Sunday, May 1, 2011

APSRTC - ఆన్‍లైన్ టికెట్ రిజర్వేషన్ ప్రారంభం!!!

ఇదేంటి ఆర్టీసీ ఎప్పుడో ఆన్‍లైన్ రిజర్వేషన్ ని ప్రారంభిస్తే ఇప్పుడు క్రొత్తగా స్టార్ట్ చెయ్యటం అనుకుంటున్నారా? APSRTC తమ ఆన్‍లైన్ బుకింగ్ సైట్ ని మార్చింది, ఇంతకుముందు apsrtc.in అనే సైట్ లో టికెట్లు బుక్ చేసుకొనే వాళ్ళం, అదెప్పుడూ సర్వర్ బిజీ అని వచ్చేది , నేను అనేక సార్లు ప్రయత్నించగా ఓ మూడు సార్లు మాత్రమే టికెట్ బుక్ చెయ్యగలిగా, ఇప్పుడు సైట్ మారింది అదే http://apsrtconline.in/. పాత సైట్ లోని యూజర్ ఐడీ ఇక్కడ చెల్లదు, క్రొత్తగా క్రియేట్ చేసుకోవాల్సిందే.

BARAT (Bus Advanced Reservation Anywhere Travel) పేరుతో ఆర్టీసీ ఆన్‍లైన్ టికెట్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది, దానికోసం http://apsrtconline.in/ సైట్ సందర్శించాలి, ఇక్కడ సీట్ల లభ్యత తెలుసుకోవచ్చు మరియు టికెట్ కూడా బుక్ చేసుకోవచ్చు. టికెట్ బుకింగ్ కోసం e-ticket reservation దగ్గర ఉన్న Login పై క్లిక్ చెయ్యాలి. Sign Up పై క్లిక్ చేసి యూజర్ ఐడీ, పాస్ వార్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. లాగిన్ అయిన తర్వాత Book Now Tickets దగ్గర ఎక్కవలసిన మరియు చేరవలసిన ప్రదేశం,ప్రయాణపు తేదీ తదితర వివరాలు ఎంటర్ చేసి Check Availability పై క్లిక్ చేస్తే సర్వీసులను చూపిస్తుంది. కావలసిన దానిని ఎంచుకొని డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ సహాయంతో టికెట్ కొనుక్కోవచ్చు.


ఆన్‌లైన్ రిజర్వేషన్ల విషయంలో కర్ణాటక ఆర్టీసీ చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

వెబ్ సైట్: APSRTC Online Reservation