Tuesday, July 19, 2011

PDFescape - ఆన్‍లైన్ పీడీఎఫ్ ఎడిటర్!!

PDFescape  అనే సైట్ కి వెళ్ళి పీడీఎఫ్ ఫైళ్ళను అప్ లోడ్ చేసి వాటి టెక్స్ట్, ఇమేజ్ మొదలగు ఫీల్డ్స్ ని ఎడిట్ చెయ్యవచ్చు. ఉచిత వెర్షన్ లో 10 MB సైజ్ కలిగిన పీడీఎఫ్ ఫైళ్ళను ఎడిట్ చెయ్యవచ్చు. అవసరం అనుకుంటే సైట్ లో  రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లేకున్నా ఫైల్స్ ని ఎడిట్ చేసుకోవచ్చు.

PDFescape  సైట్ కి వెళ్ళి Click Here To Use PDFescape Now Free! పై క్లిక్ చేసి తర్వాత Edit PDF Files పై క్లిక్ చేసి తర్వాత Upload PDF to PDFescape పై క్లిక్ చేసి ఎడిట్ చెయ్యవలసిన పీడీఎఫ్ పైల్ ని ఎంచుకొని Upload పై క్లిక్ చెయ్యాలి. ఫైల్ అప్ లోడ్ అయిన తర్వాత ఈ క్రింది చిత్రం లో చూపిన విధంగా ఎడమచేతి ప్రక్క మూడు టాబ్స్ Insert, Annotate, Page లలో ఉన్న టూల్స్ ని ఉపయోగించి మన పీడీఎఫ్ పైల్ ని ఎడిట్ చెయ్యవచ్చు.






ఎడిట్ చేసిన ఫైల్ ని సేవ్ చేసుకొని డౌన్లోడ్, ప్రింట్ మరియు షేర్ కూడా చేసుకోవచ్చు.






వెబ్ సైట్: PDFescape

ధన్యవాదాలు