Thursday, May 5, 2011

Xtranormal Movie Maker - ఆన్‌లైన్ లో యానిమేటెడ్ వీడియోలు తయారుచెయ్యటానికి!!!

Xtranormal Movie Maker అనే ఉచిత టూల్ ని ఉపయోగించి ఆన్‌లైన్ లో యానిమేషన్లను తయారుచేసుకోవచ్చు. దీనికై గూగుల్ ఎకౌంట్ తప్పని సరి.  http://www.youtube.com/create_detail/Xtranormal 
సైట్ కి వెళ్ళి గూగుల్ ఎకౌంట్ తో సైన్ఇన్ అయిన తర్వాత అక్కడే ఉన్న Create Video పై క్లిక్ చెయ్యాలి. Choose a collection to start making movies! దగ్గర నచ్చిన కలెక్షన్ దగ్గర ఒక యాక్టరా లేదా ఇద్దరు కావాలా అనే దానికి సంబంధించిన బటన్ పై క్లిక్ చెయ్యాలి. ఇక ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ సెట్, యాక్టర్లు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ లను వాటికి సంబంధించిన టాబ్ లలో ఎంచుకోవాలి. తర్వాత స్టోరీ టాబ్ లో ఆయా యాక్టర్లు చెప్పవలసిన డైలగ్స్ ని టైప్ చెయ్యలి. ఎంతవరకు డైలాగ్స్ అవసరమో అంతవర్కు టెక్స్ట్ టైఅ చెయ్యటానికి అక్కడే ఉన్న + పై క్లిక్ చేస్తూ వెళ్ళాలి. తయారు చేసుకున్న వీడియో ప్రివ్యూ చూడటానికి Preview దగ్గర ఉన్న FlipBook పై క్లిక్ చెయ్యాలి. అలానే మన తయారుచేసుకున్న వీడియో యూట్యూబ్ లో పబ్లిష్ చేయ్యటానికి YouTube పై క్లిక్ చెయ్యాలి. చూశారు కదా యానిమేటెడ్ వీడియో తయారుచెయ్యటం ఎంత సులువో.


మరింత సమాచారం మరియు వీడియో ట్యుటోరియల్ కై ఇక్కడ చూడండి.