Tuesday, August 12, 2008

కమాండ్ ప్రాంప్ట్ టిప్స్

విండోస్ వుపయోగించటం మొదలైన తర్వాత కమాండ్ ప్రాంప్ట్ ని వుపయోగించటం చాలా వరకు తగ్గిపోయింది. కొన్ని టాస్క్ లు కమాండ్ ప్రాంప్ట్ దగ్గర రన్ చెయ్యటం సులభంగా వుంటుంది. కమాండ్ ప్రాంప్ట్ కోసం Start---> Run కి వెళ్ళి cmd అని టైప్ చేసి ’Ok' బటన్ లేదా [Enter] ప్రెస్ చెయ్యాలి. కమాండ్ ప్రాంప్ట్ కు సంభందించిన కొన్ని టిప్స్ ఇక్కడ చూద్దాం.


కమాండ్ ప్రాంప్ట్ హిస్టరీ:

DOS రోజుల్లో Doskey అనే కమాండ్ ద్వారా మనం ఎంటర్ చేసిన కమాండ్లను [Up/Down Arrow]ద్వారా ఒక్కొక్కటిగా సెలెక్ట్ చేసుకొనే వాళ్ళం. ఇప్పుడు Doskey ఎంటర్ చెయ్యకుండా [Up/Down Arrow] వుపయోగించి కమాండ్లను ఒక్కొక్కటిగా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా [F7] కీ ప్రెస్ చేసి మనం ఎంటర్ చేసిన కమాండ్లను మొత్తం ఒకేసారి ఈ క్రింది విధంగా చూడవచ్చు. ఇక్కడ [Up/Down Arrow] లను వుపయోగించి కావలసిన కమాండ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు.



[F3] కీ ప్రీవియస్ కమాండ్ ని ఎంటర్ చెయ్యటానికి వుపయోగించవచ్చు.

[F9] కీ కమాండ్ లైన్ నంబరు ఎంటర్ చెయ్యటానికి వుపయోగించవచ్చు. ([F7] కీ ప్రెస్ చేస్తే వచ్చే లిస్ట్ లో ప్రతి కమాండ్ కి ఒక నంబరు వుంటుంది, ఆ నంబరు ఎంటర్ చేస్తే దానికి ఎదురుగా వున్న కమాండ్ రన్ అవుతుంది)



అప్లికేషన్ రన్ అయిన తర్వాత కమాండ్ ప్రాంప్ట్ కోసం:

Start ---> Run నుండి రన్ చేసిన కొన్ని కమాండ్ లైన్ ప్రోగ్రాములు (ఉదా: chkdsk, tracert) అవి execute అయిన ఏమి జరిగిందో తెలుసుకొనే లోపే ఆ విండో క్లోజ్ అయిపోతుంది. అలా కాకుండా ప్రోగ్రామ్ రన్ అయిన తర్వాత కమాండ్ ప్రాంప్ట్ రావాలంటే Start---> Run లో మనం ఎంటర్ చేసే కమాండ్ లైన్ ప్రోగ్రాముల ముందు cmd /k అని టైప్ చెయ్యాలి. (ఉదా: cmd /k tracert 10.1.25.2)



కాపీ మరియు పేస్ట్:

సాధారణంగా కాపీ మరియు పేస్ట్ చెయ్యటానికి వుపయోగించే [Crtl]+[C], [Ctrl]+[V] షార్ట్ కట్ లు కమాండ్ ప్రాంప్ట్ విండో లో పనిచెయ్యవు. కమాండ్ ప్రాంప్ట్ విండో లో వున్న టెక్ల్ట్ ను కాపీ చెయ్యటానికి మౌస్ రైట్ క్లిక్ చేసి ’Mark' ని సెలెక్ట్ చేసుకోవాలి, మౌస్ ని డ్రాగ్ చేసి లేదా [Shift]+[Up/Down/Left/Rigt Arrow] లను వుపయోగించి కావలసిన టెక్ల్ట్ ను సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన టెక్స్ట్ ను కాపీ చెయ్యటానికి మౌస్ రైట్ క్లిక్ లేదా [Enter] బటన్ ప్రెస్ చెయ్యాలి. కావలసిన చోట పేస్ట్ చేసుకోవచ్చు. కమాండ్ ప్రాంప్ట్ విండో లోనే పేస్ట్ చెయ్యాలంటే మౌస్ రైట్ క్లిక్ చేసి ’Paste' ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.



క్విక్ ఎడిట్ మోడ్:

పైన చెప్పిన పధ్ధతి కాకుండా త్వరగా కాపీ మరియు పేస్ట్ చెయ్యటానికి కమాండ్ ప్రాంప్ట్ టైటిల్ బార్ పై మౌస్ రైట్ క్లిక్ చేసి ’Properties' ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓపెన్ అయిన విండో లో ’Edit Options' లో ’Quick Edit Mode' దగ్గర టిక్ చెయ్యాలి. ’Apply Properties' ఓపెన్ అవుతుంది అక్కడ వున్న ఆప్షన్లలో ఒకటి సెలెక్ట్ చెసుకొని ’Ok' క్లిక్ చెయ్యాలి.


ఆటో కంప్లీట్:

ఆటో కంప్లీట్ ఫీచర్ ద్వారా కమాండ్ ప్రాంప్ట్ దగ్గర ఎంటర్ చెయ్యవలసిన ఫైల్ నేమ్ లేదా ఫోల్డర్ నేమ్ యొక్క మొదటి కొన్ని అక్షరాలు ఎంటర్ చేసి [Tab]కీ ప్రెస్ చేస్తే ఆటోమాటిక్ గా ఫైల్ నేమ్ లేదా ఫోల్డర్ నేమ్ పూర్తిచేయబడుతుంది. ఒకటి కంటే ఎక్కువ ఫలితాలు వస్తే [Tab] ప్రెస్ చేస్తూ వెళ్ళాలి.


ఫుల్ స్క్రీన్ మోడ్:

కమాండ్ ప్రాంప్ట్ విండో ను ఫుల్ స్క్రీన్ మోడ్ కి మార్చటానికి [Alt]+[Enter] ప్రెస్ చెయ్యాలి, తిరిగి యదాస్ధితికి తీసుకొని రావటానికి అవే కీ లను ప్రెస్ చెయ్యాలి.

ప్రాంప్ట్ ని మార్చటానికి:

ప్రాంప్ట్ ని మార్చటానికి ఈ క్రింది విధంగా చెయ్యండి:

PROMPT $D - ప్రాంప్ట్ Current Date కి మార్చబడుతుంది
PROMPT $T - ప్రాంప్ట్ Current Time కి మార్చబడుతుంది
PROMPT $P - ప్రాంప్ట్ Path కి మార్చబడుతుంది
PROMPT $G - ప్రాంప్ట్ > కి మార్చబడుతుంది
PROMPT $V - ప్రాంప్ట్ Windows Version కి మార్చబడుతుంది
PROMPT $M - ప్రాంప్ట్ Network Path for Mapped drives కి మార్చబడుతుంది
PROMPT $P$G - ప్రాంప్ట్ Default(యదాస్ధితికి) కి మార్చబడుతుంది



టైటిల్ బార్ మార్చటానికి:

కమాండ్ ప్రాంప్ట్ టైటిల్ బార్ లోని టెక్స్ట్ ను మార్చటానికి TITLE కమాండ్ ని వుపయోగించాలి.ఉదా: టైటిల్ బార్ లో యూజర్ నేమ్, డేట్, టైమ్ రావటానికి TITLE %USERNAME% %DATE% %TIME% అని ఎంటర్ చెయ్యాలి.


ఫాంట్స్, కలర్, లేఅవుట్ మార్చటానికి:

కమాండ్ ప్రాంప్ట్ టైటిల్ బార్ పై మౌస్ రైట్ క్లిక్ చేసి ’Properties' సెలెక్ట్ చేసుకోవాలి. ఓపెన్ అయిన ’Properties' లో ఫాంట్స్, కలర్, లేఅవుట్ మార్చుకోవచ్చు.



కమాండ్ ప్రాంప్ట్ కావలసిన డైరెక్టరీ లో ఓపెన్ కావటాకిని:

సాధారణంగా కమాండ్ ప్రాంప్ట్ C:\Documents and Settings\Username లో ఓపెన్ అవుతుంది. అలా కాకుండా మనకు కావలసిన డైరెక్టరీ లో ఓపెన్ చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం, ముందుగా C:\windows\system32\cmd.exe తో ఒక షార్ట్ కట్ క్రియేట్ చేసుకోవాలి. ఆ షార్ట్ కట్ పై మౌస్ రైట్ క్లిక్ చేసి ’Properties' సెలెక్ట్ చెసుకోవాలి. ’Properties' విండో లో ’Start in ' దగ్గర కమాండ్ ప్రాంప్ట్ ఏ డైరెక్టరీ లోఅయితే ఓపెన్ కావాలో దాని Path యివ్వాలి.




ధన్యవాదాలు