Saturday, March 24, 2012

ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కోసం బ్యానర్ ఇమేజ్ ల సమాహారం!!

టైమ్‌లైన్ అనేది ఫేస్‌బుక్ ఫ్రొపైల్ కి క్రొత్త రూపం. టైమ్‌లైన్ పేజ్ లోని ఇప్పటికే కొంతమంది మారి ఉండవచ్చు, అయితే ఇప్పుడు ఫేస్‌బుక్ అందరి యూజర్ల ప్రొఫైల్స్ ని టైమ్‌లైన్ లోకి ఆటోమాటిక్ గా మార్చనుంది. టమ్‌లైన్ పై భాగంలో ఒక మంచి ఇమేజ్ ని బ్యానర్ గా పెట్టుకోవటం ద్వారా మన ఫేస్‌బుక్ ని ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు, అయితే బ్యానర్ ఇమేజ్ ఏదైనా కావచ్చు దానిని మన పీసీ నుండి ఫేస్‌బుక్ కి అప్‌లోడ్ చేసుకోవచ్చు.


అయితే బ్యానర్ ఇమేజ్ ల కోసం అక్కడా ఇక్కడా వెతుక్కోకుండా డైరెక్ట్ గా http://facebooktimelinebanner.com/ సైట్ కి వెళ్ళి నచ్చిన ఇమేజ్ పై క్లిక్ చేసి పెద్ద ఇమేజ్ వచ్చిన తర్వాత దానిపై మౌస్ రైట్ క్లిక్ చేసి ఇమేజ్ ని పీసీ లో సేవ్ చేసుకోవాలి. ఈ సైట్  లో ఇమేజ్ లను వివిధ క్యాటగిరీల్లో ఉంచారు. ఇప్పుడు ఫేస్‌బుక్ కి వెళ్ళి Change Cover పై క్లిక్ చేసి Upload Photo పై క్లిక్ చేసి ముందుగా డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ ని సెలెక్ట్ చేసికొని అప్లోడ్ చేసుకోవాలి.  



ధన్యవాదాలు


Wednesday, March 21, 2012

ఫోటోఫాప్ నేర్చుకోవటానికి వీడియో ట్యుటోరియల్స్!

ప్రముఖ ఇమేజ్ ఎడిటింగ్ అప్లికేషన్ ఫోటోషాప్ ని ఆన్ లైన్ లో నేర్చుకోవటానికి బెస్ట్ యూట్యూబ్ ఛానెల్స్ ఇక్కడ చూడండి:

౧. Adobe Photoshop Channel

అడోబ్ తమ స్వంత వీడియో ఛానెల్ Lightroom మరియు Photoshop Elements లలో ఫోటోషాప్ వీడియో ట్యుటోరియల్స్ ని చూడవచ్చు.


౨.IceflowStudios Photoshop Video Training

ఈ యూట్యూబ్ ఛానెల్ లో బేసిక్స్ నుండి అడ్వాన్స్ డు ట్యుటోరియల్స్ దాదాపు 50 పైగా వీడియోలు ఇక్కడ ఉన్నాయి.


౩.Photoshopmama’s OPD

ఇక్కడ 140 పైగా వీడియో ట్యుటోరియల్స్ ఉన్నాయి.


౪. TutorVid


౫.Gavin Hoey Photo Videos


౬.Pixel For Life


౭. Creative Sweet TV


ధన్యవాదాలు

Monday, March 19, 2012

సొంతగా MP3 రింగ్ టోన్స్ తయారుచేసుకోండి ఇలా!!

FreeRingtones సైట్ కి వెళ్ళి ఆన్ లైన్ లో ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా కేవలం మూడే మూడు స్టెప్పుల్లో మనకు నచ్చిన పాటలోని నచ్చిన భాగాన్ని MP3 లేదా ఐఫోన్ రింగ్ టోన్లగా తయారుచేసుకొని డైరెక్ట్ గా మొబైల్ కి పంపవచ్చు లేదా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా FreeRingtones సైట్ కి వెళ్ళాలి.


మొదటి స్టెప్: FreeRingtones సైట్ లో 'Browse' పై క్లిక్ చేసి ఒక MP3 పాటను ఎంచుకోవాలి, ఆ ఫైల్ సైట్ కి అప్ లోడ్ చెయ్యబడుతుంది.


రెండవ స్టెప్: మౌస్ సహాయం తో పాటలోని కావలసిన భాగాన్ని ఎంచుకోవాలి, ప్లే బటన్ పై క్లిక్ చేసి ఎంచుకున్న భాగాన్ని వినవచ్చు, టైటిల్, ఆర్టిస్ట్ తదితర వివరాలు ఎంటర్ చేసి ’Create ringtone' పై క్లిక్ చెయ్యాలి.


మూడవ స్టెప్: ఇక్కడ రింగ్ తోన్ ని డౌన్లోడ్ చేసుకోవటమే...


వెబ్ సైట్ : Free Rintones

ధన్యవాదాలు

CPU మరియు Motherboard హీట్ టెంపరేచర్ తెలుసుకోవటం ఎలా?

HW Monitor   అనే ఉచిత అప్లికేషన్ ని ఉపయోగించి CPU, మదర్ బోర్డ్ వోల్టేజ్ మరియు టెంపరేచర్ తో పాటు ఫ్యాన్ తిరిగే స్పీడ్ ని కూడా తెలుసుకోవచ్చు, తద్వారా ఆయా పరికరాల పనితీరును తెలుసుకోవచ్చు. HW Monitor ని ఆ సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకోవాలి, ఇనస్టలేషన్ సమయంలో Ask Tool బార్ కూడా ఇనస్టలేషన్ చెయ్యబడుతుంది, దానిని అన్-చెక్ చెయ్యటం మరువ వద్దు. HW Monitor ప్రోగ్రామ్ ని రన్ చెయ్యటం ద్వారా ఈ క్రింది చిత్రం లో చూపిన విధంగా వోల్టేజ్, టెంపరేచర్ మరియు ఫ్యాన్ స్పీడ్ ని తెలుసుకోవచ్చు.


మరింత సమాచారం కోసం HW Monitor  సైట్ చూడండి.

డౌన్లోడ్: HW Monitor

ధన్యవాదాలు

Thursday, March 15, 2012

Gmail Row Highlighter - జీమెయిల్ లో మెయిల్స్ ని హైలైట్ చెయ్యటానికి!!!

Gmail Row Highlighter  అనే క్రోమ్ బ్రౌజర్ ఎక్స్ టెన్షన్ జీమెయిల్ లోని మెయిల్స్ కి రంగులని జత చేస్తుంది. ఇది ఒక హైలైటర్. జీమెయిల్ లో మనం మెయిల్స్ పై మౌస్ ని పెట్టినప్పుడు చేతి గుర్తు వస్తుంది కదా, అదే ఈ ఎక్స్ టెన్షన్ ని ఇనస్టలేషన్ చేసిన తర్వాత మౌస్ పెట్టిన మెయిల్ రంగు హైలైట్ చెయ్యబడుతుంది, చదవని మెయిల్స్ పచ్చ రంగు చదివిన మెయిల్స్ పసుపు రంగు లో హైలైట్ చెయ్యబడతాయి.



డౌన్లోడ్: Gmail Row Highlighter

ధన్యవాదాలు

FixBee - హార్డ్ డిస్క్ డీఫ్రాగ్మెంటేషన్ తో పాటు జంక్ ఫైళ్ళను తొలగించటానికి!!!

హార్డ్ డిస్క్ లో డాటా చెల్లాచెదురుగా ఉండటం వలన కావలసిన డాటా లొకేట్ చెయ్యటానికి సిస్టం కి కొంత సమయం పడుతుంది. పీసీ పనితీరుని మెరుగు పరచటానికి హార్డ్ డిస్క్ ని అప్పుడప్పుడూ డీఫ్రాగ్మెంట్ చేస్తూ ఉండాలి, దానితో పాటు జంక్ ఫైళ్ళను తొలగిస్తూ ఉండాలి. హార్డ్ డిస్క్ డీఫ్రాగ్మెంట్ చెయ్యటం మరియు జంక్ ఫైళ్ళను తొలగించటం ఈ రెండు పనులూ ఒకే అప్లికేషన్ ద్వారా అయిపోతే చాలా సులువు కదా. FixBee ఈ రెండు పనులనూ చేస్తుంది.ఇనస్టలేషన్ సమయంలో అనవసర టూల్ బార్ లు ఇనస్టలేషన్ కాకుండా ఉండటానికి Custom Installation ని సెలెక్ట్ చేసుకొని క్రింద ఆప్షన్లను అన్-చెక్ చేసి అప్పుడు 'Accept and Install' పై క్లిక్ చెయ్యాలి.


పై చిత్రం లో చూపిన విధంగా Disk Optimizer మరియు System CleanUp టాబ్స్ ఉంటాయి. Disk Optimizer హార్డ్ డిస్క్ డీఫ్రాగ్మెంటేషన్ System CleanUp జంక్ ఫైళ్ళను తొలగిస్తుంది.

డౌన్లోడ్: FixBee

ధన్యవాదాలు

Wednesday, March 14, 2012

LastPass - వివిధ సైట్ల లాగిన్ సమాచారాన్ని సురక్షితంగా సేవ్ చేసి ఆటోమాటిక్ గా లాగిన్ అవ్వటానికి!!!

వివిధ సైట్ల లో లాగిన్ అవటానికి యూజర్ ఐడీ, పాస్ వార్డ్ అవసరమవుతాయి, ఆయా సైట్ల లాగిన్ సమాచారాన్ని గుర్తు పెట్టుకోవటం కష్టం అనుకొనే వారికి LastPass ఉపయోగపడుతుంది. బేసిక్ గా ఇది ఒక బ్రౌజర్ ప్లగిన్... దీనిని ఇనస్టలేషన్ చేసుకున్న తర్వాత అవసరమైన సైట్ల లాగిన్ సమాచారాన్ని LastPass లో సేవ్ చేసుకోవచ్చు మరియు LastPass నుండే యూజర్ నేమ్ పాస్‌వార్డ్ ఎంటర్ చెయ్యకుండా ఆయా సైట్ల లోకి డైరెక్ట్ గా లాగిన్ అవ్వవచ్చు.
  

LastPass సైట్ కి వెళ్ళి మన అపరేటింగ్ సిస్టం కి తగిన వెర్షన్ ని డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకోవాలి. LastPass Internet Explorer 6+, Firefox 2.0+, Chrome 7+ బ్రౌజర్లను సపోర్ట్ చేస్తుంది. ఇనస్టలేషన్ చేసేటప్పుడు ఏయే బ్రౌజర్ల లలో దీనిని ఉపయోగించాలో వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత LastPass అకౌంట్ ని క్రియేట్ చేసుకోవాలి, దీనికై మన ఇ-మెయిల్ ఐడీ ఎంటర్ చేసి ఒక పాస్ వార్డ్ పెట్టుకోవాలి. ఈ పాస్ వార్డ్ మాత్రం మరచిపోకూడదు, ఇదొక్కటే మన గుర్తు పెట్టుకోవాలి మిగతావి ఇదే గుర్తు పెట్టుకుంటుంది. ఇక ఇనస్టలేషన్ పూర్తి అయిన తర్వాత దీనిని ఎలా ఉపయోగించాలో తెలియచేసే వీడియో డెమో వస్తుంది. ఇప్పుడు బ్రౌజర్ ని ఓపెన్ చేసి LastPass ప్లగిన్ పై క్లిక్ చేసి యూజర్ నేమ్ పాస్ వార్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత ఆటోమాటిక్ గా లాగిన్ అవ్వవలసిన సైట్ల వివరాలను లాగిన్ సమాచారం తో ఎంటర్ చెయ్యాలి. లేదంటే ఏదైనా సైట్ ఓపెన్ చేసినప్పుడు పాస్ వార్డ్ సేవ్ చెయ్యాలా అని ప్రాంప్ట్ అవుతుంది అక్కడ Save Passwords with LastPass పై క్లిక్ చేసి ఆ సైట్ యొక్క లాగిన్ సమాచారం సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైమ్ నుండి యూజర్ నేమ్ , పాస్ వార్డ్ ఎంటర్ చెయ్యకుండా డైరెక్ట్ గా ఆ సైట్ లోకి లాగిన్ అవ్వవచ్చు.


డౌన్లోడ్: LastPass

ధన్యవాదాలు

Friday, March 9, 2012

DriverIdentifier - పీసీ హార్డ్ వేర్ డ్రైవర్లను అప్ డేట్ చెయ్యటానికి!!

పీసీ కి కనెక్ట్ అయిన హార్డ్ వేర్ డివైజెస్ ని స్కాన్ చేసి వాటి డ్రైవర్స్ ని అప్ డేట్ చెయ్యటానికి DriverIdentifier అనే ఉచిత అప్లికేషన్ ఉపయోగపడుతుంది.  DriverIdentifier ఇనస్టలేషన్ చేసిన తర్వాత అప్లికేషన్ ని ఓపెన్ చేసి ’Scan Drivers' పై క్లిక్ చెయ్యాలి. 

హార్డ్ వేర్ డైవైజ్ స్కానింగ్ పూర్తి అయిన తర్వాత ఆటోమాటిక్ గా ఒక వెబ్ పేజ్ బ్రౌజర్ లో ఓపెన్ అవుతుంది దానిలో మన పీసీ లోని డివైజెస్ లిస్ట్ చూపిస్తుంది. లిస్ట్ లో Driver name, Manufacturer, Version, Date తదితర వివరాలు ఉంటాయి. డ్రైవర్స్ అప్ డేట్ చేసుకోవటం కోసం 'Download'  క్రింద ఉండే ’Update' పై క్లిక్ చెయ్యాలి.


ఫీచర్స్:

Automated drivers installation
The program installs all required drivers to any computer in just about 5 minutes.
Saves Time and money
No more wasting time looking for drivers; all required drivers will be installed by making only a few clicks.
Any drivers for any computer
Simplifies downloading new drivers from the Internet.
Drivers update capability
Updates previously installed drivers to their latest versions.
Windows XP / Vista / 7 (x86-x64)
Supports all modern operating systems!
Both 64-bit and 32-bit versions!
Easy to use
Simple and foolproof interface.


డౌన్లోడ్: DriverIdentifier

ధన్యవాదాలు

Thursday, March 8, 2012

నిర్ణీత సమయం లో పీసీ షట్ డౌన్ / రీస్టార్ట్ చెయ్యటానికి పోర్టబుల్ టూల్!!

Sleep Timer అనే పోర్టబుల్ అప్లికేషన్ ఉపయోగించి ఎటువంటి ఇనస్టలేషన్ చెయ్యకుండా పీసీని నిర్ణీత సమయం లో షట్ డౌన్ లేదా రీస్టార్ట్ చెయ్యవచ్చు. Sleep Timer సైట్ కి వెళ్ళి Zum Download పై క్లిక్ చేసి స్లీప్ టైమర్.exe ని డౌన్లోడ్ చేసుకోవాలి. .exe ఫైల్ పై డబల్ క్లిక్ చెయ్యటం ద్వారా అప్లికేషన్  ఓపెన్ అవుతుంది Mode మరియు Action దగ్గర కావలసిన ఆప్షన్ ని ఎంచుకొని Perform Action in దగ్గర గంటలు/ నిమిషాలను సెట్ చేసుకుని Play గుర్తు ఉన్న బటన్ పై క్లిక్ చెయ్యాలి. 



డౌన్లోడ్: Sleep Timer

ధన్యవాదాలు

Tuesday, March 6, 2012

కావలసిన రోజు కావలసిన సమయానికి జీమెయిల్ పంపబడేలా [Send Later] చెయ్యాలా?

జీమెయిల్ లోని ఫీచర్ల వలన ఎక్కువ మంది జీమెయిల్ ని వాడటానికి ఇష్టపడుతూ ఉంటారు. కాని... మనం కంపోజ్ చేసిన మెయిల్ కావలసిన రోజున కావలసిన సమయానికి పంపబడేలా షెడ్యూల్ చేసుకునే ఫీచర్ జీమెయిల్ లో లేదు. అయితే RightInbox అనే క్రోమ్/ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ ఎక్స్ టెన్షన్ ఆ కొరతను తీరుస్తుంది. ముందుగా RightInbox సైట్ కి వెళ్ళి మన బ్రౌజర్ కి తగిన ఎక్స్ టెన్షన్ ని డౌన్లోడ్ చేసుకుని ఇనస్టలేషన్ చేసుకోవాలి.  తర్వాత జీమెయిల్ లాగిన్ అయ్యి ఆథెంటికేట్ చెయ్యటానికి ’Grant access' పై క్లిక్ చెయ్యాలి. అంతే ఇక మీ మెయిల్స్ ని షెడ్యూల్ చేసుకోవచ్చు. మెయిల్ కంపోజ్ చేసినప్పుడు అక్కడ క్రొత్తగా ’ Send Later' బటన్ ని చూడవచ్చు. దానిపై క్లిక్ చేసి మెయిల్ పంపవలసిన సమయాన్ని ఎంచుకోవచ్చు. ’at a specific time' ఆప్షన్ ద్వారా కావలసిన రోజు మరియు సమయానికి మెయిల్ పంపవచ్చు.


ఇతర సమాచారం కోసం RightInbox  సైట్ చూడండి.

ధన్యవాదాలు

Monday, March 5, 2012

thekidshouldseethis - పిల్లల కోసం ఉపయోగకర వీడియోల సమాహారం!!!

thekidshouldseethis సైట్ పేరుకు తగ్గట్లుగానే పిల్లలు తప్పకుండా చూడవలసిన సైట్. ఈ సైట్ లో science, nature, art, music, technology, story telling మొదలగు అంశాలకు చెందిన ఎన్నో వీడియోలు ఉన్నాయి ఇవి ఎదిగే పిల్లలకు ఎంతగానో ఉపయోగపడతాయి. thekidshouldseethis ఒక టంబ్లర్ బ్లాగ్.. వీడియోలు రోజు వారీ పోస్ట్ ల రూపంలో ఉంటాయి, బ్లాగ్ లో పైనున్న Archive పై క్లిక్ చేస్తే నెల వారీగా చేసిన పోస్ట్ లను చూడవచ్చు. కావలసిన వీడియో పై క్లిక్ చేసి చూడవచ్చు.  వీడియోలతో పాటు ద్దనికి సంబంధించిన సమాచారాన్ని కూడా చదవవచ్చు.


అయితే ఇక్కడొక చిన్న సమస్య ఏమిటంటే అంశాలవారీగా (టాపిక్ వైజ్) వీడియోలను పెట్టలేదు.

వెబ్ సైట్: thekidshouldseethis

ధన్యవాదాలు

Friday, March 2, 2012

Security Analyzer - సిస్టం సెక్యూరిటీ అస్సెస్ మెంట్ టూల్!!!

Security Analyzer 2.0 helps determine the Pesonal Computer (PC) health, by collecting information about Windows Firewall status, Windows Update settings, Antivirus and Antispyware, User Account Control (UAC) settings, Network Access Protection (NAP) and Wireless Network Security (Encryption method).


సెక్యూరిటీ ఎనలైజర్ మైక్రోసాప్ట్ విండోస్ లో అంతర్గతంగా ఉండే Action Center (Control Panel -->System and Security-->  Review your computer's status) ని పోలి ఉంటుంది. 

సెక్యూరిటీ ఎనలైజర్ ఏమి ఎనలైజ్ చేస్తుందంటే -

౧) విండోస్ ఫైర్ వాల్ ఆన్ లో ఉందా లేదా మరియు సరిగ్గా కాన్ఫిగర్ చెయ్యబడినదా లేదా
౨) ఆటోమాటిక్ విండోస్ అప్ డేట్ ఎనేబుల్ చెయ్యబడినదా లేదా
౩) సిస్టం లో యాంటీ వైరస్/ యాంటీ స్పైవేర్ సాప్ట్ వేర్ ఇనస్టలేషన్ చెయ్యబడినదా లేదా
౪) యూజర్ అకౌంట్ కంట్రోల్ ఆన్/ ఆఫ్ లో ఉందా
౫)నెట్ వర్క్ యాక్సెస్ ప్రొటెక్షన్ ఆన్/ ఆఫ్ లో ఉందా
౬) వైర్ లెస్ నెట్ వర్క్ సెక్యూరిటీ మొదలైనవి.

డౌన్లోడ్: Security Analyzer 

ధన్యవాదాలు 

Thursday, March 1, 2012

Windows 8 Consumer Preview డౌన్లోడ్ చేసుకోండి!!

మైక్రోసాప్ట్ కొత్త ఆపరేటింగ్ సిస్టం విండోస్ 8 కి సంబంధించి Consumer Preview ని విడుదల చేసింది డైరెక్ట్గ్ గా సెటప్ ప్రోగ్రామ్ లేదా ISO ఇమేజ్ ని మైక్రోసాప్ట్ సైట్  నుండి డౌన్లోడ్  చేసుకోవచ్చు.  విండోస్ 8 అసలు క్రొత్తగా ఏమి ఉన్నయో అనే దానిని ఇక్కడ చూడండి.


విండోస్ 8 కోసం సిస్టం కాన్ఫిగరేషన్ 1 GB of RAM, 16 GB of hard disk space and 1 GHz processor అవసరమవుతుంది, అదే 64 bit వెర్షన్ అయితే 2 GB of RAM ఉండాలి. విండోస్ 8 Consumer Preview కి సంబంధించిన FAQ ఇక్కడ చూడండి. విండోస్ 8 యూనివర్సల్ ప్రొడక్ట్ కీ NF32V-Q9P3W-7DR7Y-JGWRW-JFCK8 .  మీ దగ్గర ఉన్న ప్రోగ్రామ్స్ లేదా డివైజెస్ విండోస్ 8  లో పనిచేస్తాయా లేదా అని తెలుసుకోవటానికి ఇక్కడ చూడండి. 

ధన్యవాదాలు