Friday, August 1, 2008

'My Documents' ఫోల్డర్ డీఫాల్ట్ లొకేషన్ మార్చటం ఎలా?

మన సిస్టం లో 'My Documents' ఒక కీలకమైన ఫోల్డర్। ఎందుకంటే Ms Office ఫైళ్ళన్నీ డీఫాల్ట్ గా 'My Documents' పోల్డర్ లోనే సేవ్ చెయ్యబడతాయి. ఫార్మేట్ చేసి నప్పుడు కానీ లేదా విండోస్ రీఇనస్టలేషన్ చేసినప్పుడు గానీ 'My Documents' పోల్డర్ లోని ఫైళ్ళన్నీ తొలగించబడతాయి. అందుకే 'My Documents' ఫోల్డర్ డీఫాల్ట్ లొకేషన్ మార్చటం మంచిది. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

1.ముందుగా 'My Documents' ఫోల్డర్ ని ఎక్కడికైతే మార్చాలనుకొంటున్నామో అక్కడ ఒక కొత్త ఫోల్డర్ క్రెయేట్ చేసుకోవాలి. ఉదా: నేను Mydoc అనే ఫోల్డర్ ని E: లో క్రెయేట్ చేశాను, 'My Documents' దానిలోకి మారుస్తాను.

2.'My Documents' ఫోల్డర్ పై మౌస్ రైట్ క్లిక్ చేసి ’Properties' సెలెక్ట్ చేసుకోవాలి.


3.'Properties' విండోలో 'Target' దగ్గర Step 1 లో మనం క్రియేట్ చేసుకొన్న ఫోల్డర్ లొకేషన్ ని ఎంటర్ చేసి ’Apply' బటన్ క్లిక్ చెయ్యాలి.


4.కన్ఫర్మేషన్ విండో లో ’Yes' బటన్ పై క్లిక్ చేస్తే, ఫైల్స్ అన్నీ కొత్తలొకేషన్ లోకి మూవ్ అవుతాయి.



'My Documents' ఫోల్డర్ ని తిరిగి దాని డీఫాల్ట్ లొకేషన్ మార్చటం :

'My Documents' ఫోల్డర్ పై మౌస్ రైట్ క్లిక్ చేసి ’Properties' సెలెక్ట్ చేసుకోవాలి, 'Properties' విండోలో 'Restore Default' బటన్ పై క్లిక్ చేస్తే డీఫాల్ట్ లొకేషన్ వస్తుంది. తర్వాత ’Apply' బటన్ పై క్లిక్ చెయ్యాలి. కన్ఫర్మేషన్ విండో లో ’Yes' బటన్ పై క్లిక్ చెయ్యాలి. అంతే 'My Documents' ఫోల్డర్ ని తిరిగి దాని డీఫాల్ట్ లొకేషన్ మార్చబడుతుంది.



ధన్యవాదాలు