Saturday, June 23, 2012

Microsoft Research Cliplets - GIF తరహా యానిమేషన్లు తయారు చేసుకోవటానికి!!

GIF  ఫైళ్ళను చూసే ఉంటారు అది ఇమేజ్ అయినా దానిలోని కొంత భాగం కదులుతూ ఉంటుంది ఉదా: ఒక అమ్మాయి బొమ్మే ఉందనుకోండి దానిలో కనురెప్పలు మాత్రం మూస్తూ తెరుస్తూ ఉంటాయి. ఇలాంటివి మనం కూడా సులభంగా తయారు చేసుకోవచ్చు దానికోసం మైక్రోసాప్ట్ రీసెర్చ్ క్లిప్‌లెట్స్ ఉపయోగించవచ్చు. బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ స్థిరంగా ఉంటుంది దానిలో కొంత యానిమేషన్ ఉంటుంది. Microsoft Reasearch Cliplets విండోస్ 7 32 లేదా 64 బిట్ వెర్షన్లలోనే పనిచేస్తుంది. దీనిని ఎలా ఊపయోగించాలో తెలియచేసే వీడియో ట్యుటోరియల్స్ మైక్రోసాప్ట్ సైట్ లో ఉన్నాయి. 

ముందుగా మీ ఆపరేటింగ్ సిస్టం కి తగిన క్లిప్‌లెట్ ని డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకోవాలి. తర్వాత Cliplets లాంచ్ చేసిన తర్వాత కావలసిన వీడియో పైల్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చెయ్యొచ్చు లేదా Open పై క్లిక్ చేసి కూడా వీడియోని ఓపెన్ చెయ్యవచ్చు. వీడియో లోడ్ అయిన తర్వాత Input దగ్గర బ్యాక్‌గ్రౌండ్ గా ఉపయోగించుకోవలసిన భాగాన్ని ఎంచుకోవాలి. అదే కుడి చేతి ప్రక్కనున్న Still దగ్గర కనబడుతుంది. దాని క్రింద ఉన్న Add New Layer పై క్లిక్ చేసి Loop ని ఎంచుకొని ఇమేజ్ లో యనిమేట్ కావలసిన భాగాన్ని మార్క్ చేసుకోవాలి తర్వాత క్రింద ఉన్న ప్లే బటన్ పై క్లిక్ చేసి Cliplet ఎలా వచ్చిందో చూసుకోవచ్చు. తర్వాత దానిని సేవ్ కూడా చేసుకోవచ్చు. మరింత అవగాహన కోసం ఈ క్రింది ట్యుటోరియల్ చూడండి.




డౌన్లోడ్ మరియు ఇతర సమాచారం కోసం Microsoft Reasearch Cliplets సైట్ చూడండి.

ధన్యవాదాలు