Wednesday, October 17, 2012

Road To Grammar - ఇంగ్లీష్ గ్రామర్ స్కిల్స్ మెరుగుపర్చుకోవటానికి ఒక మంచి సైట్!!

ఇంగ్లీష్ గ్రామర్ స్క్రిల్స్ ఇంప్రూవ్ చేసుకోవటానికి Road To Grammar అనే వెబ్ సైట్ ఉపయోగపడుతుంది. దీనిలో 365 క్విజ్ లు, గ్రామర్ కి సంబంధించిన గేమ్స్, వీలున్నప్పుడు ప్రాక్టీస్ చేసుకోవటానికి డౌన్లోడ్స్ ఉన్నాయి.ఈ సైట్ ఉపయోగించటానికి ఎటువంటి రిజిస్టేషన్ అవసరం లేదు  పూర్తిగా ఉచితం. 


’Quizzes' లో నచ్చిన టాపిక్ ని ఎంచుకొని ప్రక్కనే ఉన్న ’Start' పై క్లిక్ చెయ్యాలి. క్విజ్ లో వచ్చే ప్రశ్నలకు సరైన సమాధానం పై క్లిక్ చెయ్యాలి, తప్పైన జవాబుకు సరైన సమాధానం అప్పుడే తెలుస్తుంది. ఇక్కడ క్విజ్ లో 365 టాపిక్స్ ఉన్నాయి. ’Extra Practice' లో ఉదాహరణ సహితంగా వివరణ ఉంటుంది. 

వెబ్ సైట్: Road To Grammar

ధన్యవాదాలు

Tuesday, October 16, 2012

చదవగానే అదృశ్యమయ్యే సీక్రెట్ మెసేజెస్ పంపాలా?

పాస్ వార్డ్స్ లేదా ఏదైనా రహస్యసమాచారం కావలసిన వారికి పంపినపుడు, అది వారు చదవగానే అదృశ్యమవ్వాలా? అయితే మీరు డిజిటల్ ఇస్పిరేషన్ రూపొందించిన గూగుల్ షీట్ ని మీ అకౌంట్ లో కాపీ చేసుకొని, ఆషీట్ లో ఎక్కడైనా రహస్య సమాచారాన్ని టైప్ చేసి 'Share' బటన్ పై క్లిక్ చేసి కావలసిన వారికి మెయిల్ పంపవచ్చు. షేర్ విండో లో పర్మిషన్ 'Can Edit' ఉండేలా చూసుకోవాలి. మనం పంపిన మెయిల్ రిసీవ్ చేసుకున్న వారు మనం పంపిన గూగుల్ షీట్ లోని సమాచారాన్ని పది సెకన్లలో చదవాలి, పది సెకన్ల తర్వాత అక్కడ సమాచారం అదృశ్యమయ్యేలా గూగుల్ షీట్ కి గూగుల్ అప్స్ స్క్రిప్ట్ జతచెయ్యబడింది.  


మరింత సమాచారం కోసం డిజిటల్ ఇస్ఫిరేషన్ సైట్ చూడండి.
గూగుల్ షీట్
ధన్యవాదాలు

Friday, October 12, 2012

CarotDav - క్లౌడ్ స్టోరేజ్ సర్వీసెస్ ని ఒకేచోట నుండి యాక్సెస్ చెయ్యటానికి!!!

క్లౌడ్ స్టోరేజ్ సర్వీసెస్ ని అందిస్తున్న ప్రముఖ Dropbox, SkyDrive, Google Drive, మరియు SugarSync లను ఒకే చోట నుండి యాక్సెస్ చెయ్యటానికి  ఉచిత ఆల్-ఇన్-వన్ డెస్క్ టాప్ అప్లికేషన్  CarotDav ఉపయోగపడుతుంది. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఆయా సైట్ల కి ఫైళ్ళను అప్ లోడ్ చెయ్యవచ్చు. ఆయా సైట్ల ఆథెంటికేషన్  ప్రాసెస్ కూడా చాలా సులువు.  


డౌన్లోడ్: CarotDav

ధన్యవాదాలు

Thursday, October 11, 2012

RailRadar - కావలసిన రైలు ప్రస్తుతం ఎక్కడ ఉందో గూగుల్ మాప్స్ లో తెలుసుకోవటానికి!!


భారత రైల్వే RailRadar  అనే సర్వీస్ ని ప్రారంభించింది, దీనిని ఉపయోగించి మనకు కావలసిన రైలు యొక్క ప్రస్తుత జియోగ్రాఫికల్ లోకేషన్ ని గూగుల్ మాప్స్ లో చూడవచ్చు.  రైలు యొక్క రాక/ పోకలు తెలుసుకోవటానికి  కావలసిన స్టేషన్ కోసం మ్యాప్ పై జూమ్ ఇన్ చెయ్యాలి అది మౌస్ సహాయంతో గాని లేదా ఎడమచేతి ప్రక్కన ఉన్న + గుర్తు పై క్లిక్ చెయ్యవచ్చు. ఇలా కావలసిన స్టేషన్ కి వెళ్ళి అక్కడ ఉన్న కావలసిన ట్రైన్ గుర్తు పై క్లిక్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. రైలు యొక్క ప్రస్తుత లొకేషన్ తో పాటు రూట్ మరియు ఆగే స్టేషన్లను కూడా తెలుసుకోవచ్చు.  బ్లూ కలర్ లో ఉన్నవి సరైన సమయం లో మరియు రెడ్ కలర్ లో ఉన్నవి ఆలస్యంగా నడుస్తున్నవని అర్ధం. ప్రతి ఐదు నిమిషాలకు ఇక్కడ సమాచారం రిఫ్రెష్ అవుతుంది.



వెబ్ సైట్: RailRadar

ధన్యవాదాలు

Friday, October 5, 2012

Personal Passwords Generator - ఉచిత పాస్ వార్డ్ జెనెరేటర్

ప్రముఖ LeluSoft వారు రూపొందించిన మరొక ఉచిత అప్లికేషన్ Personal Passwords Generator, దీనిని ఉపయోగించి 14 విధాలుగా వివిధ కాంబినేషన్లలో పాస్ వార్డ్ లను జెనెరేట్ చేసుకోవచ్చు. ముందుగా Personal Passwords Generator ని డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకోవాలి, ఇనస్టలేషన్ సమయం లో కొన్ని టూల్ బార్స్ ఇనస్టలేషన్ అవకుండా వాటిని అన్-చెక్ చెయ్యాలి. అప్లికేషన్ లాంచ్ చేసిన తర్వాత Paasword type దగ్గర కావలసిన కాంబినేషన్ ని ఎంచుకోవాలి తర్వాత Password Length దగ్గర క్యారెక్టర్ లెంగ్త్ ఇవ్వాలి. పాస్ వార్డ్ జెనెరేట్ చెయ్యటం కోసం ’Key' గుర్తు ఉన్న బటన్ పై క్లిక్ చెయ్యాలి. జెనెరేట్ అయిన పాస్ వార్డ్ నచ్చకపోతే మరొక దానికై ’Key' గుర్తు ఉన్న బటన్ పై క్లిక్ చేస్తూ ఉండాలి. ’Lock' బటన్ పై క్లిక్ చేసి పాస్ వార్డ్ ని ఎన్ క్రిప్ట్ చేసుకోవచ్చు మరియు ’Save' బటన్ పై క్లిక్ చేసి పాస్ వార్డ్ ని .txt పైల్ గా సేవ్ చేసుకోవచ్చు. Encrypt చేసిన పాస్ వార్డ్ ని Decript కూడా చెయ్యవచ్చు.


ఫీచర్లు: 
- Only 1.06 mb
- Portable (after the first installation)
- A single executable
- Simple to use and fast
- 14 Different passwords types
- Custom password type let you set the base characters set
- Passwords can be saved encrypted
Freeware

డౌన్లోడ్:Personal Passwords Generator

ధన్యవాదాలు

Thursday, October 4, 2012

Jumpshare - ఆన్ లైన్ లో పెద్ద ఫైళ్ళను షేర్ చెయ్యటానికి మరియు వాటిని చూడటానికి!!

ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా పెద్ద పెద్ద ఫైళ్ళను వేగంగా మరియు సులభంగా అందరితో షేర్ చేసుకోవటానికి Jumpshare అనే ఉచిత ఆన్ లైన్ సర్వీస్ ఉపయోగపడుతుంది. ఫైళ్ళను డ్రాగ్-అండ్-డ్రాప్ చేసి లేదా  ’Select the files to Share' పై క్లిక్ చేసి కూడా షేర్ చెయ్యవలసిన ఫైళ్ళను అప్ లోడ్ చెయ్యవచ్చు. ఒకేసారి ఒకటికన్నా ఎక్కువ ఫైళ్ళను అప్ లోడ్ చెయ్యవచ్చు. 2GB వరకు ఎన్ని ఫైళ్ళనైనా అప్ లోడ్ చెయ్యవచ్చు.  ఫైల్ అప్ లోడ్ చేసిన తర్వాత వచ్చే లింక్ ని అవసరమైన వారితో షేర్ చేసుకోవచ్చు లేదా ఈ-మెయిల్ కూడా చెయ్యవచ్చు. షేర్ చేసిన ఫైల్ ని అవతలివారు అవసరమనుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే ఆన్ లైన్ లోనే ఫైల్ ని  ఓపెన్ చేసి చూడటానికి వ్యూయర్ కూడా   దీనిలోనే ఉంది. ఫైల్ వ్యూయర్ 200 పైగా ఫైల్ ఫార్మేట్లని సపోర్ట్ చేస్తుంది.  అప్ లోడ్ చేసిన ఫైల్ 2 వారాల వరకు ఉంటుంది.  


వెబ్ సైట్: Jumpshare 

ధన్యవాదాలు

Wednesday, September 26, 2012

7 Quick Fix - Windows 7 లో 108 కామన్ ఎర్రర్స్ ని ఫిక్స్ చెయ్యటానికి!!

ఎన్నో ఉచిత సాప్ట్  వేర్లను అందించిన leelusoft నుండి వస్తున్న మరో అవార్డ్ విన్నింగ్ యుటిలిటీ  7 Quick Fix. విండోస్ 7 లో వచ్చే రిజిస్ట్రీ ఎర్రర్స్, సిస్టం సమస్యలను తొలగించటం లో ఈ చిన్న (1.1MB) పోర్టబుల్ యుటిలిటీ సహాయపడుతుంది. ఈ యుటిలిటీ తో 7 లోని 108 సమస్యలను ఫిక్స్ చెయ్యవచ్చు మరియు ప్రతీ సమస్యని ఒకేఒక మౌస్ క్లిక్ తో ఫిక్స్ చెయ్యవచ్చు. 



 Main Features:
- 108 fixes
- Only 1.1MB
- Portable, can run from a USB drive or stick
- Each fix is applied with a single mouse click
- Auto saving the changed settings for a quick rollback
- On screen information for every fix
- Fixes are divided into 6 categories (Enable / Disable, Restore missing stuff, Performance, Errors and Crashes, Tweaks, Files Association)
- No scanning or other resource consuming process, just execute and click.

ప్రతీ విండోస్ ౭ యూజర్ దగ్గర తప్పకుండా ఉండవలసిన యుటిలిటీ ఇది.

డౌన్లోడ్: 7 Quick Fix

ధన్యవాదాలు

Tuesday, September 25, 2012

Piriform నుండి పీసీ ఆప్టిమైజేషన్ టూల్స్!!!

Pririform పీసీ పనితనాన్నిమెరుగు పరచటానికి నాలుగు అధ్బుతమైన టూల్స్ ని అందిస్తుంది. అవి 1.CCleaner 2.Defraaggler 3. Recuva 4.Speccy. వీటి గురించి ఇంతకుముందు చాలా పోస్ట్ లలో చూశాం ... అవి చూడని వారి కోసం మరొక్కసారి ఇక్కడ చెప్పటం జరిగింది.

౧. CCleaner
పీసీ లో పేరుకు పోయిన అనవసరమైన/ టెంపరరీ ఫైళ్ళను తొలగించి పీసీ వేగాన్ని పెంచటం తో పాటు హార్డ్ డిస్క్ స్పేస్ ఫ్రీ చెయ్యటం లో ఇది సహాయపడగలదు. టెంపరరీ ఫైళ్ళతోపాటు అనవసరమైన మరియు పాత రిజిస్ట్రీ ఎంట్రీలను తొలగించవచ్చు . మరింత సమాచారం మరియు డౌన్లోడ్ కోసం ఇక్కడ చూడండి. 


౨. Defraggler

సాధారణంగా హార్డ్ డ్రైవ్ ని డీఫ్రాగ్మెంట్ చెయ్యటానికి విండోస్ తో పాటు వచ్చే డీఫ్రాగ్మెంటేషన్ టూల్ ని వుపయోగిస్తాం, కాని ఇది చాలా స్లోగా మరియు ఎక్కువ సమయం పడుతుంది. ఇంటర్నెట్ లో లభించే వుచిత డీఫ్రాగ్మెంటేషన్ టూల్స్ ని వుపయోగించి హార్డ్ డ్రైవ్ లేదా సెలెక్టెడ్ పార్టీషన్ ని మాత్రమే డీఫ్రాగ్మెంట్ చేసుకోవచ్చు. అలా కాకుండా Defraggler కావలసిన ఫైల్, ఫోల్డర్ లేదా డ్రైవ్ ని డీఫ్రాగ్మెంట్ చేసుకోవచ్చు. కావలసిన ఫైల్, ఫోల్డర్ డీఫ్రాగ్మెంట్ చెయ్యటంవలన డీఫ్రాగ్మెంటేషన్ కి తక్కువ సమయం పడుతుంది. ఇది Windows 2000, 2003, XP and Vista లలో పని చేస్తుంది. USB డ్రైవ్ ల నుండి కూడా ఈ అప్లికేషన్ ని రన్ చేసుకోవచ్చు.

3.Recuva

పీసీ నుండి పొరపాటున తొలగించిన ఫైళ్ళను తిరిగి (రికవర్) పొందటానికి Recuva ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పాడైన లేదా ఫార్మేట్ చెయ్యబడిన డ్రైవ్ లనుండి కూడా డాటా రికవర్ చెయ్యవచ్చు. హార్డ్ డిస్క్ లతోపాటు , USB డ్రైవ్ , కెమేరా లేదా ఐపాడ్ లనుండి తొలగించిన డాటా రికవర్ చెయ్యవచ్చు.

౪. Speccy:

Speccy ని ఉపయోగించి మన కంప్యూటర్ కి సంబంధించిన సమగ్ర సమాచారం అంటే ప్రాసెసర్ బ్రాండ్ మరియు మోడల్, హార్డ్ డిస్క్ సైజ్ మరియు స్పీడ్, RAM, మదర్ బోర్డ్, ఆప్టికల్ డ్రైవ్, ఆపరేటింగ్ సిస్టం మొదలగు వాటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. My Computer పై మౌస్ రైట్ క్లిక్ చేసి Properties ని సెలెక్ట్ చేసుకొంటే మనకు మన సిస్టం కి సంబంధించిన కొంత సమాచారం మరియు Device Manager కి వెళితే హార్డ్ వేర్ కి సంబంధించిన సమాచారం టూకీ గా తెలుసుకోవచ్చు. అదే Speccy తో అయితే పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

ధన్యవాదాలు

Wednesday, September 19, 2012

వికీపీడియా వ్యాసాలతో ఈ-బుక్ లను తయారుచేసుకోవటం ఎలా?

అతి పెద్ద సమాచార భాంఢాగారమైన వికీపీడియా వ్యాసాలతో ఈ-బుక్ లను తయారుచేసుకొని అవసరమైనప్పుడు ఆఫ్ లైన్ లో చదువుకోవచ్చు. దీనికోసం వికీపీడీయా ఆంగ్ల సైట్ కి వెళ్ళి ఎడమ చేతి పైపున ఉన్న 'Pint/Export'దగ్గర ఉన్న 'Create a Book' పై క్లిక్ చెయ్యాలి.   


ఇక్కడ Start Book Creator పై క్లిక్ చేసి ఇక కావలసిన పేజీలతో ఈ-బుక్ లను తయారుచేసుకోవచ్చు. 


కావలసిన ఆర్టికల్ ని మన ఈ-బుక్ కి యాడ్ చెయ్యటానికి Book Creator దగ్గర ఉన్న Add this page to your Book పై క్లిక్ చెయ్యాలి అలానే యాడ్ చేసిన పేజీన తొలగించటానికి Remove this page from your Book పై క్లిక్ చెయ్యాలి. అలానే బుక్ ని ఎడిట్ చెయ్యటానికి లేదా డౌన్లోడ్ చెయ్యటానికి Show Book పై క్లిక్ చెయ్యాలి.


చివరగా ఈ-బుక్ లను పీడీఎఫ్, EPUB మొదలగు ఫార్మేట్లలో కావలసిన దానిని ఎంచుకుని డౌన్లోడ్ బటన్ పై క్లిక్ చెయ్యాలి.


మరింత సమాచారం కోసం ఇక్కడ చూడండి.

ధన్యవాదాలు

InfraRecorder - CDs / DVDs బర్న్ చెయ్యటానికి ఒక సింపుల్ యుటిలిటీ...

InfraRecorder - CDs/DVDs బర్న్ చెయ్యటానికి ఉపయోగపడే ఒక లైట్ వెయిట్ బర్నర్ టూల్ దీనిని ఉపయోగించటం కూడా చాలా సులువు. ఈ అప్లికేషన్ ని లాంచ్ చెయ్యగానే దానిలో ఆప్షన్లన్నీ ఒకేసారి వస్తాయి. డాటా మరియు ఆడియో /వీడియో బర్నింగ్ తో పాటు డిస్క్ ఇమేజ్ మరియు డ్యూయల్  DVD బర్నింగ్ లను సపోర్ట్ చేస్తుంది.  బర్న్ చెయ్యదలచిన ఫైళ్లను డ్రాగ్ అండ్ డ్రాప్ చెయ్యవచ్చు.  


Features

  • Create custom data, audio and mixed-mode projects and record them to physical discs as well as disc images.
  • Supports recording to dual-layer DVDs.
  • Blank (erase) rewritable discs using four different methods.
  • Record disc images (ISO and BIN/CUE).
  • Fixate discs (write lead-out information to prevent further data from being added to the disc).
  • Scan the SCSI/IDE bus for devices and collect information about their capabilities.
  • Create disc copies, on the fly and using a temporary disc image.
  • Import session data from multi-session discs and add more sessions to them.
  • Display disc information.
  • Save audio and data tracks to files (.wav, .wma, .ogg, .mp3 and .iso).

డౌన్లోడ్: InfraRecorder (InfraRecorder ఇనస్టలేషన్ ప్యాకేజ్ లో MP3 డీకోడర్ లేదు ఇదే సైట్ నుండి ఆప్లగిన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.)

ధన్యవదాలు 

Tuesday, September 18, 2012

3Dnator - 2D ఆన్ లైన్ ఇమేజ్ లను 3D లోకి మార్చటానికి!!!

3Dnator  అనే ఉచిత క్రోమ్ బ్రౌజర్ ఎక్స్ టెన్షన్ ని ఉపయోగించి 2D ఆన్ లైన్ ఇమేజ్ లను 3D లోకి మార్చవచ్చు, వాటిని 3D లో చూడటానికి 3D గ్లాసెస్ అవసరమవుతాయి. 3Dnator ఇనస్టలేషన్ చేసుకోవటానికి క్రొమ్ వెబ్ స్టోర్ కి వెళ్ళి ’Add to Chrome' పై క్లిక్ చెయ్యాలి.  3Dnator ని ఎనేబుల్ లేదా డిసేబుల్ చెయ్యటానికి ఆ ఎక్స్ టెన్షన్ పై క్లిక్ చెయ్యాలి. ఇక బ్రౌజర్ లో ఏదైనా సైట్ ఓపెన్ చేసి దానిలోని 2D ఇమేజ్ లను 3D లో చూడటానికి కావలసిన ఇమేజ్ పై మౌస్ రైట్ క్లిక్ చేసి ’3Dnator’ పై క్లిక్ చెయ్యాలి. ఇలా కావలసిన ఇమేజ్ నే కాకుండా ఆ వెబ్ పేజీ లోని మొత్తం ఇమేజ్లను 3D లో చూడవచ్చు.



డౌన్లోడ్: 3Dnator

ధన్యవాదాలు

Saturday, September 8, 2012

Puran Utilities - పీసీ ఫెర్ఫార్మెన్స్ మెరుగు పరచటానికి ఉపయోగపడే యుటీలిటీల సమాహారం..

పిసి పనితనాన్ని మెరుగు పరచటానికి మెయింటెనెన్స్ టూల్స్ ని ఉపయోగిస్తుంటాం.. అంతర్జాలంలంలో చాలా ఉచిత యుటీలిటీస్ లభిస్తున్నాయి, అలాంటిదే  Puran Utilities. దీనిలో డిస్క్ చెక్, అన్-ఇనస్టలర్, రిజిస్ట్రీ క్లీనర్, డీఫ్రాగ్, రికవరీ, ఫైల్ స్ప్లిట్టర్, షట్ డౌన్ టైమర్ ఇలా 20కి పైగా యుటిలిటీస్ ఉన్నాయి.  


యుటిలిటీల గురించి క్లుప్తంగా: 

 Disk CheckHelps you to fix errors, recover bad sectors on your hard disk using chkdsk.
 UninstallerHelps you to uninstall software that you do not need and also software that you are not able to uninstall otherwise.
 Puran Startup ManagerHelps you to enable/disable Windows startup items. It assists your decision in various forms.
 Puran Service ManagerHelps you to enable/disable Windows services. It assists your decision in various forms.
 Puran Disk CleanerHelps you to find and delete junk files from your computer. It is highly customizable too.
 Puran Delete Empty FoldersHelps you to delete empty folders from your system. It is extremely fast.
 Fix ShortcutsHelps you to automatically fix or delete broken shortcuts.
 Puran Registry CleanerHelps you to clean Windows registry for better performance.
 Puran Registry DefragHelps you to defrag and compact Windows registry for better performance.
 Puran DefragHelps you to automatically defrag and optimize your hard disk drives.
 Puran Duplicate File FinderHelps you to find duplicate files on your computer. It is highly customizable and extremely fast.
 Data RecoveryHelps you to recover data from your damaged media like scratched DVDs, VCDs, BLU Rays etc.
 Disk FilesHelps you to look into details of files distribution on your computer. It is highly customizable.
 Gaming PCHelps you to create a Gaming Environment on your PC to give your games/apps best of your computer.
 Permanent DeleteHelps you to delete your files permanently so that they cannot be recovered by any software.
 Puran Wipe DiskHelps you to wipe entire disk or just free space so that no files on it can be recovered.
 Puran Shutdown TimerHelps you to schedule various shutdown tasks. Many scheduling options are available.
 SplitterHelps you to spilt any file into files of specified size.
 Delete HistoryHelps you to delete history and other data of various applications including web browsers.
 Minimal PCHelps you to close and switch back all the specified services/processes on your computer in a click.
 Batch FixHelps you to automatically keep your system clean and error free by running selected utilities.
 Maintenance WizardHelps you to run selected utilities in a pre-defined order for getting best performance out of your computer.

డౌన్లోడ్: Puran Utilities

ధన్యవాదాలు

Thursday, September 6, 2012

Meeting.io - వెబ్ ఆధారిత వీడియో మీటింగ్స్!!!

ఎటువంటి సాప్ట్ వేర్ ఇనస్టలేషన్ చేసుకోకుండా మరియు రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా మీ బ్రౌజర్ లోనే ఆన్ లైన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించుకోవటానికి MeetingsIO అనే వెబ్ సర్వీస్ ఉపయోగపడుతుంది.  రిజిస్ట్రేషన్ చేసుకోవటం ద్వారా మీటింగ్ షెడ్యూల్స్ ని ముందుగానే సెట్ చేసుకోవచ్చు. MeetingsIO సైట్ కి వెళ్ళి ’Get a Meeting Room' పై క్లిక్ చేస్తే Room Name దగ్గర వచ్చే లింక్ ని అవసరమైన వారితో షేర్ చేసుకొని  ’Enter' పై క్లిక్ చెయ్యాలి. ఇనస్టంట్ మీటింగ్ లో జాయిన్ అవటానికి నిక్ నేమ్ ఇవ్వాలి.  ఇది notepad, screen sharing, live chat, and file sharing ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది. 


వెబ్ సైట్:MeetingsIO

ధన్యవాదాలు

Wednesday, September 5, 2012

Make Me Genius - పిల్లలకోసం ఒక మంచి ఎడ్యుకేషనల్ వీడియో సైట్!!

ప్రైమరీ స్కూల్ పిల్లలకు ఉపయోగపడే ఉచిత ఎడ్యుకేషనల్ వీడియో లను అందిస్తున్న సైట్ Make Me Genius. పిల్లలకు సులభంగా అర్ధమయ్యే విధంగా వీడియోలను రూపొందించారు.  వీడీయోలే కాకుండా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ కూడా ఉన్నాయి.

అవగాహన కోసం సోలార్ సిస్టం గురించిన వీడియో చూడండి:



వెబ్ సైట్: Make Me Genius

మరిన్ని బెస్ట్ ఎడ్యుకేషనల్ వెబ్ సైట్స్ - వీటిలో ఉచిత / పెయిడ్ సైట్లు కూడా ఉన్నాయి:

ధన్యవాదాలు

Monday, August 27, 2012

మీ డ్రాప్ బాక్స్ అకౌంట్ ని 2 స్టెప్ వెరిఫికేషన్ తో భద్రపర్చుకోండి!!!

ఆన్‍లైన్ లో మన అకౌంట్ల ను సురక్షితంగా ఉంచుకోవటం ప్రశ్నార్ధంగా మారుతున్న తరుణం లో 2 స్టెప్ వెరిఫికేషన్ ఆవశ్యకత ఎంతో ఉంది. ఇప్పటికే ఈ సదుపాయం గూగుల్ లో ఉంది. ఇప్పటికీ మీ గూగుల్ అకౌంట్ కి 2 స్టెప్ వెరిఫికేషన్    పెట్టుకోని వారికి ఎలా పెట్టుకోవాలో ఇక్కడ చూడండి.  గూగుల్ అకౌంట్ లానే ఎన్నో వ్యక్తిగత ఫైళ్ళను క్లౌడ్ లో స్టోర్ చేసుకోవటానికి మనం ప్రముఖంగా ఉపయోగించే Dropbox ని కూడా  2 స్టెప్ వెరిఫికేషన్ సురక్షితంగా ఉంచుకోవచ్చు.


 2 స్టెప్ వెరిఫికేషన్ కాన్ఫిగర్ చేసుకున్న తర్వాత గూగుల్ లానే 6 డిజిట్ సెక్యూరిటీ కోడ్ మన మొబైల్ కి టెక్స్ట్ మెసేజ్  రూపం లో పంపబడుతుంది.  

ఇక 2 స్టెప్ వెరిఫికేషన్ ని ఎనేబుల్ చేసుకోవటానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి. డాప్ బాక్స్ అకౌంట్ సైన్ ఇన్ అయిన తర్వాత క్రింద Account sign in దగ్గర 2 Step Verification  దగ్గర Change పై క్లిక్ చెయ్యాలి. తర్వాత Get Started పై క్లిక్ చేసి డ్రాప్ బాక్స్ పాస్ వర్డ్ ఎంటర్ చెయ్యగా వచ్చే రెండు ఆప్షన్లలో టెక్స్ట్ మెసేజ్ పొందటానికి మొదటిటానికి మొబైల్ అప్లికేషన్ కోసం రెండవదానిని ఎంచుకోవాలి, Next పై క్లిక్ చెయ్యాలి.  ఇక్కడ మన దేశం (India) కోడ్ ని సెలెక్ట్ చేసుకొని మన మొబైల్ నంబర్ ఎంటర్ చెయ్యాలి. ’Next' పై క్లిక్ చేసిన తర్వాత 6 డిజిట్ కోడ్ మన మొబైల్ కి పంపబడుతుంది దానిని అక్కడ ఎంటర్ చెయ్యాలి. తర్వాత ఎమర్జెన్సీ  బ్యాకప్ కోడ్ జెనెరేట్ అవుతుంది, దానిని ఎక్కడైనా జాగ్రత్తగా నోట్ చేసుకుని ఉంచుకోవాలి. ఎప్పుడైనా మన మొబైల్ ఫోన్ పోయినప్పుడు ఇది ఉపయోగపడుతుంది. తర్వాత Enable two-step verification పై క్లిక్ చెయ్యాలి అంతే.

ధన్యవాదాలు

Saturday, August 18, 2012

గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ లో అనవసరమైన సైట్లు రాకుండా బ్లాక్ చెయ్యటం ఎలా?

Personal Blocklist అనే గూగుల్ క్రోం ఎక్స్‌టెన్షన్ ని ఉపయోగించి గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ లో అనవసరమైన వెబ్ సైట్లను బ్లాక్ చెయ్యవచ్చు. అలా చెయ్యటానికి ఈక్రింది చిత్రం లో చూపిన విధంగా బ్లాక్ లింక్ పై క్లిక్ చెయ్యాలి.



మరొక పద్ధతి గూగుల్ వెబ్ డాష్ బోర్డ్ కి వెళ్ళి మాన్యువల్ గా ఒక్కొక్కసారి ఒక్కొక్క వెబ్ సైట్ ని బ్లాక్ చెయ్యవచ్చు, ఇలా గరిష్టంగా 500 వెబ్ సైట్ల వరకు బ్లాక్ చేసుకోవచ్చు. ఇలా బ్లాక్ చెయ్యబడిన వెబ్ సైట్లు సెర్చ్ రిజల్ట్స్ లో చూపబడవు.

Google Custom Search ని క్రియేట్ చేసుకోవటం ద్వారా మనకు కావలసిన సైట్లను సెర్చ్ రిజల్ట్స్ లో పొందవచ్చు.


ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు...

ధన్యవాదాలు

Tuesday, July 3, 2012

MAKE PASSPORT PHOTO - పాస్‌పోర్ట్ ఫోటోల షీట్ తయారుచేసుకోవటానికి!

మన దగ్గర ఉన్న ఫోటోని ఆన్‌లైన్ లో అప్‌లోడ్ చేసి పాస్‌పోర్ట్ ఫోటోల షీట్ తయారు చేసుకోవచ్చు. దీనికోసం makepassportphoto.com అనే వెబ్ సర్వీస్ ఉపయోగపడుతుంది మరియు ఈ సర్వీస్ ని ఉపయోగించటానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు, ఇది పూర్తిగా ఉచితం.   

పాస్‌పోర్ట్ షీట్ తయారు చేసుకోవటానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి. ఇక్కడ Select Your Photo type దగ్గర ఆయా దేశాల పాస్‌పోర్ట్ ఫోటో సైజ్ లు ఇవ్వబడ్డాయి, వాటిలో కావలసిన దానిని సెలెక్ట్ చేసుకోవాలి లేదా క్రింద కావలసిన సైజ్ ని డైరెక్ట్ గా ఎంచుకోవచ్చు. తర్వాత Upload Image దగ్గర Choose file పై క్లిక్ చేసి ఇమేజ్ ఫైల్ ని అప్‌లోడ్ చెయ్యాలి. Next పై క్లిక్ చెసి మౌస్ సహాయంతో ఫోటోలో కావలసిన భాగాన్ని ఎంచుకోవాలి. ఇప్పుడు FINISH పై క్లిక్ చేసి Download పై క్లిక్ చెయ్యాలి అంతే. షీట్ డౌన్లోడ్ అవుతుంది ఇక ప్రింట్ చేసుకోవటమే.    



ధన్యవాదాలు