Wednesday, April 11, 2012

మీ పీసీ స్క్రీన్ ని వేరొక పీసీ లేదా ఇతర డివైజెస్ తో షేర్ చేసుకోవటానికి!!!

మన పీసీ ట్రబుల్ షూటింగ్ కోసమో లేదా మరి ఏయితర అవసరాల కోసమో మన డెస్క్  టాప్ ని ఇతరులతో షేర్ చేస్తూ ఉంటాం. డెస్క్ట్ టాప్ షేరింగ్ సంబంధించిన అప్లికేషన్లు మరియు బ్రౌజర్ యాడ్-ఆన్ ల గురించి ఇంతకు ముందు చాలా పోస్ట్ లలో చుశాం. ఇక్కడ మరొక వెబ్ ఆధారిత డెస్క్ టాప్ షేరింగ్ గురించి చెప్పబోతున్నాను అదే screenleap దీనిని ఉపయోగించి మన డెస్క్ టాప్ ని వేరొక పీసీ లేదా టాబ్లెట్ లేదా స్మార్ట్ ఫోన్ తో షేర్ చేసుకోవచ్చు. 

దీనిని ఎలా ఉపయోగించాలో చూద్దాం:

౧. ముందుగా  screenleap సైట్ కి వెళ్ళి ’Share your Screen Now' పై క్లిక్ చెయ్యాలి.

౨. జావా ప్లగిన్ పర్మిషన్ కోసం "Always run on this site". పై క్లిక్ చెయ్యాలి
౩. తర్వాత ఈ క్రింద చిత్రంలో చూపిన విధంగా విండో వస్తుంది, అక్కడ check the box దగ్గర టిక్ పెట్టి, "Run" ప్రెస్ చెయ్యాలి.

౪. ఇప్పుడు క్రింద చిత్రంలో చూపిన విధంగా URL వస్తుంది దానిని ఎవరితో అయితే మన స్క్రీన్ షేర్ చెయ్యాలనుకుంటున్నామో వారికి ఇవ్వాలి. అవతలి వారు ఆలింక్ ని ఉపయోగించి వెబ్ బ్రౌజర్ లో మన డెస్క్టాప్ చూడగలరు. అలాగే ఒక కంట్రోల్ బాక్స్ కూడా వస్తుంది దానిని ఉపయోగించి మొత్తం స్క్రీన్ లేదా ఎంచుకున్న భాగాన్ని షేర్ చెయ్యవచ్చు మరియు షేరింగ్ ’Pause' లేదా 'Stop' కూడా చెయ్యవచ్చు.


చూశారా ఒక చిన్న జావా ప్లగిన్ తప్పించి ఎటువంటి అప్లికేషన్ ఇనస్టలేషన్ చెయ్యకుండా మరియు ఎటువంటి రిజిస్ట్రేషన్ లేకుండా ఎంత సులభంగా డెస్క్ టాప్ షేర్ చేశామో!!!

వెబ్ సైట్: screenleap

ధన్యవాదాలు