మీరు ఫేస్‍బుక్ యూజర్లు అయితే కనుక మీకు Like గురించి తెలిసే ఉంటుంది, అటువంటిదే Google + 1 (ప్లస్ ఒన్) బటన్ కూడా. గూగుల్ లో మనం సెర్చ్ చేసినప్పుడు వచ్చే సెర్చ్ రిజల్ట్స్ లో వెబ్ పేజీల ప్రక్కన ఈ +1 బటన్ వస్తుంది, దాని పై క్లిక్ చేస్తే "I Like This Page" అని చెప్పినట్లే మరియు ఆ పేజీని మనం రికమెండ్ చేస్తున్నట్లు పబ్లిక్ గూగుల్ ప్రొపైల్ లో చూపుతుంది.
Google + 1 కి సంబంధించిన వీడియో ఇక్కడ చూడండి:
వీడియో చూశారు కదా! ఇప్పుడు గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ లో + 1 బటన్ రావాలంటే ఏమి చెయ్యాలో చూద్దాం .
౧. ముందుగా http://www.google.com/+1/button/ సైట్ కి వెళ్ళి అక్కడ ఉన్న Opt in పై క్లిక్ చెయ్యాలి.౨. ఇప్పుడు గూగుల్ ఎకౌంట్ తో సైన్ ఇన్ చెయ్యాలి, తర్వాత Join this Experiment పై క్లిక్ చెయ్యాలి.
3.google.com కి వెళ్ళి మనకు కావల్సిన దానికై సెర్చ్ చెయ్యాలి. ఇప్పుడు సెర్చ్ రిజల్ట్స్ లో వెబ్ పేజీల ప్రక్కన +1 బటన్ ని చూడవచ్చు.
4. మనకు నచ్చిన దాని ప్రక్కన ఉన్న ప్లస్ బటన్ పై క్లిక్ చెయ్యటం ద్వారా ఆ పేజీని మనం రికమండ్ చేసినట్లు గా మన పబ్లిక్ ప్రొఫైల్ లో చూపబడుతుంది. తర్వాత Create Profile and +1 పై క్లిక్ చెయ్యాలి అంతే.
ఇక నచ్చిన ప్రతి పేజి దగ్గర ఉన్న ప్లస్ బటన్ దగ్గర క్లిక్ చెయ్యటమే.
ధన్యవాదాలు