Tuesday, January 31, 2012

ZeroPC - క్లౌడ్ లో మీ పర్సనల్ డెస్క్ టాప్ [Cloud Content Manager] !!


ఏదైనా కంప్యూటర్, iOs, ఆండ్రాయిడ్ డివైజెస్ ని ఉపయోగించి క్లౌడ్ లో స్టోర్ చెయ్యబడిన వివిధ ఫైళ్ళను ఒకే చోట నుండి యాక్సెస్ చెయ్యటానికి ZeroPC అనే క్లౌడ్ కంటెంట్ మేనేజర్ ఉపయోగపడుతుంది. Box.net, Dropbox, Facebook, Twitter, Evernote, Flickr, Google Docs, Instagram, Picasa, Sky Drive and Sugar Sync మొదలగు వాటిలో స్టోర్ చెయ్యబడిన మన ఫైళ్ళను Zero PC ఒక దగ్గరకు చేరుస్తుంది. ఈ వెబ్ సర్వీస్ ని ఉపయోగించుకోవటానికి ముందుగా Zero PC సైట్ కి వెళ్ళి అకౌంట్ క్రియేట్ చేసుకోవటానికి సైన్-అప్ చెయ్యాలి. తర్వాత యాక్టివేషన్ లింక్ మన మెయిల్ కి పంపబడుతుంది. దానిపై క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకొని లాగిన్ అయితే మన వెబ్ ఆధారిత డెస్క్ టాప్ ఓపెన్ అవుతుంది. ఆన్ లైన్ అకౌంట్లను యాక్సెస్ చెయ్యటానికి కావలసిన దానిపై క్లిక్ చేసి సైన్-ఇన్ చేసి ఆధరైజ్ చెయ్యవలసి ఉంటుంది.




మరింత సమాచారం కోసం ZeroPC సైట్ చూడండి.

వెబ్ సైట్: ZeroPC

ధన్యవాదాలు