Thursday, March 8, 2012

నిర్ణీత సమయం లో పీసీ షట్ డౌన్ / రీస్టార్ట్ చెయ్యటానికి పోర్టబుల్ టూల్!!

Sleep Timer అనే పోర్టబుల్ అప్లికేషన్ ఉపయోగించి ఎటువంటి ఇనస్టలేషన్ చెయ్యకుండా పీసీని నిర్ణీత సమయం లో షట్ డౌన్ లేదా రీస్టార్ట్ చెయ్యవచ్చు. Sleep Timer సైట్ కి వెళ్ళి Zum Download పై క్లిక్ చేసి స్లీప్ టైమర్.exe ని డౌన్లోడ్ చేసుకోవాలి. .exe ఫైల్ పై డబల్ క్లిక్ చెయ్యటం ద్వారా అప్లికేషన్  ఓపెన్ అవుతుంది Mode మరియు Action దగ్గర కావలసిన ఆప్షన్ ని ఎంచుకొని Perform Action in దగ్గర గంటలు/ నిమిషాలను సెట్ చేసుకుని Play గుర్తు ఉన్న బటన్ పై క్లిక్ చెయ్యాలి. 



డౌన్లోడ్: Sleep Timer

ధన్యవాదాలు

Tuesday, March 6, 2012

కావలసిన రోజు కావలసిన సమయానికి జీమెయిల్ పంపబడేలా [Send Later] చెయ్యాలా?

జీమెయిల్ లోని ఫీచర్ల వలన ఎక్కువ మంది జీమెయిల్ ని వాడటానికి ఇష్టపడుతూ ఉంటారు. కాని... మనం కంపోజ్ చేసిన మెయిల్ కావలసిన రోజున కావలసిన సమయానికి పంపబడేలా షెడ్యూల్ చేసుకునే ఫీచర్ జీమెయిల్ లో లేదు. అయితే RightInbox అనే క్రోమ్/ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ ఎక్స్ టెన్షన్ ఆ కొరతను తీరుస్తుంది. ముందుగా RightInbox సైట్ కి వెళ్ళి మన బ్రౌజర్ కి తగిన ఎక్స్ టెన్షన్ ని డౌన్లోడ్ చేసుకుని ఇనస్టలేషన్ చేసుకోవాలి.  తర్వాత జీమెయిల్ లాగిన్ అయ్యి ఆథెంటికేట్ చెయ్యటానికి ’Grant access' పై క్లిక్ చెయ్యాలి. అంతే ఇక మీ మెయిల్స్ ని షెడ్యూల్ చేసుకోవచ్చు. మెయిల్ కంపోజ్ చేసినప్పుడు అక్కడ క్రొత్తగా ’ Send Later' బటన్ ని చూడవచ్చు. దానిపై క్లిక్ చేసి మెయిల్ పంపవలసిన సమయాన్ని ఎంచుకోవచ్చు. ’at a specific time' ఆప్షన్ ద్వారా కావలసిన రోజు మరియు సమయానికి మెయిల్ పంపవచ్చు.


ఇతర సమాచారం కోసం RightInbox  సైట్ చూడండి.

ధన్యవాదాలు

Monday, March 5, 2012

thekidshouldseethis - పిల్లల కోసం ఉపయోగకర వీడియోల సమాహారం!!!

thekidshouldseethis సైట్ పేరుకు తగ్గట్లుగానే పిల్లలు తప్పకుండా చూడవలసిన సైట్. ఈ సైట్ లో science, nature, art, music, technology, story telling మొదలగు అంశాలకు చెందిన ఎన్నో వీడియోలు ఉన్నాయి ఇవి ఎదిగే పిల్లలకు ఎంతగానో ఉపయోగపడతాయి. thekidshouldseethis ఒక టంబ్లర్ బ్లాగ్.. వీడియోలు రోజు వారీ పోస్ట్ ల రూపంలో ఉంటాయి, బ్లాగ్ లో పైనున్న Archive పై క్లిక్ చేస్తే నెల వారీగా చేసిన పోస్ట్ లను చూడవచ్చు. కావలసిన వీడియో పై క్లిక్ చేసి చూడవచ్చు.  వీడియోలతో పాటు ద్దనికి సంబంధించిన సమాచారాన్ని కూడా చదవవచ్చు.


అయితే ఇక్కడొక చిన్న సమస్య ఏమిటంటే అంశాలవారీగా (టాపిక్ వైజ్) వీడియోలను పెట్టలేదు.

వెబ్ సైట్: thekidshouldseethis

ధన్యవాదాలు

Friday, March 2, 2012

Security Analyzer - సిస్టం సెక్యూరిటీ అస్సెస్ మెంట్ టూల్!!!

Security Analyzer 2.0 helps determine the Pesonal Computer (PC) health, by collecting information about Windows Firewall status, Windows Update settings, Antivirus and Antispyware, User Account Control (UAC) settings, Network Access Protection (NAP) and Wireless Network Security (Encryption method).


సెక్యూరిటీ ఎనలైజర్ మైక్రోసాప్ట్ విండోస్ లో అంతర్గతంగా ఉండే Action Center (Control Panel -->System and Security-->  Review your computer's status) ని పోలి ఉంటుంది. 

సెక్యూరిటీ ఎనలైజర్ ఏమి ఎనలైజ్ చేస్తుందంటే -

౧) విండోస్ ఫైర్ వాల్ ఆన్ లో ఉందా లేదా మరియు సరిగ్గా కాన్ఫిగర్ చెయ్యబడినదా లేదా
౨) ఆటోమాటిక్ విండోస్ అప్ డేట్ ఎనేబుల్ చెయ్యబడినదా లేదా
౩) సిస్టం లో యాంటీ వైరస్/ యాంటీ స్పైవేర్ సాప్ట్ వేర్ ఇనస్టలేషన్ చెయ్యబడినదా లేదా
౪) యూజర్ అకౌంట్ కంట్రోల్ ఆన్/ ఆఫ్ లో ఉందా
౫)నెట్ వర్క్ యాక్సెస్ ప్రొటెక్షన్ ఆన్/ ఆఫ్ లో ఉందా
౬) వైర్ లెస్ నెట్ వర్క్ సెక్యూరిటీ మొదలైనవి.

డౌన్లోడ్: Security Analyzer 

ధన్యవాదాలు 

Thursday, March 1, 2012

Windows 8 Consumer Preview డౌన్లోడ్ చేసుకోండి!!

మైక్రోసాప్ట్ కొత్త ఆపరేటింగ్ సిస్టం విండోస్ 8 కి సంబంధించి Consumer Preview ని విడుదల చేసింది డైరెక్ట్గ్ గా సెటప్ ప్రోగ్రామ్ లేదా ISO ఇమేజ్ ని మైక్రోసాప్ట్ సైట్  నుండి డౌన్లోడ్  చేసుకోవచ్చు.  విండోస్ 8 అసలు క్రొత్తగా ఏమి ఉన్నయో అనే దానిని ఇక్కడ చూడండి.


విండోస్ 8 కోసం సిస్టం కాన్ఫిగరేషన్ 1 GB of RAM, 16 GB of hard disk space and 1 GHz processor అవసరమవుతుంది, అదే 64 bit వెర్షన్ అయితే 2 GB of RAM ఉండాలి. విండోస్ 8 Consumer Preview కి సంబంధించిన FAQ ఇక్కడ చూడండి. విండోస్ 8 యూనివర్సల్ ప్రొడక్ట్ కీ NF32V-Q9P3W-7DR7Y-JGWRW-JFCK8 .  మీ దగ్గర ఉన్న ప్రోగ్రామ్స్ లేదా డివైజెస్ విండోస్ 8  లో పనిచేస్తాయా లేదా అని తెలుసుకోవటానికి ఇక్కడ చూడండి. 

ధన్యవాదాలు 

Tuesday, February 28, 2012

యూట్యూబ్ సెర్చ్ హిస్టరీ తొలగించటం ఎలా?

ఇంతకు ముందు పోస్ట్ లో గూగుల్ సెర్చ్ హిస్టరీ ఎలా తొలగించాలో చూశాం కదా ఇప్పుడు యూట్యూబ్ వ్యూయింగ్ మరియు సెర్చ్ హిస్టరీ ఎలా తొలగించాలో చూద్దాం: 

1. Log in to your Google account.
2. Go to https://www.youtube.com
3. Click on your icon.
4. Click “Video Manager”
5. Click “History”
6. Click “Clear all viewing history.”
7. Click “Pause viewing history."
8. Click "Search History."
9. Click "Clear all search history."
10. Click “Pause search history.”
సేకరణ: Electronic Frontier Foundation నుండి.
ధన్యవాదాలు

గూగుల్ ప్రైవసీ పాలసీ మలులోకి రాకముందే గూగుల్ సెర్చ్ హిస్టరీని తొలగించండి!!

మార్చి 1 నుండి గూగుల్ ప్రైవసీ పాలసీ అమలులోకి రానుంది. పాలసీ ని ఇప్పటికే చదివి ఉంటే ఓకే లేకుంటే దానిని ఇక్కడ ఒకసారి చదవండి.  గూగుల్ ప్రోడక్ట్స్ లో మనం సెర్చ్ లు మరియు సందర్శించిన వెబ్ సైట్ల వివరాలు గూగుల్ వెబ్ హిస్టరీ లో ఉంటాయి. మార్ఛి ౧ తర్వాత ఆ వివరాలను గూగుల్ సేకరించే అవకాశం ఉంది. దీంతో ఒక్కొక్కసారి మన వ్యక్తిగత సమాచారం కూడా గూగుల్ కి తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి, అర్జెంట్ గా గూగుల్ వెబ్ హిస్టరీ లోని క్లియర్ చెయ్యాలి మరియు Web History is on దగ్గర Pause ని క్లిక్ చెయ్యాలి. 

Google Web History ని ఎలా తొలగించాలో ఇక్కడ చూద్దాం:

1. Sign into your Google account(లేదంటే  డైరెక్ట్ గా https://www.google.com/history కి కూడా వెళ్ళి సైన్-ఇన్ చెయ్యవచ్చు).
2. Go to https://www.google.com/history
3. Click "remove all Web History."
4. Click "ok."
ధన్యవాదాలు