ఓపెన్ అయిన అన్ని ప్రోగ్రాములు, ఫోల్డర్లను ఒక క్లిక్ తో క్లోజ్ చెయ్యటానికి నెట్ లో CloseALL అనే ఒక చిన్న యుటిలిటీ దొరుకుతుంది, దీనిని
http://www.ntwind.com/software/utilities/close-all.html నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ZIP ఫైల్ సైజ్ 18 KB మాత్రమే, అన్ జిప్ చేసిన తర్వాత CloseALL అనే ఫైల్ పై డబల్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిన అన్ని ప్రోగ్రాములు, ఫోల్డర్లు క్లోజ్ అవుతాయి. క్లోజ్ అయ్యేముందు ఏదైనా యాక్షన్ అవసరమైతే దానికి సంభంధించిన డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. CloseALL షార్ట్ కట్ ను Start Menu లో గానీ, Quick Launch లో గానీ లేదా మరెక్కడైనా వుంచవచ్చు.

ధన్యవాదాలు