జీమెయిల్ లోని ఫీచర్ల వలన ఎక్కువ మంది జీమెయిల్ ని వాడటానికి ఇష్టపడుతూ ఉంటారు. కాని... మనం కంపోజ్ చేసిన మెయిల్ కావలసిన రోజున కావలసిన సమయానికి పంపబడేలా షెడ్యూల్ చేసుకునే ఫీచర్ జీమెయిల్ లో లేదు. అయితే RightInbox అనే క్రోమ్/ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ ఎక్స్ టెన్షన్ ఆ కొరతను తీరుస్తుంది. ముందుగా RightInbox సైట్ కి వెళ్ళి మన బ్రౌజర్ కి తగిన ఎక్స్ టెన్షన్ ని డౌన్లోడ్ చేసుకుని ఇనస్టలేషన్ చేసుకోవాలి. తర్వాత జీమెయిల్ లాగిన్ అయ్యి ఆథెంటికేట్ చెయ్యటానికి ’Grant access' పై క్లిక్ చెయ్యాలి. అంతే ఇక మీ మెయిల్స్ ని షెడ్యూల్ చేసుకోవచ్చు. మెయిల్ కంపోజ్ చేసినప్పుడు అక్కడ క్రొత్తగా ’ Send Later' బటన్ ని చూడవచ్చు. దానిపై క్లిక్ చేసి మెయిల్ పంపవలసిన సమయాన్ని ఎంచుకోవచ్చు. ’at a specific time' ఆప్షన్ ద్వారా కావలసిన రోజు మరియు సమయానికి మెయిల్ పంపవచ్చు.
ఇతర సమాచారం కోసం RightInbox సైట్ చూడండి.
ధన్యవాదాలు