Thursday, August 7, 2008

విండోస్ XP లో మెనూలను అక్షర క్రమంలో ఎరేంజ్ చెయ్యటం ఎలా ?

హెచ్చరిక: రిజిస్ట్రీ తో ఆడుకోవటం సిస్టం ఆరోగ్యానికి హానికరం

సాధారణంగా మనం ఏదైనా ప్రోగ్రాములు ఇనస్టలేషన్ చేసినప్పుడు, ఆ క్రమం లోనే ’All Programs' లో మెనూలు చూపబడతాయి. విండోస్ XP లో ’All Programs' లో మెనూలను అక్షర క్రమంలో ఎరేంజ్ చెయ్యటం ఎలాగో చూద్దాం.


1.Start---> Run కి వెళ్ళి regedit అని టైప్ చేసి [Enter] బటన్ క్లిక్ చెయ్యాలి.



2.Registry Editor ఓపెన్ అవుతుంది. దానిలో ఎడమచేతి ప్రక్క విండో లో Mycomputer\HKEY_CURRENT_USER\Software\Microsoft\Windows\CurrentVersion\Explorer\MenuOrder ఫోల్డర్ పై మౌస్ రైట్ క్లిక్ చేసి ’Permissions' సెలెక్ట్ చేసుకోవాలి.



3.ఇక్కడ ఓపెన్ అయిన 'Permissions for MenuOrder' లో ’Advanced' బటన్ క్లిక్ చెయ్యాలి.



4.'Advanced Security Settings for MenuOrder' లో 'Inherit from parent the permission entries that apply to child objects. Include these with entries explicitly defined here' దగ్గర వున్న ’టిక్’ (Uncheck) తీసివేయాలి.



5.'Security' డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది.ఇక్కడ ’Copy' బటన్ క్లిక్ చెయ్యాలి.



6. తిరిగి 'Advanced Security Settings for MenuOrder' ఓపెన్ అవుతుంది, ముందుగా 'Apply' తర్వాత ’Ok' బటన్లు క్లిక్ చెయ్యాలి.



7. ఇప్పుడు మరల ’Permissions for MenuOrder' ఓపెన్ అవుతుంది, ఇక్కడ యూజర్ సెలెక్ట్ చేసుకొని, క్రింద ’Permissions' లో ’Full Control' దగ్గరవున్న టిక్ తీసివేయాలి.



8. ఇప్పుడు ముందుగా 'Apply' తర్వాత ’Ok' బటన్లు క్లిక్ చెయ్యాలి.



9. చివరగా సిస్టం రీస్టార్ట్ చెయ్యాలి. అంతే మెనూలు అక్షర క్రమంలో ఎరేంజ్ అవుతాయి.



లెంగ్త్ ఎక్కువైనా ...అర్ధమయ్యేలా చెప్పాలనే ప్రయత్నమ్...

ధన్యవాదాలు