మనం ఎక్కవలసిన లేదా మనం ఎవరినైనా రిసీవ్ చేసుకోవటానికి స్టేషన్ కి వెళ్ళాలంటే కనుక వాళ్ళు వస్తున్న రైలు ఎన్ని గంటలకు వస్తుంది, ఎక్కడ ఉంది, ఎంత లేటు, వాటి రాక/ పోక అనే విషయాలను రైల్వే ఎంక్వరీ కి ఫోన్ చేసి కనుక్కుంటాం, ఒక్కొక్కసారి ఫోన్ లో చాలా సమయం వేచి ఉండవలసి కూడా వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు పైన తెలియచేసిన వివరాలను ఆన్ లైన్ లో కూడా చూడవచ్చు. దాని కోసం భారతీయ రైల్వే నిర్వహిస్తున్న http://www.trainenquiry.com/o/indexNS.aspx అనే సైట్ ఉపయోగపడుతుంది. అయితే ట్రైన్ నంబరు తెలిసి ఉండాలి. ’Enter Train Number' దగ్గర ట్రైన్ నంబర్ ఎంటర్ చేసి ’Search' పై క్లిక్ చెయ్యాలి. తర్వాత ట్రైన్ పేరు సెలెక్ట్ చేసుకొని ఏ స్టేషన్ వద్ద మీకు దాని రాకపోకలు కావాలో ఆ స్టేషన్ ని సెలెక్ట్ చేసుకొని ఈరోజు ట్రైన్ వివరాల కోసం ’for todays train' దగ్గర ’Go' పై క్లిక్ చెయ్యాలి.
అయితే పై సైట్ స్ధానం లో క్రొత్త సైట్ రాబోతుంది, అది బీటా దశలో ఉంది, దానిని ఇక్కడ చూడవచ్చు http://www.trainenquiry.com/. ఇక్కడ సెర్చ్ లో రైలు నంబర్ ఎంటర్ చెయ్యాలి, రైలు వివరాలు వస్తాయి, కావలసిన రోజు పై క్లిక్ చెయ్యాలి.
వెబ్ సైట్: http://www.trainenquiry.com/
ధన్యవాదాలు