సాధారణంగా విండోస్ లోని డీఫ్రాగ్మెంటేషన్ యుటిలిటీ ని వుపయోగించి అన్ని డిస్క్ పార్టీషన్లను ఒకేసారి డీఫ్రాగ్మెంట్ చెయ్యలేము. మీ సిస్టం లో ఒకటి కంటే ఎక్కువ డిస్క్ పార్టీషన్లు(ఉదా:C,E,F) వుంటే వాటిని ఒకేసారి ఒకదాని తర్వాత మరొకటి డీఫ్రాగ్మెంట్ చెయ్యటానికి ఈ క్రింది విధంగా చెయ్యండి.
నోట్ పాడ్ ఓపెన్ చేసి ఈ క్రింద ఇచ్చిన కమాండ్లను టైప్ చేసి దానిని defrag.bat పేరుతో సేవ్ చెయ్యండి. అది బ్యాచ్ పైల్ గా మరుతుంది.
defrag c: -f
defrag e: -f
defrag f: -f
డీఫ్రాగ్మెంటేషన్ చెయ్యటానికి defrag.bat ఫైల్ పై డబల్ క్లిక్ చెయ్యాలి.
ధన్యవాదాలు