HW Monitor అనే ఉచిత అప్లికేషన్ ని ఉపయోగించి CPU, మదర్ బోర్డ్ వోల్టేజ్ మరియు టెంపరేచర్ తో పాటు ఫ్యాన్ తిరిగే స్పీడ్ ని కూడా తెలుసుకోవచ్చు, తద్వారా ఆయా పరికరాల పనితీరును తెలుసుకోవచ్చు. HW Monitor ని ఆ సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకోవాలి, ఇనస్టలేషన్ సమయంలో Ask Tool బార్ కూడా ఇనస్టలేషన్ చెయ్యబడుతుంది, దానిని అన్-చెక్ చెయ్యటం మరువ వద్దు. HW Monitor ప్రోగ్రామ్ ని రన్ చెయ్యటం ద్వారా ఈ క్రింది చిత్రం లో చూపిన విధంగా వోల్టేజ్, టెంపరేచర్ మరియు ఫ్యాన్ స్పీడ్ ని తెలుసుకోవచ్చు.
మరింత సమాచారం కోసం HW Monitor సైట్ చూడండి.
డౌన్లోడ్: HW Monitor
ధన్యవాదాలు