతరులతో షేర్ చేసుకోవాలంటే కనుక Share blank form with others దగ్గర టిక్ పెట్టాలి . ఇప్పుడు ’Fill Now' పై క్లిక్ చెయ్యాలి. ఖాళీ డాంక్యుమెంట్ ని ఇతరులతో పంచుకోవటానికి అడ్రస్ బార్ లోని లింక్ ని వారికి తెలియ చెయ్యాలి. ఇప్పుడు ఇక్కడ వున్న ఎడిటింగ్ టూల్స్ ని ఉపయోగించి ఫార్మ్ ని నింపవచ్చు. తర్వాత ’Download' పై క్లిక్ చేస్తే నింపిన ఫార్మ్ డౌన్లోడ్ లింక్ వస్తుంది, 12 గంటల లోపు ఆ లింక్ ని ఉపయోగించి ఫిల్ చేసిన ఫార్మ్ ని పొందవచ్చు.
మరిన్ని వివరాలకు FillAnyPDF.com సైట్ ని చూడండి.
ధన్యవాదాలు
మరిన్ని వివరాలకు FillAnyPDF.com సైట్ ని చూడండి.
ధన్యవాదాలు