వైరస్ లు మన కంప్యూటర్ లో ఏదో ఒక రూపం లో ప్రవేశిస్తూ ఉంటాయి అవి మాల్వేర్లు, స్పైవేర్లు, ట్రోజాన్స్ లేదా వార్మ్స్ ఏవైనా కావచ్చు. ఒక్కొక్కసారి ఈ వైరస్ లు మీ పీసీ లో వైరస్ ఉంది ఈ యాంటీవైరస్ రన్ చేస్తే వైరస్ లను తొలగించవచ్చంటూ యాంటీవైరస్ ల అవతారం ఎత్తి దర్శనమిస్తూ ఉంటాయి. వీటిని రన్ చేస్తే వైరస్ లను తొలగించవు సరి కదా క్రొత్తవాటిని చేరుస్తాయి, ఇవే ఫేక్ యాంటీ వైరస్ లు. Fake Antivirus Remover అనే ఉచిత టూల్ మన పీసీ లో ఉన్న ఫేక్ యాంటీ వైరస్ కనుగొని వాటిని తొలగిస్తుంది, దీనిని Trend Micro అనే జపనీస్ కంప్యూటర్ సెక్యూరిటీ కంపెనీ రూపొందించింది, వీరి ప్రకారం కొన్ని ఫేక్ యాంటీ వైరస్ అప్లికేషన్లు ఇవి: Additional Guard, Advanced Defender, AKM Antivirus, AlphaAV, Anticare, Antivir64, BitDefender, BlueFlare Antivirus, bug doctor, BootCare, CleanV, Cyber Security, Data Protection, Ddos Clean, Dr, Guard, Easy Scan, HDD Fix, Infor-Safe, Malware Defense, LightClean, Privacy PC మొదలగునవి.
డౌన్లోడ్: Fake Antivirus Remover
ధన్యవాదాలు