Wednesday, June 13, 2012

RSS అంటే ఏమిటి? RSS ఫీడ్స్ కోసం డెస్క్ టాప్ అప్లికేషన్!!

మనకు కావలసిన న్యూస్ లేదా కంటెంట్ సంబంధించిన సమాచారం కోసం ఆయా సైట్లను తరచూ సందర్శిస్తూ ఉంటాం... క్రొత్త కంటెంట్ ఉందో లేదో తెలుసుకోవటానికి తప్పనిసరిగా ఆయా సంబంధిత సైట్లకు వెళ్ళాల్సిందే. ఒక్కొక్కసారి సమయం కుదరక లేదా వేరే ఇతర కారణాల వలన కొన్ని సైట్లు చూడటం కుదరనప్పుడు వాటిలోని అప్ డేటెడ్ సమాచారాన్ని మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా జరగకుండా ఉండటానికి RSS టూల్స్ ఉపయోగపడతాయి. మనకు నచ్చిన సైట్లను బ్రౌజర్ లో ఎలా అయితే బుక్ మార్క్ చేస్తామో అలానే RSS లో కూడా నచ్చిన సైట్ల URL ని యాడ్ (బుక్ మార్క్) చేసుకోవటం ద్వారా ఆయా సైట్లలో క్రొత్త కంటెంట్ పబ్లిష్ అవగానే అవి ఇక్కడ కూడా అప్ డేట్ చెయ్యబడతాయి. RSS ముందుగా RDF Site Summary  తర్వాత Rich Site Summary ఆ తర్వాత Real Simple Syndication గా పిలుస్తున్నారు.  RSS  వివిధ సైట్ల నుండి తీసుకునే కంటెంట్ ని Feed అంటారు. ఈ  Feeds ని వివిధ సైట్ల నుండి సబ్ స్క్రైబ్ చేసుకోవటానికి ఉపయోగించే టూల్స్ ని Feed Readers అంటారు.  అంతర్జాలంలో చాలా ఫీడ్ రీడర్స్ ఉన్నాయి వాటిలో ప్రముఖమైనది ఎక్కవమంది ఉపయోగించేది Google Reader దీనిని reader.google.com కి వెళ్ళి మీ గూగుల్ అకౌంట్ తో సైన్-ఇన్ చెయ్యవచ్చు. ఇక్కడ ’Subscribe' పై క్లిక్ చేసి కావలసిన సైట్ URL ఎంటర్ చెయ్యాలి.



గూగుల్ రీడర్ లో అయితే ఆ సైట్ కి వెళ్ళి ఫీడ్స్ చదువుకోవచ్చు అదే Snackr అనే అడోబ్ అయిర్ ఆధారిత అప్లికేషన్ ని ఉపయోగించి ఫీడ్స్ ని మన డెస్క్ టాప్ పైనే పొందవచ్చు.  Snackr ఇనస్టలేషన్ కి ముందు Adobe Air  ని ఇనస్టలేషన్ చేసుకోవాలి. 


ఇప్పుడు Snackr సైట్ కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని ఇనస్టలేషన్ చేసుకోవాలి.  గూగుల్ రీడర్ తో సింక్రనైజ్ చేసుకునే సదుపాయం కూడా కలదు.

Snackr ని రన్ చేసినప్పుడు డెస్క్ టాప్ పై ఫీడ్స్ వస్తాయి, దానిని మినిమైజ్ చేసినప్పుడు సిస్టం ట్రే లో ఉంటుంది.  ’+’  గుర్తు పై క్లిక్ చేసి ఫీడ్ ని యాడ్ చేసుకోవచ్చు. 


’Options' బటన్ పై క్లిక్ చేసి ఫీడ్స్ మేనేజ్ చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం ఇక్కడ చూడండి.

ధన్యవాదాలు