Friday, September 12, 2008

FastStone Photo Resizer - ఇమేజ్ లను రీసైజ్ చేసే ఫ్రీవేర్


ఇమేజ్ లను రీసైజ్ చెయ్యటానికి FastStone Photo Resizer వుపయోగపడుతుంది, ఇది ఫ్రీవేర్, Zip ఫైల్ సైజ్ 1.3 MB మాత్రమే. దీనిని http://www.faststone.org/FSResizerDownload.htm నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అనేక ఫైళ్ళ ను ఒకేసారి రీసైజ్ చెయ్యటమే కాకుండా, ఒకేసారి వివిధ పధ్ధతులలో రీనేమ్ చేసుకొనే అవకాశం కూడా వుంది. అంతేకాకుండా అడ్వాన్సుడు ఆప్షన్స్ ను వుపయోగించి DPI మార్చుకోవచ్చు, టెక్స్ట్ మరియు లోగో లను యాడ్ చేసుకోవచ్చు. ఈ సాప్ట్ వేర్ దాదాపు అన్ని పాపులర్ ఇమేజ్ ఫార్మేట్ల ను సపోర్ట్ చేస్తుంది.

USB Drive లనుండి ఈ అప్లికేషన్ డైరెక్ట్ గా రన్ చెయ్యటానికి సాప్ట్ వేర్ ఇదే సైట్ లో లభిస్తుంది.

ధన్యవాదాలు