మన దగ్గర ఉన్న వివిధ పీడీఎఫ్ ఫైల్స్ అన్నిటిని కలిపి ఒకే ఫీడీఎఫ్ ఫైల్ గా మార్చటానికి pdfbinder అనే ఉచిత టూల్ ఉపయోగపడుతుంది. pdfbinder సైట్ కి వెళ్లి డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసిన తర్వాత దీనిని ఓపెన్ చెయ్యాలి. క్రింది చిత్రం లో చూపిన విధంగా ’ Add file' పై క్లిక్ చేసి ఒకటిగా చెయ్యవలసిన పీడీఎఫ్ ఫైళ్ళను యాడ్ చేసుకోవాలి. ప్రక్కన ఉన్న బటన్లను ఉపయోగించి అనవసరమైన ఫైళ్ళను తొలగించటం లేదా వాటి వరుస క్రమం మార్చటం చెయ్యవచ్చు.
ఫైళ్లు యాడ్ చెయ్యటం పూర్తి అయిన తర్వాత ’Bind' పై క్లిక్ చేస్తే ఫైళ్ళు అన్నీ ఒకే ఫైల్ గా మార్చబడే పైల్ కి పేరు ఇచ్చి కావలసిన చోట సేవ్ చేసుకోవాలి ... అంతే.
డౌన్లోడ్: pdfbinder
ధన్యవాదాలు