ఎటువంటి రిజిస్ట్రేషన్ లేదా అప్లికేషన్ ఇనస్టలేషన్ చెయ్యకుండా ILovePDF సైట్ కి వెళ్ళి పీడీఎఫ్ ఫైళ్ళను Merge లేదా Split చెయ్యవచ్చు. సైట్ కి వెళ్లగానే ఈ క్రింది చిత్రం లో లా కనిపిస్తుంది.
ఫీడీఎఫ్ ఫైళ్ళను మెర్జ్ చెయ్యటానికి ’Merge PDF files' పై క్లిక్ చెయ్యాలి, తర్వాత ’ Select PDF Files' పై క్లిక్ చేసి మెర్జ్ చెయ్యవలసిన ఫైళ్ళను సెలెక్ట్ చేసుకోవాలి.
ఫైళ్ళను ఎంచుకున్న తర్వాత ’ Merge PDFs' పై క్లిక్ చెయ్యాలి. ఫైళ్ళు ఒక్కొక్కటిగా జత చెయ్యబడిన తర్వాత డౌన్లోడ్ కి సిద్ధమవుతుంది, Download లింక్ పై క్లిక్ చేసి మెర్జ్ చెయ్యబడిన ఫైల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అలాగే పెద్ద ఫైల్ ని చిన్న చిన్న ఫైల్స్ గా స్ప్లిట్ చెయ్యటానికి 'Split PDF' పై క్లిక్ చెయ్యాలి (మొదటి చిత్రం చూడండి).
అయితే మెర్జ్ లేదా స్ప్లిట్ చెయ్యటానికి కొన్ని పరిధులు ఉన్నాయి వాటిని ఇక్కడ చూడండి:
వెబ్ సైట్: ILovePDF