విండోస్ లోని Remote Desktop Connection అనే ఫీచర్ ని వుపయోగించి నెట్ వర్క్ లో వున్న విండోస్ కంప్యూటర్ ని యాక్సెస్ చెయ్యవచ్చు. దీని కోసం ఈ క్రింది విధంగా చెయ్యాలి.
౧. నెట్ వర్క్ లోని ఏ కంప్యూటర్ ని అయితే యాక్సెస్ చెయ్యాలనుకొంటున్నామో ఆ కంప్యూటర్ లో My Computer పై మౌస్ రైట్ క్లిక్ చేసి Properties ని సెలెక్ట్ చేసుకోవాలి.
౧. నెట్ వర్క్ లోని ఏ కంప్యూటర్ ని అయితే యాక్సెస్ చెయ్యాలనుకొంటున్నామో ఆ కంప్యూటర్ లో My Computer పై మౌస్ రైట్ క్లిక్ చేసి Properties ని సెలెక్ట్ చేసుకోవాలి.
౨. ఇప్పుడు System Properties డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది అక్కడ Remote టాబ్ ని సెలెక్ట్ చేసుకొని Remote Desktop దగ్గరవున్న Allow users to connect remotely to this computer దగ్గర క్లిక్ చెయ్యాలి. ఇలా చెయ్యటం వలన నెట్ వర్క్ లోని అందరు యూజర్లు ఆ కంప్యూటర్ డెస్క్ట్ టాప్ ని యాక్సెస్ చెయ్యగలరు లేదు కావలసిన యూజర్లను మాత్రమే allow చెయ్యటానికి ’Select Remote Users' పై క్లిక్ చేసి కావలసిన యూజర్లను యాడ్ చేసుకోవచ్చు.
పైన చెప్పిన మార్పులు చేసిన తర్వాత System Properties డైలాగ్ బాక్స్ లో 'OK' పై క్లిక్ చెయ్యాలి. ఈ సిస్టం యొక్క computer name ని గుర్తు పెట్టు కోవాలి.
౩. ఇప్పుడు వేరొక కంప్యూటర్ కి వెళ్ళి Start ---> All Programs ---> Accessories ---> Remote Desktop Connection పై క్లిక్ చెయ్యాలి. Remote Desktop Connection డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఇంతకుముందు మార్పులు చేసిన సిస్టం యొక్క పూర్తి Computer Name ఎంటర్ చేసి Connect బటన్ పై క్లిక్ చేస్తే లాగిన్ విండో ఓపెన్ అవుతుంది. అక్కడ యాక్సెస్ చెయ్యవలసిన సిస్టం యూజర్ నేమ్ మరియు పాస్ వార్డ్ ఎంటర్ చేసి ఆ రిమోట్ సిస్టం డెస్క్ట్ టాప్ ని యాక్సెస్ చెయ్యవచ్చు.
ధన్యవాదాలు