వివిధ సైట్ల లో లాగిన్ అవటానికి యూజర్ ఐడీ, పాస్ వార్డ్ అవసరమవుతాయి, ఆయా సైట్ల లాగిన్ సమాచారాన్ని గుర్తు పెట్టుకోవటం కష్టం అనుకొనే వారికి LastPass ఉపయోగపడుతుంది. బేసిక్ గా ఇది ఒక బ్రౌజర్ ప్లగిన్... దీనిని ఇనస్టలేషన్ చేసుకున్న తర్వాత అవసరమైన సైట్ల లాగిన్ సమాచారాన్ని LastPass లో సేవ్ చేసుకోవచ్చు మరియు LastPass నుండే యూజర్ నేమ్ పాస్‌వార్డ్ ఎంటర్ చెయ్యకుండా ఆయా సైట్ల లోకి డైరెక్ట్ గా లాగిన్ అవ్వవచ్చు.
LastPass సైట్ కి వెళ్ళి మన అపరేటింగ్ సిస్టం కి తగిన వెర్షన్ ని డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకోవాలి. LastPass Internet Explorer 6+, Firefox 2.0+, Chrome 7+ బ్రౌజర్లను సపోర్ట్ చేస్తుంది. ఇనస్టలేషన్ చేసేటప్పుడు ఏయే బ్రౌజర్ల లలో దీనిని ఉపయోగించాలో వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత LastPass అకౌంట్ ని క్రియేట్ చేసుకోవాలి, దీనికై మన ఇ-మెయిల్ ఐడీ ఎంటర్ చేసి ఒక పాస్ వార్డ్ పెట్టుకోవాలి. ఈ పాస్ వార్డ్ మాత్రం మరచిపోకూడదు, ఇదొక్కటే మన గుర్తు పెట్టుకోవాలి మిగతావి ఇదే గుర్తు పెట్టుకుంటుంది. ఇక ఇనస్టలేషన్ పూర్తి అయిన తర్వాత దీనిని ఎలా ఉపయోగించాలో తెలియచేసే వీడియో డెమో వస్తుంది. ఇప్పుడు బ్రౌజర్ ని ఓపెన్ చేసి LastPass ప్లగిన్ పై క్లిక్ చేసి యూజర్ నేమ్ పాస్ వార్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత ఆటోమాటిక్ గా లాగిన్ అవ్వవలసిన సైట్ల వివరాలను లాగిన్ సమాచారం తో ఎంటర్ చెయ్యాలి. లేదంటే ఏదైనా సైట్ ఓపెన్ చేసినప్పుడు పాస్ వార్డ్ సేవ్ చెయ్యాలా అని ప్రాంప్ట్ అవుతుంది అక్కడ Save Passwords with LastPass పై క్లిక్ చేసి ఆ సైట్ యొక్క లాగిన్ సమాచారం సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైమ్ నుండి యూజర్ నేమ్ , పాస్ వార్డ్ ఎంటర్ చెయ్యకుండా డైరెక్ట్ గా ఆ సైట్ లోకి లాగిన్ అవ్వవచ్చు.
డౌన్లోడ్: LastPass
ధన్యవాదాలు