Monday, May 4, 2009

జీ-మెయిల్ లో వెయ్యికి పైగా ఎమోషన్లు ...

గూగుల్ ఇప్పుడు జీ-మెయిల్ లో వెయ్యికి పైగా ఎమోషన్లు యాడ్ చేసింది ...కొత్త ఎమోషన్లలో జాతీయ పతాకలు, పండ్లు, జంతువులు, వాహనాలు, వివిధ యానిమేషన్లు యిలా విడివిడిగా 13 క్యాటగిరీల్లో వున్నాయి. ఈ-మెయిల్ పంపేటప్పుడు కొన్ని పదాలకు బదులుగా ఈ ఎమోషన్లను ఉపయోగించుకోవచ్చు. జీ-మెయిల్ లో ఈ ఫీచర్ పొందటం కోసం ...జీ-మెయిల్ లాగిన్ అయ్యి ...settings ---> Labs---> Extra Emoji దగ్గర Enable సెలెక్ట్ చేసుకుని....క్రిందవున్న Save Changes బటన్ పై క్లిక్ చేసి సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు ’Compose Mail' లో అధనపు ఎమోషన్లు పొందవచ్చు.



జీ-మెయిల్ కి సంబంధించిన సమాచారం, టిప్స్ మరియు ట్రిక్స్ కోసం జీ-మెయిల్ ఆఫీషియల్ బ్లాగ్ http://gmailblog.blogspot.com/ ని సందర్శించండి.

ధన్యవాదాలు