Friday, April 27, 2012

డ్రాప్ బాక్స్ క్విక్ లింక్ తో ఇక ఫైల్ లేదా ఫోల్డర్ షేర్ చెయ్యటం చాలా సులువు...

ఉచిత ఆన్ లైన్ స్టోరేజీ ని అందిస్తున్న Dropbox లో ఇప్పుడు కావలసిన ఫైల్ లేదా ఫోల్డర్ మనకు కావలసిన వారితో షేర్ చేసుకోవటానికి ’Get Link' అనే ఆప్షన్ జత చెయ్యబడింది. డ్రాప్ బాక్స్ లో లాగిన్ అయ్యి షేర్ చెయ్యవలసిన ఫైల్ లేదా ఫోల్డర్ వరుసలో చివరన ఉన్న లింక్ గుర్తు పై క్లిక్ చెయ్యాలి. బ్రౌజర్ లో లింక్ ఓపెన్ అవుతుంది, అడ్రస్ బార్ లో ఉన్న లింక్ ని కాపీ చేసుకొని మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ తో షేర్ చేసుకోవచ్చు. అవతలి వారు సైన్-ఇన్ చెయ్యకుండానే మన ఫైల్ లేదా ఫోల్డర్ ని బ్రౌజర్ లో చూడగలరు.


మరింత సమాచారం కోసం డ్రాప్ బాక్స్ అఫీషియల్ బ్లాగ్ చూడండి.

ధన్యవాదాలు