Google Hangout తో ఆన్‌లైన్ మీటింగ్స్ లో పాల్గొనవచ్చు. దీనికోసం plus.google.com/hangouts కి వెళ్ళి Start a Hangout పై క్లిక్ చెయ్యాలి. మీటింగ్ లో పాల్గ్నవలసిన వారి పేర్ల ను ఎంచుకున్న తర్వాత హ్యాంగ్ అవుట్ కి ఒక పేరు పెట్టి Hangout బటన్ పై క్లిక్ చెయ్యాలి. ఎమ్చుకున్న వారికి నోటిఫికేషన్ పంపబడుతుంది, అక్కడ Hangout బటన్ పై క్లిక్ చేసి హ్యాంగ్ అవుట్ లో పాల్గొనవచ్చు. మీటింగ్ లో పాల్గొనేవారికి వెబ్ క్యామ్ మరియు మైక్ తప్పని సరిగా ఉండాలి మరియు గూగుల్ ప్లస్ యూజర్లు మాత్రమే హ్యాంగ్ అవుట్ లో పాల్గొన గలరు. మనం ఎంతమందినైనా ఆహ్వానించవచ్చు అయితే ఒకేసారి పదిమంది మాత్రమే హ్యాంగ్ అవుట్ లో పాల్గొనగలరు. గూగుల్ హ్యాంగ్ అవుట్ లో చాట్, గూగుల్ డాక్స్, స్క్రీన్ షేరింగ్ మొ. ఇంటిగ్రేట్ చెయ్యబడి ఉన్నాయి.
మరింత సమాచారం కోసం ఇక్కడ చూడండి.
వెబ్ సైట్: plus.google.com/hangouts
ధన్యవాదాలు