Friday, July 22, 2011

మీరు ఆధార్ కార్డ్ తీసుకున్నారా?

ఆధార్ అదేనండీ యూనిక్ ఐడీ కార్డ్ ...అది లేకపోతే వంట గ్యాస్, రేషన్ మరియు ప్రభుత్వం అందించే ఇతర రాయితీలు తీసుకోలేము. ఆధార్ నమోదు ప్రక్రియ మొదటి విడతగా అదిలాబాద్,అనంతపూర్, చిత్తూర్,తూర్పు గోదావరి, హైదరాబాద్, రంగారెడ్డి మరియు శ్రీకాకుళం జిల్లాలలో ప్రారంభించారు.  సామాన్యులు ఆధార్ కార్డ్ నమోదుచేసుకుంటున్నా / తీసుకుంటున్నా మధ్యతరగతి వారినుండి మాత్రం స్పందన అంతంత మాత్రమే. ఆధారు కార్డ్ ఎన్‌రోల్ చేసుకోవటానికి సమీప నమోదు కేంద్రాన్ని సంప్రదించి ఎన్‌రోల్‌మెంట్ ఫార్మ్ నింపి అడ్రస్ ఫ్రూఫ్, ఫోటో ఐడీ, డేట్ ఆఫ్ బర్త్ ఫ్రూఫ్ జతచేసి మనకు కేటాయించిన తారీఖున వెళితే కుటుంబ సభ్యుల అందరి ఫోటో, ఐరిస్,మరియు ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు. ఆధార్ కార్డ్ పోస్ట్ లో మనకు పంపిస్తారు. కొన్ని నమోదు కేంద్రాలలో డైరెక్ట్ గా ఫారం మరియు జతచెయ్యవలసిన పత్రాలతో వెళితే అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చెయ్యవచ్చు.       


ఇక ఆన్‌లైన్ లోకూడా ఎన్‌రోల్ చేసుకునే సదుపాయం కూడా కలదు దానికై ఇక్కడ క్లిక్ చెయ్యండి. సైట్ కి వెళ్ళిన తర్వాత రేషన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసి Get Deatils పై క్లిక్ చేసి మన వివరాలు ఎంటర్ చెయ్యాలి. రేషన్ కార్డ్ లేని వారు New Family Registration పై క్లిక్ చేసి తర్వాత Get Details పై క్లిక్ చెయ్యాలి.



ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఫార్మ్ పీడీఎఫ్ ఫైల్ ని ఇదే సైట్ నుండి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు.

ఆధార్ కార్డ్ నమోదు కేంద్రాలు మరియు యితర సమాచారం కోసం సివిల్ సఫ్లై వారి సైట్ ఇక్కడ చూడండి.

Important Sites: AP AdhaarAP Civil Supplies ,  UIDAI


ధన్యవాదాలు