గూగుల్ గూగుల్ ఇండియా మ్యూజిక్ సైట్ ని లాంచ్ చేసింది. ఈ సైట్ లో మనం వివిధ భాషలకు చెందిన లేటెస్ట్ సినిమా పాటలను ఆన్ లైన్ లో వినవచ్చు. ఆర్టిస్ట్స్ , ఆల్బమ్ మరియు పాటలను సెర్చ్ చేసి వాటి పై క్లిక్ చేసి ఆన్ లైన్ లోనే పాటలను వినవచ్చు. గూగుల్ ఇండియా మ్యూజిక్ దీనికోసం in.com, saavn.com, saregama మొదలగు ఆన్ లైన్ సాంగ్ స్ట్రీమింగ్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. మనం ఎంచుకున్న పాట ఆయా సైట్ల నుండే ప్లే అవుతుంది.
అయితే ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి... ప్లేలిస్ట్ పీచర్ లేదు మరియు నచ్చిన పాటలను టిక్ చేసుకొని ఒకేసారి ప్లే కొట్టే అవకాశం లేదు. ఆల్బమ్ పూర్తి గా ఒకేసారి ప్లే చేసే అవకాశం లేదు ఒక్కొక్కపాట పై క్లిక్ చేసి వినటమే. గూగుల్ మ్యూజిక్ సైట్ లో వినే బదులు అయా సైట్ కి వెళ్ళి వినటమే బెటర్ అనిపిస్తుంది. గూగుల్ మ్యూజిక్ తమ సైట్ ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి.
వెబ్ సైట్: గూగుల్ ఇండియా మ్యూజిక్
ధన్యవాదాలు