LAN లో ఒక సిస్టం నుండి మరొక సిస్టం కు మెసేజ్ పంపటానికి నెట్ లో IP Messenger అనే చిన్న అప్లికేషన్ దొరుకుతుంది, దీనిని http://www.ipmsg.org/index.html.en నుండి Zip ఫైల్ (సైజ్ 103 KB) డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అన్ జిప్ చేసిన తర్వాత ipmsg అనే పైల్ ని Copy చేసి Start ---> All Programs ----> Startup లో Paste చెయ్యాలి్,ఇలా చెయ్యటం వలన సిస్టం రీస్టార్ట్ చేసిన ప్రతిసారీ ipmsp Icon సిస్టం ట్రే లో వస్తుంది. ఇదేవిధంగా LAN లోని అన్ని సిస్టం లలో చెయ్యాలి. సిస్టం ట్రే లోని ipmsp Icon పై డబల్ క్లిక్ చేస్తే LAN Users లిస్ట్ వస్తుంది, మెసేజ్ సెలెక్టెడ్ యూజర్ కి కాని, గ్రూప్ కి కాని, లేదా అందరికీ ఒకేసారి పంపవచ్చు.
ఇది LAN లోనే కాదు WAN లో కూడా పనిచేస్తుంది. WAN లో పని చెయ్యాలంటే రిమోట్ సిస్టం IP Address యాడ్ చేసుకోవాలి మరియు ఈ అప్లికేషన్ ఆ సిస్టం లో కూడా వుండాలి.
ధన్యవాదాలు