Thursday, June 7, 2012

మీ సెర్చ్ హిస్టరీని ట్రాక్ చెయ్యని సెర్చ్ ఇంజిన్ల్లు...


అంతర్జాలంలో ఏదైనా సెర్చ్ చెయ్యాలంటే కనుక మనకు ముందుగా గుర్తు వచ్చే సెర్చ్ ఇంజిన్ Google... అయితే దీనితోపాటు ప్రముఖ సెర్చ్ ఇంజిన్లైన యాహూ, బింగ్ మన సెర్చ్ హిస్టరీని ట్రాక్ చేసి, మనకొక ఫ్రొఫైల్ నిర్మించి దానిని బట్టి సెర్చ్ రిజల్ట్స్ ని అందిస్తాయి... అయితే మన సెర్చ్ హిస్టరీని ట్రాక్ చెయ్యని సెర్చ్ ఇంజన్స్ గురించి ఇక్కడ తెల్సుకుందాం: 

DuckDuckGo: ఇది మన వ్యక్తిగత సమాచారాన్ని సేకరించదు మరియు ఎవరితో షేర్ చెయ్యదు. DuckDuckGo ప్రైవసీ పాలసీ ఇక్కడ చూడండి.   ఒక్కొక్కరికి వేరేలా కాకుండా అందరికీ ఒకే సెర్చ్ రిజల్ట్స్ ని ఇది అందిస్తుంది. దీని హోమ్ పేజి చాలా సింపుల్ గా ఉంటుంది.




DuckDuckGo లాగానే మన వ్యక్తిగత సమాచారం సేకరించని ఇతర సెర్చ్ ఇంజిన్లు StartPage, ixquick, Blekko, Ask


ధన్యవాదాలు