అంతర్జాలంలో వివిధ సైట్లలో విహరించేటప్పుడు రిజిస్ట్రేషన్ సమయంలో ఈ-మెయిల్ అడ్రస్ ఇవ్వవలసివస్తుంది, తర్వాత ఆ సైట్ నుండి మెయిల్స్ వస్తూ ఒక్కొక్క సారి మనకు చిరాకు తెప్పిస్తూ ఉంటాయి, ఒరిజినల్ మెయిల్ ఐడీ ఇవ్వకుండా టెంపరరీ మెయిల్ ఐడీ సృష్టించు కోవటానికి TrashMail.Net అనే ఫైర్‍ఫాక్స్ యాడ్-ఆన్ సహాయపడుతుంది. కొంత కాల పరిమితి వరకు టెంపరరీ మెయిల్ పనిచేసేలా సెట్ చేసుకోవచ్చు, ఆ ఐడీకి వచ్చే మెయిల్స్ మన ఒరిజినల్ ఐడీకే వస్తాయి. ఒక విధంగా స్పామ్ ని కూడా నిరోధించవచ్చు.
iPrint అనే ఉచిత వర్చువల్ ప్రింటర్ డ్రైవర్ ఆటోమాటిక్ గా అనవసరమైన పేజీలను తొలగించి, మల్టిపుల్ పేజీలను ఒకే పేజీలో వచ్చేలా చేసి మన ప్రింటింగ్ వ్యయాన్ని మరియు సమయాన్ని తగ్గిస్తుంది. ప్రింట్ లో అవసరం లేని వాటిని సెలెక్ట్ చేసుకొని మనం తొలగించే సదుపాయం కూడా ఉంది. దీంతో ప్రింటర్ ఇంక్ మరియు పేపర్ ని సేవ్ చెయ్యవచ్చు.
Livescribe Pen సాధారణ పెన్ వలే ఇంక్ ని కలిగి పేపర్ పై వ్రాసే విధంగా ఉంటుంది, దీనితో ప్రత్యేకమైన పేపర్ పై వ్రాసిన నోట్స్ ని ఇది రికార్డ్ చేస్తుంది, అవసరమైతే మీటింగ్ జరుగుతున్నప్పుడు నోట్స్ తో పాటు ఆడియో కూడా రికార్డ్ చెయ్యవచ్చు. ఇలా చేతితో వ్రాసిన నోట్స్ ని USB కేబుల్ సహాయంతో పీసీ లోకి లేదంటే డైరెక్ట్ గా గూగుల్ డాక్స్, ఎవర్ నోట్, ఈ-మెయిల్ , ఫేస్ బుక్ మొదలగు వాటికి పంపవచ్చు. Livescribe Pen ప్రారంభ ధర $99 , 2 GB స్టోరేజ్ ని కలిగి ఉంటుంది.
గూగుల్ డాక్స్ లో ఉన్న ఫైళ్ళను మరియు మన పీసీ లో ఉన్న ఫైళ్ళను సింక్రొనైజ్ (అనుసంధానించటానికి) Syncdocs అనే సింపుల్ అప్లికేషన్ ఉపయోగపడుతుంది. దీంతో గూగుక్ డాక్స్ కి ఫైళ్ళను ప్రత్యేకంగా అప్‌లోడ్ చెయ్యవలసిన అవసరం లేకుండా Syndocs ఆటోమాటిక్ ఫైళ్ళను క్లౌడ్ కి అప్‌లోడ్ చేస్తుంది, మనం చెయ్యవలసిందల్లా ఫైళ్ళను My Google Docs ఫోల్డర్ లో వెయ్యటమే. అంతే కాకుండా గూగుల్ డాక్స్ లోని ఫైళ్ళు అదే ఫోల్డర్ లోకి డౌన్లోడ్ చెయ్యబడతాయి. దీంతో మన పీసీ లోని ఫైళ్ళను ఎప్పుడైనా ఎక్కడనుండైనా యాక్సెస్ చెయ్యవచ్చు. మనం ఏదైనా ఫైల్ ఒకచోట తొలగిస్తే అది రెండవచోట కూడా తొలగించబడుతుంది.
Sync Docs డెమో ఇక్కడ చూడండి:
Syncdocs డౌన్లోడ్ మరియు మరింత సమాచారం కోసం ఇక్కడ చూడండి.
మనం పీసీ/లాప్ టాప్ మీద పనిచేసేటప్పుడు సరైన విధంగా (posture) కూర్చోవాలి, లేకపోతే నడుం, మెడ , కాళ్ళు మొ. నొప్పులు వచ్చే అవకాశం ఉంది. ఆఫీస్ లేదా ఇంట్లో లేదా ప్రయాణాలలో లాప్ టాప్ ఉపయోగించే వారు ఏ విధంగా కూర్చోవాలనే దానిపై వోడాఫోన్ విడుదల చేసిన చక్కని యానిమేటెడ్ వీడియోలను ఇక్కడ చూడండి.
Video A: Using a laptop at home or office
Video B: Using your laptop while travelling or in a hotel
కడప లోజరగనున్న ఉప ఎన్నికల ప్రక్రియను ఆన్‌లైన్ లో లైవ్ చూడవచ్చు. దీనికోసం పోలింగ్ కేంద్రాలలో కెమేరాలను అమర్చారు. ఓటర్లు కెమేరాల ముందుకు వచ్చి తమ వివరాలు చెప్పాలి. ఎన్నికలలో రిగ్గింగ్ ని అరికట్టడానికి మరియు పారదర్శకత కోసం ఈ నిబంధనను పెట్టారు. ఈ ప్రక్రియను ఎవరైనా ఎక్కడనుండైనా వీక్షించటానికి వీలుగా ఆన్‌లైన్ లో లైవ్ ఇస్తున్నారు. దీనికోసం ఎలక్షన్ కమిషన్ సైట్ http://ceoandhra.nic.in/ లో సందర్శించండి.
మైక్రోసాప్ట్ వారి వైరస్, స్పైవేర్ మరియు మాల్వేర్ ప్రొటెక్షన్ సాప్ట్ వేర్ అయిన సెక్యూరిటీ ఎస్సెన్షియల్స్ సిగ్నేచర్ డాటాబేస్ డైరెక్ట్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటేనే అప్ డేట్ అయ్యేది, లేదంటే కనుక డాటాబేస్ సెపరేట్ గా డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకోవాల్సి వచ్చేది. నెట్ వర్క్ (LAN) సిస్టం లో ఒక ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకొని ప్రాక్సీ ద్వారా పీసీ లలో ఇంటర్నెట్ యాక్సెస్ చేస్తున్నా సెక్యూరిటీ ఎస్సెన్షియల్స్ సిగ్నేచర్ డాటాబేస్ ప్రాక్సీ ద్వారా అప్ డేట్ అయ్యేది కాదు.అయితే ఇప్పుడు సెక్యూరిటీ ఎస్సెన్షియల్స్ ని http://www.microsoft.com/en-in/security_essentials/default.aspx నుండి డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకుంటే సిగ్నేచర్ డాటాబేస్ ప్రాక్సీ ద్వారా కూడా అప్ డేట్ అవుతుంది.
ఇంటర్నెట్ కనెక్షన్ లేని వాళ్ళు సిగ్నేచర్ డాటాబేస్ డౌన్లోడ్ చేసుకొని ఆఫ్ లైన్ లో ఇనస్టలేషన్ చేసుకోవటానికి, ఈ క్రింది లింకులను క్లిక్ చెయ్యండి:
సైట్ కి వెళ్ళి గూగుల్ ఎకౌంట్ తో సైన్ఇన్ అయిన తర్వాత అక్కడే ఉన్న Create Video పై క్లిక్ చెయ్యాలి. Choose a collection to start making movies! దగ్గర నచ్చిన కలెక్షన్ దగ్గర ఒక యాక్టరా లేదా ఇద్దరు కావాలా అనే దానికి సంబంధించిన బటన్ పై క్లిక్ చెయ్యాలి. ఇక ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ సెట్, యాక్టర్లు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ లను వాటికి సంబంధించిన టాబ్ లలో ఎంచుకోవాలి. తర్వాత స్టోరీ టాబ్ లో ఆయా యాక్టర్లు చెప్పవలసిన డైలగ్స్ ని టైప్ చెయ్యలి. ఎంతవరకు డైలాగ్స్ అవసరమో అంతవర్కు టెక్స్ట్ టైఅ చెయ్యటానికి అక్కడే ఉన్న + పై క్లిక్ చేస్తూ వెళ్ళాలి. తయారు చేసుకున్న వీడియో ప్రివ్యూ చూడటానికి Preview దగ్గర ఉన్న FlipBook పై క్లిక్ చెయ్యాలి. అలానే మన తయారుచేసుకున్న వీడియో యూట్యూబ్ లో పబ్లిష్ చేయ్యటానికి YouTube పై క్లిక్ చెయ్యాలి. చూశారు కదా యానిమేటెడ్ వీడియో తయారుచెయ్యటం ఎంత సులువో.
మరింత సమాచారం మరియు వీడియో ట్యుటోరియల్ కై ఇక్కడ చూడండి.
మీరు ఫేస్‍బుక్ యూజర్లు అయితే కనుక మీకు Like గురించి తెలిసే ఉంటుంది, అటువంటిదే Google + 1 (ప్లస్ ఒన్) బటన్ కూడా. గూగుల్ లో మనం సెర్చ్ చేసినప్పుడు వచ్చే సెర్చ్ రిజల్ట్స్ లో వెబ్ పేజీల ప్రక్కన ఈ +1 బటన్ వస్తుంది, దాని పై క్లిక్ చేస్తే "I Like This Page" అని చెప్పినట్లే మరియు ఆ పేజీని మనం రికమెండ్ చేస్తున్నట్లు పబ్లిక్ గూగుల్ ప్రొపైల్ లో చూపుతుంది.
Google + 1 కి సంబంధించిన వీడియో ఇక్కడ చూడండి:
వీడియో చూశారు కదా! ఇప్పుడు గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ లో + 1 బటన్ రావాలంటే ఏమి చెయ్యాలో చూద్దాం .
౨. ఇప్పుడు గూగుల్ ఎకౌంట్ తో సైన్ ఇన్ చెయ్యాలి, తర్వాత Join this Experiment పై క్లిక్ చెయ్యాలి.
3.google.com కి వెళ్ళి మనకు కావల్సిన దానికై సెర్చ్ చెయ్యాలి. ఇప్పుడు సెర్చ్ రిజల్ట్స్ లో వెబ్ పేజీల ప్రక్కన +1 బటన్ ని చూడవచ్చు.
4. మనకు నచ్చిన దాని ప్రక్కన ఉన్న ప్లస్ బటన్ పై క్లిక్ చెయ్యటం ద్వారా ఆ పేజీని మనం రికమండ్ చేసినట్లు గా మన పబ్లిక్ ప్రొఫైల్ లో చూపబడుతుంది. తర్వాత Create Profile and +1 పై క్లిక్ చెయ్యాలి అంతే.
ఇక నచ్చిన ప్రతి పేజి దగ్గర ఉన్న ప్లస్ బటన్ దగ్గర క్లిక్ చెయ్యటమే.
ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా ఆన్‍లైన్ లో పెద్ద ఫైళ్ళను షేర్ చేసుకోవటానికి ఉపయోగపడే కొన్ని సైట్ల గురించి ఇంతకు ముందు పోస్టులలో తెలుసుకున్నాం. ఇప్పుడు మరికొన్ని సైట్ల గురించి తెలుసుకుందాం. ఆయా సైట్లకు ఫైళ్ళను అప్‍లోడ్ చెయ్యగా వచ్చే లింకులను కావలసిన వారితో షేర్ చేసుకొని నిర్ణీత సమయం లో అవతలి వారు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫైళ్ళను డ్రాగ్-అండ్-డ్రాప్ చేసి ఫైళ్ళను అప్‍లోడ్ చెయ్యవచ్చు. కొన్ని సైట్లలో షేర్ చెయ్యవలసిన లింకులను పాస్‍వార్డ్ తో ప్రొటెక్ట్ చేసుకొనే సదుపాయం కూడా ఉంటుంది.
ఇదేంటి ఆర్టీసీ ఎప్పుడో ఆన్‍లైన్ రిజర్వేషన్ ని ప్రారంభిస్తే ఇప్పుడు క్రొత్తగా స్టార్ట్ చెయ్యటం అనుకుంటున్నారా? APSRTC తమ ఆన్‍లైన్ బుకింగ్ సైట్ ని మార్చింది, ఇంతకుముందు apsrtc.in అనే సైట్ లో టికెట్లు బుక్ చేసుకొనే వాళ్ళం, అదెప్పుడూ సర్వర్ బిజీ అని వచ్చేది , నేను అనేక సార్లు ప్రయత్నించగా ఓ మూడు సార్లు మాత్రమే టికెట్ బుక్ చెయ్యగలిగా, ఇప్పుడు సైట్ మారింది అదే http://apsrtconline.in/. పాత సైట్ లోని యూజర్ ఐడీ ఇక్కడ చెల్లదు, క్రొత్తగా క్రియేట్ చేసుకోవాల్సిందే.
BARAT (Bus Advanced Reservation Anywhere Travel) పేరుతో ఆర్టీసీ ఆన్‍లైన్ టికెట్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది, దానికోసం http://apsrtconline.in/ సైట్ సందర్శించాలి, ఇక్కడ సీట్ల లభ్యత తెలుసుకోవచ్చు మరియు టికెట్ కూడా బుక్ చేసుకోవచ్చు. టికెట్ బుకింగ్ కోసం e-ticket reservation దగ్గర ఉన్న Login పై క్లిక్ చెయ్యాలి. Sign Up పై క్లిక్ చేసి యూజర్ ఐడీ, పాస్ వార్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. లాగిన్ అయిన తర్వాత Book Now Tickets దగ్గర ఎక్కవలసిన మరియు చేరవలసిన ప్రదేశం,ప్రయాణపు తేదీ తదితర వివరాలు ఎంటర్ చేసి Check Availability పై క్లిక్ చేస్తే సర్వీసులను చూపిస్తుంది. కావలసిన దానిని ఎంచుకొని డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ సహాయంతో టికెట్ కొనుక్కోవచ్చు.
ఆన్‌లైన్ రిజర్వేషన్ల విషయంలో కర్ణాటక ఆర్టీసీ చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.