Monday, August 30, 2010

Falco GIF Animator - ఉచిత GIF యానిమేషన్ సాప్ట్ వేర్...

వివిధ అవసరాల కోసం యానిమేటెడ్ ఇమేజ్ లను తయారు చేసుకోవటం/ ఎడిట్ చెయ్యటం కోసం Falco GIF Animator అనే ఉచిత సాప్ట్ వేర్ ఉపయోగపడుతుంది. Paint మాదిరిగానే దీనిలోకూడా డ్రాయింగ్ టూల్స్ వున్నాయి అంతే కాకుండా యానిమేషన్ తయారుచెయ్యటం కోసం వివిధ స్పెషల్ ఎఫెక్ట్స్ కూడా వున్నాయి. Falco GIF Animator దాదాపు అన్ని ఇమేజ్ ఫార్మేట్లను (BMP, JPG, DLL/EXE, GIF, PSD మరియు TIFF) సపోర్ట్ చేస్తుంది.

Falco GIF Animator కి సంబంధించిన డెమో:



మరింత సమాచారం కోసం Falco GIF Animator సైట్ చూడండి.

డౌన్లోడ్: Falco GIF Animator (సైజ్: 18.2 MB)

ధన్యవాదాలు

Friday, August 27, 2010

Brother System Care - ఒక పూర్తి సిస్టం మెయింటెనెన్స్ సొల్యూషన్ ...

కొంతకాలం ఉపయోగించిన తర్వాత పీసీ వేగం మందగించటం గమనిస్తూ వుంటాం, టెంపరరీ ఫైళ్ళు పేరుకు పోవటం, హార్డ్ డిస్క్ లో డాటా వివిధ ప్రదేశాల్లో విస్తరించి వుండటం, రిజిస్ట్రీ సమస్యలు, అనవసరైన స్టార్ట్ అప్ ప్రాసెస్ లు/ ప్రోగ్రాములు మొదలగునవి కారణం కావచ్చు. ఈ సమస్య నుండి బయటపడి పీసీ పనితనం మెరుగుపడాలంటే పీసీ మెయింటెనెన్స్ చేసి తీరాల్సిందే. నెట్ లో చాలా ఉచిత ట్యూనింగ్ యుటిలిటీస్ దొరుకుతాయి, వాటిలాంటిదే Brother System Care - మీ పీసీ పూర్తి బాధ్యత తీసుకుంటుంది.



Brother System Care చేసే పనులు:
- viewing system performance
- scanning and fixing registry errors
- optimizing various system components
- providing network, disk, RAM optimizations
- managing startup processes, visual effects etc.


డౌన్లోడ్: Brother System Care

ధన్యవాదాలు

Dropbox Uploader - ఎవరైనా మీ డ్రాప్ బాక్స్ ఎకౌంట్ కి ఫైళ్ళను అప్ లోడ్ చెయ్యవచ్చు

డ్రాప్ బాక్స్ లో ఆన్ లైన్ లో ఫైళ్ళను బ్యాక్ అప్ తీసుకొని స్నేహితులతో షేర్ చేసుకోవచ్చు...ఇతరులు మన ఎకౌంట్ కి అప్ లోడ్ చేసే సదుపాయం లేదు... కాని ఇప్పుడు Dropbox Uploader అనే PHP Class ని ఉపయోగించి ఎవరైనా ఎక్కడనుండైనా మన డ్రాప్ బాక్స్ కి ఫైళ్ళను అప్ లోడ్ చెయ్యవచ్చు. ఒకే టీమ్ లో పనిచేసే వారికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది.

ఇక ఫైళ్ళను ఎలా అప్ లోడ్ చెయ్యాలో దానికి సంబంధించిన వీడియో ని ఇక్కడ చూడండి:



డౌన్లోడ్: Dropbox Uploader

ధన్యవాదాలు

Thursday, August 26, 2010

USB Port Locked - USB పోర్ట్ లను డిసేబుల్ చెయ్యటానికి పోర్టబుల్ అప్లికేషన్...

USB డ్రైవ్ లను USB పోర్ట్ లకు కనెక్ట్ చేసి డాటా ట్రాన్స్ ఫర్ చేస్తూ ఉంటాం ...కొన్ని డ్రైవ్ ల నుండి ఒక్కొక్కసారి డాటాతో పాటు స్పైవేర్లు / మాల్వేర్లు కూడా పీసీ లోకి ప్రవేశిస్తాయి. మనకు తెలియకుండా యితరులు మన సిస్టం కి USB డ్రైవ్ లు కనెక్ట్ చెయ్యకుండా USB పోర్ట్ లను డిసేబుల్ చెయ్యవచ్చు, దీని కోసం USB Port Locked అనే పోర్టబుల్ అప్లికేషన్ ఉపయోగపడుతుంది.



USB Port Locked ని ఉపయోగించటం చాలా సులువు, అప్లికేషన్ ని రన్ చేసి ’Lock USB Port' బటన్ పై క్లిక్ చేస్తే పోర్ట్ లాక్ అవుతుంది, అన్ లాక్ కోసం ’Un-Lock USB Port' బటన్ పై క్లిక్ చెయ్యాలి. అంతే చాలా సింపుల్ కదా!!!

USB Port Locked రెండు వెర్షన్లలో లభిస్తుంది....ఒకటి పాస్ వార్డ్ లేకుండా రెండవది పాస్ వార్డ్ ఉపయోగించి పోర్ట్ లాక్ చేసేది.

డౌన్లోడ్: USB Port Locked

ధన్యవాదాలు

Wednesday, August 25, 2010

Process Lasso - పీసీ ఫెర్మార్మెన్స్ ని పెంచే ఆటోమాటిక్ విండోస్ ప్రాసెస్ ట్యూనర్....

Process Lasso ఒక శక్తివంతమైన విండోస్ ఆప్టిమైజేషన్ టూల్... ఒక విధంగా చెప్పాలంటే విండోస్ టాస్క్ మేనేజర్ కి ప్రత్యామ్నాయం అని చెప్పవచ్చు. ఇంతకు ముందు పెయిడ్ వెర్షన్ గా వుండేది, ఇప్పుడు షేర్ వేర్ గా లభిస్తుంది. Process Lasso సిస్టం రన్ అవుతున్న అన్నీ ప్రోగ్రామ్స్/ ప్రాసెస్ ల కి సంబంధిన పూర్తి సమాచారాన్ని చూపెడుతుంది మరియు అవి కొన్ని నియమాలకు కట్టుబడేలా చేస్తుంది.

Process Lasso ని ముందుగా ఆ సైట్ కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి, డౌన్లోడ్ జిప్ ఫైల్ సైజ్ 1.50 MB మాత్రమే, అన్ జిప్ చేసి ఇనస్టలేషన్ చేసుకొన్న తర్వాత అది సిస్టం ట్రే లో కూర్చుంటుంది.



Process Lasso ఇంటర్ ఫేజ్ విండోస్ టాస్క్ మేనేజర్ ని పోలి వుంటుంది, responsiveness, memory load మరియు processor use ని గ్రాఫ్ రూపంలో చూపెడుతుంది. ముందుగా చెప్పుకున్నట్లు All Processes టాబ్ లో Process Lasso సిస్టం లో ముందు/ వెనక రన్ అన్ని ప్రాసెస్ ల కి సంబంధించిన పూర్తి సమాచారం మరియు వాటి మెమొరీ/ సీపీయూ యూసేజ్ ని చూపెడుతుంది. ఏదైనా ప్రాసెస్ పై మౌస్ రైట్ క్లిక్ చేస్తే వచ్చే ఆప్షన్లను ఉపయోగించి ఆ ప్రాసెస్స్ కి Priority Class ని సెట్ చెయ్యవచ్చు, అవసరం లేని వాటిని అంతం చెయ్యవచ్చు, తిరిగి రీస్టార్ట్ చెయ్యవచ్చు, ఇలా ఎన్నో అడ్వాన్స్ డు ఫీచర్స్ దీనిలో వున్నాయి. Process Lasso ని ఉపయోగించి రీసోర్స్ అల్లోకేషన్ ని పూర్తిగా మన కంట్రోల్ లో ఉంచుకోవచ్చు.



Active Processes టాబ్ లో ముందు భాగం (foreground)లో రన్ అవుతున్న అప్లికేషన్ల లిస్ట్ చూపెడుతుంది. యాక్షన్స్ లాగ్ కూడా క్రియేట్ చెయ్యబడుతుంది.

మరింత సమాచారం కోసం Process Lasso సైట్ ని చూడండి.

డౌన్లోడ్: Process Lasso (సైజ్: 1.53 MB)

ధన్యవాదాలు

Tuesday, August 24, 2010

CloudMagic - జీమెయిల్ కోసం ఒక శక్తివంతమైన సెర్చ్ టూల్...

CloudMagic అనే బ్రౌజర్ ఎక్స్ టెన్షన్ ని ఉపయోగించి జీ-మెయిల్ లో చాలా వేగంగా అంటే టైప్ చేస్తూనే కావలసిన సమాచారాన్ని సెర్చ్ చేసి పొందవచ్చు. CloudMagic ప్రస్తుతానికి ఫైర్ ఫాక్స్ మరియు క్రోమ్ బ్రౌజర్లలో మాత్రమే పనిచేస్తుంది మరియు జీమెయిల్ లో మాత్రమే సెర్చ్ చేస్తుంది. మిగతా మెయిల్ (హాట్ మెయిల్, యాహూ మొదలగు వాటికి) మరియు గూగుల్ డాక్స్ సపోర్ట్ త్వరలో రానుంది.

అయితే ముందుగా CloudMagic సైట్ కి వెళ్ళి 'Install Now' పై క్లిక్ చేసి వచ్చే సూచలను ఫాలో అయి ఇనస్టలేషన్ చేసుకోవాలి, తర్వాత జీమెయిల్ లాగిన్ అవ్వాలి... ఒకవేళ అల్రెడీ లాగిన్ అయి వుంటే కనుక రీఫ్రెష్ చెయ్యాలి. అక్కడ cloudmagic సెర్చ్ బాక్స్ వస్తుంది. డ్రాప్ డౌన్ యారో పై క్లిక్ చేసి ’Manage Accounts' ని సెలెక్ట్ చేసుకోవాలి, అక్కడ మన జీమెయిల్ ఐడి మరియు పాస్ వార్డ్ ఎంటర్ చెయ్యాలి అవి మిగతా ఈ-మెయిల్ క్లైంట్స్ మాదిరిగానే మన లోకల్ కంప్యూటర్ లో సేవ్ చెయ్యబడతాయి. ఇప్పుడు మరల జీ-మెయిల్ కి వెళ్ళి కావలసిన సమాచారానికి సంబంధించిన పదం టైప్ చేస్తుంటే క్రింద సజెషన్స్ వస్తాయి, కావలసిన దానిపై క్లిక్ చేసి ఆ మెయిల్ ని ప్రక్కనే చూడవచ్చు. చాలా సింపుల్ కదా అయితే ట్రై చెయ్యండి.

పైన నేను చెప్పినది అర్ధం కాకపోతే కనుక ఈ క్రింది వీడియోని చూడండి:



డౌన్లోడ్: CloudMagic

ధన్యవాదాలు

Monday, August 23, 2010

ఆన్ లైన్ లో సాంకేతిక సహాయాన్ని అందించే ఫోరమ్స్...

మన పీసీ ఏదైనా సమస్య తలెత్తినప్పుడు దానిని సరిదిద్దటం కోసం సర్వీస్ ఇంజనీర్ పై ఆధారపడుతూవుంటాం... కొంతమంది అనుభవం లేని సర్వీస్ ఇంజనీర్లచే సమస్య యింకా జఠిలమై చివరకు పీసీ ఫార్మేట్ చెయ్యవలసి వస్తుంది. అంతర్జాలం ఎంతగా విస్తరించిందంటే మనకి ఏది కావాలన్నా వెతికి పొందవచ్చు. అలానే మన పీసీ కి సంబంధించిన సాంకేతిక సహాయాన్ని పొందటం కోసం ఈ క్రింది సైట్లను చూడండి:

౧. విండోస్ 7 ఫోరమ్స్:

మైక్రోసాప్ట్ విండోస్ 7 కి సంబంధించిన సమస్యలను సాల్వ్ చేసుకోవటం కోసం ఈ ఫోరమ్ సహాయపడగలదు. విండొస్ 7 కి సంబంధించి ఇది ఒక మంచి ఫోరమ్ దీనిలో విండొస్ 7 కి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ తో పాటు లేటెస్ట్ సమాచారం కూడా తెలుసుకోవచ్చు.



సైట్: విండోస్ 7 ఫోరమ్స్

౨. Server Fault:
సిస్టం అడ్మినిస్ట్రేటర్లు మరియు ఐటి ప్రొఫెషన్స్ కోసం ఉపయోగపడే Q&A సైట్.



సైట్: Server Fault

౩. Bleeping Computer:

సైట్: Bleeping Computer

౪. Annoyances:


సైట్: Annoyances

౫. Cybertech Help:

సైట్: Cybertech Help

౬. Ask Leo:

సైట్: Ask Leo

౭. Protonic:



సైట్: Protonic

౮. TechIMO:

సైట్:TechIMO

౯. Linux Questions:


సైట్: Linux Questions

౧౦.Microsoft Technet :



సైట్: Microsoft Technet

ధన్యవాదాలు

Friday, August 20, 2010

True System Security Tweaker - మీ పీసీ కోసం 470 పైగా సెక్యూరిటీ ఆప్షన్లు...

మన అనుమతి లేకుండా ఎవరైనా మన విండోస్ సిస్టం లో మార్పులు చెయ్యకుండా కాపాడుకోవటం కోసం True System Security Tweaker అనే పోర్టబుల్ అప్లికేషన్ ఉపయోగపడుతుంది. దీనిలో 470 పైగా సెక్యూరిటీ ట్వీక్స్ ఉన్నాయి మరియు కస్టమైజ్ చేసుకొనే సదుపాయం కలదు. దీనిలో ప్రధానంగా User Restrictions మరియు Windows Common Restrictions అనే రెండు క్యాటగిరీలున్నాయి. True System Security Tweaker ని ఉపయోగించి కావలసిన యూజర్లకు సిస్టం ఫీచర్స్ ని డిసేబుల్ చెయ్యవచ్చు, స్టార్ట్ మెనూ ఐటమ్స్ ని దాచిపెట్టవచ్చు, డెస్క్ టాప్, కంట్రోల్ ఫ్యానెల్, డ్రైవర్స్, నెట్ వర్క్ ఇలా అన్నిటినీ కంట్రోల్ చెయ్యవచ్చు. ఈ అప్లికేషన్ ని ఉపయోగించి మనం చేసిన మార్పులను వద్దనుకొంటే రీసెట్ కూడా చేసుకోవచ్చు. True System Security Tweaker ని పాస్ వార్డ్ తో ప్రొటెక్ట్ చేసుకొనే సదుపాయం కలదు.



మరింత సమాచారం కోసం True System Security Tweaker సైట్ ని చూడండి.

డౌన్లోడ్: True System Security Tweaker

ధన్యవాదాలు

Thursday, August 19, 2010

Khan Academy - మేథ్స్, సైన్స్ కోసం బెస్ట్ ఆన్ లైన్ ట్యూటర్...

Khan Academy వెబ్ సైట్ లో కేజీ నుండి పీజీ వరకు అందరికీ ఉపయోగపడే మేథ్స్, సైన్స్, ఫైనాన్స్, బ్యాంకింగ్ మరియు ఇతర సబ్జెక్టులకు సంబంధించిన ఎన్నో వీడీయో ట్యుటోరియల్స్ ఉన్నాయి. వీడియోలను మనం ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా ఉచితంగా వీక్షించవచ్చు. ఒకవేళ సైన్-ఇన్ చెయ్యాలంటే కనుక గూగుల్ అకౌంట్ ని ఉపయోగించుకోవచ్చు. ఎలక్ట్రానిక్ చాక్ బోర్డ్ తో యూట్యూబ్ వీడియోలు తయారు చెయ్యబడ్డాయి. ఈ సైట్ లో మిగతా సబ్జెక్టులకన్నా మేథమేటిక్స్ పై ఎక్కువ ఫోకస్ చెయ్యబడింది. బేసిక్ కూడికల (1+1)నుండి Arithmetic, algebra, Geometry, Statistics, calculus, Trigonometry, Probability మొదలగు అంశాలకు చెందిన వీడియోలు ఇక్కడ వున్నాయి.



ఈ సైట్ లో 1600 వందలకు పైగా వీడీయో ట్యుటోరియల్స్ వున్నాయి. వీటన్నిటి వెనక ఒకేఒక్కడు సల్మాన్ ఖాన్... ఆయన నిజంగా అభినందనీయుడు... హాట్సాఫ్ సర్!!!


వెబ్ సైట్: Khan Academy

ధన్యవాదాలు

Wednesday, August 18, 2010

Word మరియు OneNote కోసం మైక్రోసాప్ట్ మేథమేటిక్స్ యాడ్-ఇన్ ...

మైక్రోసాప్ట్ ఇటీవల అడ్వాన్స్ డు మేథమేటిక్స్ యాడ్-ఇన్ ని విడుదల చేసింది. ఈ మేథమేటిక్స్ యాడ్-ఇన్ లో చాలా మేథమేటిక్స్ ఫంక్షన్లు మరియు టూల్స్ వున్నాయి వాటిని ఊపయోగించి క్లిష్టమైన ఆల్ జీబ్రా సమస్యలను సాధించవచ్చు మరియు 2D మరియు 3D గ్రాఫ్స్ ని సులభంగా గీయవచ్చు.


ప్రస్తుతానికి ఈ మేథమేటిక్స్ యాడ్-ఇన్ Word 2007, Word 2010 మరియు OneNote 2010 లలో పనిచేస్తుంది. ఇనస్టలేషన్ చెయ్యాలంటే .Net Framework తప్పనిసరి.

మరింత సమాచారం మరియు యాడ్-ఇన్ డౌన్లోడ్ కోసం మైక్రోసాప్ట్ సైట్ ని చూడండి.

ధన్యవాదాలు

Monday, August 16, 2010

Double Driver - విండోస్ డ్రైవర్స్ ని బ్యాక్ అప్ తీసుకోవటానికి ఉచిత యుటిలిటీ...

క్రొత్త పీసీ కొన్నప్పుడు హార్డ్ వేర్ సంబంధించిన డ్రైవర్స్ సీడీ కూడా వస్తుంది. విండోస్ పాడై తిరిగి ఇనస్టలేషన్ చేసినప్పుడు డ్రైవర్స్ ఇనస్టలేషన్ చెయ్యటానికి డ్రైవర్స్ సీడీ తప్పకుండా అవసరమవుతుంది. సీడీ పై గీతలు పడినా లేదా సీడీ లేకున్నా డ్రైవర్స్ ఇనస్టలేషన్ చెయ్యటం కుదరదు. సిస్టం ని పూర్తిగా స్కాన్ చేసి ఇనస్టలేషన్ చేసి వున్న హార్డ్ వేర్ కి సంబంధించిన డ్రైవర్స్ ని సీడీ లేదా వేరొక డ్రైవ్ లోకి బ్యాక్ అప్ తీసుకోవటానికి Double Driver అనే ఉచిత బ్యాక్ అప్ యుటిలిటీ ఉపయోగడుతుంది. ఇది పోర్టబుల్ అప్లికేషన్ ఇనస్టలేషన్ చెయ్యవలసిన అవసరం లేదు, అప్లికేషన్ ని రన్ చేసి ’Backup Now' బటన్ పై క్లిక్ చెయ్యటమే.



డౌన్లోడ్ మరియు ఇతర సమాచారం కోసం Double Driver సైట్ ని చూడండి.

ధన్యవాదాలు

Thursday, August 12, 2010

freephotoshoptutorials.org - ఉచిత ఫోటోషాప్ వీడియో ట్యుటోరియల్స్...

ఫోటోషాప్ నేర్చుకొనాలనుకొనే వారికి freephotoshoptutorials.org బాగా ఉపయోగపడుతుంది, క్రొత్తగా నేర్చుకొనే వారికి మరియు ఎక్స్ పర్ట్స్ కి కూడా వీడియో ట్యుటోరియల్స్ ఉన్నాయి. ఈ సైట్ లో 800 పైగా పోస్ట్ లు (ట్యుటోరియల్స్) వున్నాయి.



వెబ్ సైట్: http://freephotoshoptutorials.org/

ధన్యవాదాలు

Wednesday, August 11, 2010

GMail క్రొత్త ఫీచర్ - Updates to Contacts and a (slightly) new look for Gmail

జీ మెయిల్ లో కాంటాక్ట్ లను పొందుపర్చటానికి క్రొత్త ఫార్మ్ ని రూపొందించిన, దీని ద్వారా Email Id, Phone No., address ఇలా కావలసిన సమాచారాన్ని ఎంటర్ చేసి కాంటాక్ట్స్ లో భద్రపరచుకోవచ్చు మరియు ఇవి కాకుండా అదనపు సమాచారం ఎంటర్ చెయ్యటం (Fields) కోసం [Add] బటన్ పై క్లిక్ చెయ్యాలి. లిస్ట్ లేని కావలసిన అదనపు సమాచారం ఎంటర్ చెయ్యాలంటే కనుక [Add] బటన్ లో ’Custom' ఆప్షన్ ని ఎంచుకోవాలి మరియు దానికి తగిన లేబుల్ ని కూడా టైప్ చేసుకోవచ్చు.



జీమెయిల్ కీబోర్డ్ షార్ట్ కట్స్:



మరింత సమాచారం కోసం జీమెయిల్ అఫీషియల్ బ్లాగ్ ని చూడండి.


ధన్యవాదాలు

Registry Defrag - పీసీ వేగాన్ని పెంచటానికి రిజిస్ట్రీ ఆప్టిమైజేషన్ యుటిలిటీ

విండోస్ రిజిస్ట్రీ ఫ్రాగ్మెంటెడ్ (విస్తరించి) గా వుండటం వలన మనం ఏదైనా అప్లికేషన్ ని ఓపెన్ చేసినపుడు దాని రెస్పాన్స్ సమయం పెరెగే అవకాసం వుంది. అలా కాకుండా విండోస్ రిజిస్ట్రీ ని డీఫ్రాగ్మెంట్ చేసి పీసీ పనితనం మెరుగు పరచటం లో Registry Defrag అనే ఉచిత రిజిస్ట్రీ ఆప్టిమైజేషన్ యుటిలిటీ సహాయపడగలదు. ఇది రిజిస్ట్రీలోని స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ని కూడా ఫిక్స్ చేస్తుంది.



Features:
- Automatic system restore points for safety.
- Automatically product update.
- Smart and easy-to-use interface.
- Minimal installation, low memory and cpu usage.

డౌన్లోడ్ మరియు ఇతర సమాచారం కోసం Simnet Registry Defrag సైట్ చూడండి.

ధన్యవాదాలు

Monday, August 9, 2010

రూపాయి క్రొత్త సింబల్ ని మన పీసీ లో ఉపయోగించటం ఎలా?

డాలర్ లాగే మన రూపాయి కి కూడా క్రొత్త చిహ్నం వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే... ఆల్రెడీ కొంత మంది ఆ సింబల్ ఉపయోగిస్తున్నారు... మీరు కూడా మీ పీసీ లో ఆ రూపాయి చిహ్నాన్ని పొందాలనుకుంటున్నారా... అదీ సింపుల్ స్టెప్స్ లో ....

౧. ముందుగా http://blog.foradian.com/rupee-font-version-20 సైట్ కి వెళ్ళి Rupee Foradian.ttf అనే ఫాంట్ ని డౌన్లోడ్ చేసుకోండి.

౨. డౌన్లోడ్ చేసుకొన్న ఫాంట్ ని Copy చేసుకొని, Control Panel కి వెళ్ళి Fonts ఫోల్డర్ లో Paste చెయ్యాలి. అంతే Rupee Foradian ఫాంట్ ఇనస్టలేషన్ చెయ్యబడింది.

ఇక ఎప్పుడైనా ఎదైనా అప్లికేషన్ (Word లేదా Excel)లో రూపాయి చిహ్నం కావాలను ఆ అప్లికేషన్ ని ఓపెన్ చేసి Font (Times New Roman/ Arial) ని Rupee Foradian గా మార్చాలి. తర్వాత [1] నంబర్ కీ కి ఎడమచేతి ప్రక్కన వున్న [~]కీ ప్రెస్ చేస్తే రూపాయి చిహ్నం వస్తుంది.

చాలా సింపుల్ కదా ట్రై చెయ్యండి.


వీడీయో:


మరింత సమాచారం కోసం http://blog.foradian.com/rupee-font-version-20 సైట్ ని చూడండి.

ధన్యవాదాలు

Microsoft Indic Language Input Tool - భారతీయ భాషలలో టైప్ చెయ్యటానికి లాంగ్వేజ్ ఇన్ పుట్ టూల్..

Microsoft Indic Language Input Tool ని ఉపయోగించి వివిధ అప్లికేషన్లు లేదా వెబ్ పేజీలలో కావలసిన భారతీయ భాషలలో టైప్ చెయ్యవచ్చు ... ఒకవిధంగా చెప్పాలనుకొంటే Baraha లాంటిదే...ఈ టూల్ లో బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒరియా, పంజాబీ, తమిళం మరియు తెలుగు బాషలున్నాయి. Microsoft Indic Language Input Tool లో రెండు వెర్షన్లు వున్నాయు ఒకటి వెబ్ వెర్షన్ - ఏదైనా వెబ్ పేజీలలో పైన చెప్పబడిన భారతీయ భాషలలో టైప్ చెయ్యటానికి, రెండవది డెస్క్ టాప్ వెర్షన్ - మైక్రోసాప్ట్ విండోస్ లోని అన్ని అప్లికేషన్లలో టైప్ చెయ్య టానికి ఇది ఉపయోగపడుతుంది. మైక్రోసాప్ట్ సైట్ లో మన ఆపరేటింగ్ సిస్టం కి తగిన విధంగా ఈ టూల్ ని ఎలా ఇనస్టలేషన్ చెయ్యాలో స్టెప్-బై-స్టెప్ సచిత్రంగా చాలా చక్కగా వివరించారు.




డెస్క్ టాప్ వెర్షన్ కి సంబంధించిన డెమో ని ఇక్కడ చూడండి.

వెబ్ వెర్షన్ డెమో ని ఇక్కడ చూడండి.



ధన్యవాదాలు

Friday, August 6, 2010

Watch 4 Folder - ఒక ఫోల్డర్ లో జరిగే మార్పులను మోనిటర్ చెయ్యటానికి...

Watch 4 Folder అనే పోర్టబుల్ అప్లికేషన్ టూల్ ని ఉపయోగించి ఒక ఫోల్డర్ లో జరిగే 15 రకాల ఈవెంట్లను మరియు ఫైల్ యాక్టివిటీలను మోనిటర్ చెయ్యవచ్చు. దాని కోసం క్రింద యివ్వబడిన సింపుల్ స్టెప్స్ ని ఫాలో అవ్వటమే...

ముందుగా Watch 4 Folder డౌన్లోడ్ చేసుకొని అన్ జిప్ చేసి ఎటువంటి ఇనస్టలేషన్ అవసరం లేకుండా w4f22 ఫైల్ పై క్లిక్ చేసి అప్లికేషన్ ని రన్ చెయ్యవచ్చు.



స్టెప్ ౧: మోనిటర్ చెయ్యవలసిన ఫోల్డర్ ని సెలెక్ట్ చేసుకోవాలి.

స్టెప్ ౨: మోనిటర్ చెయ్యటానికి కావలసిన ఈవెంట్లను సెలెక్ట్ చేసుకోవాలి. Watch 4 Folder టూల్ లో వున్న ఈవెంట్లు:

- File create
- File Delete
- File Change
- File Rename
- Association Change
- Free Space change
- Folder Create
- Folder Delete
- Folder Rename
- Folder Change
- Media Insert
- Media Remove

స్టెప్ ౩: పైన ఈవెంట్లకు తగిన యాక్షన్లను సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే ఫోల్డర్ లో ఏమైనా మార్పులు జరిగిన వెంటనే లాగ్ ఫైల్ లో వ్రాయటం లేదా పాప్ అప్ మెసేజ్ లేదా డెస్క్ టాప్ అలర్ట్ యిలా ... కావలసిన యాక్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి.

స్టెప్ ౪: చివరగా ’Start Monitoring' బటన్ పై క్లిక్ చెయ్యాలి. ’Tray' బటన్ పై క్లిక్ చెయ్యటం వలన ఈ టూల్ సిస్టం ట్రే లో కూర్చుంటుంది.

డౌన్లోడ్: Watch 4 Folder

ధన్యవాదాలు

Thursday, August 5, 2010

Comodo Programs Manager - విండోస్ ప్రోగ్రామ్స్, డ్రైవర్స్, ఫీచర్స్ మరియు అప్ డేట్స్ మేనేజ్ చెయ్యటానికి...

కొమోడో నుండి వస్తున్న మరో ఫ్రీవేర్ Comodo Programs Manager ... దీనిలో Add/Remove Programs ఫంక్షన్, సిస్టం Drivers and Services, Windows Features, మరియు Windows Updates అన్నీ ఒకే గొడుగు క్రింద వున్నాయి. చక్కని యూజర్ ఇంటర్ ఫేజ్ ని కలిగి అన్నీ ఒకే చోట వుండటం వలన విండోస్ ని మేనేజ్ చెయ్యటం సులువుగా వుంటుంది.



పైన చూపిన చిత్రం లో సైడ్ బార్ లో వున్న Programs ని ఉపయోగించి సిస్టం లోని కావలసిన ప్రోగ్రామ్ ని తొలగించవచ్చు లేదా రిపేర్ చేసుకోవచ్చు. ఏదైనా ప్రోగ్రాని తొలగించే ముందు దాని బ్యాక్ అప్ క్రియేట్ చేసుకోవాలంటే కనుక పైన వున్న Settings కి వెళ్ళి బ్యాక్ అప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవటం ద్వారా బ్యాక్ అప్ క్రియేట్ చేసుకోవచ్చు. తొలగించిన ప్రోగ్రామ్ ని తిరిగి పొందటానికి Restore Backup పై క్లిక్ చెయ్యాలి.

అలాగే Drivers and Services అన్ని డ్రైవర్లను మరియు సర్వీసెస్ ను మెయింటైన్ చెయ్యవచ్చు. డ్రైవర్లను సిస్టం నుండి uninstall చెయ్యవచ్చు. check/uncheck ఆప్షన్ ని ఉపయోగించి కావలసిన Windows Features ని ఆన్ లేదా ఆఫ్ చెయ్యవచ్చు. Windows Updates సిస్టం లో ఇనస్టలేషన్ చెయ్యబడిన అన్ని అప్ డేట్ల లిస్ట్ ని చూపెడుతుంది.

మరింత సమాచారం మరియు డౌన్లోడ్ కొరకు Comodo Programs Manager సైట్ ని చూడండి.

డౌన్లోడ్: Comodo Programs Manager

ధన్యవాదాలు

Wednesday, August 4, 2010

Mobical - మొబైల్ కాంటాక్ట్స్, బుక్ మార్క్స్ మొదలగు వాటిని ఆన్ లైన్ లో బ్యాక్ అప్ తీసుకోవటానికి !!!

మన మొబైల్ ఫోన్ లోని కాంటాక్ట్స్ ని ఆన్ లైన్ లో బ్యాక్ అప్ తీసుకొని సురక్షితంగా వుంచటానికి మొబికాల్.నెట్ అనే సైట్ వుపయోగపడుతుంది. ఎప్పుడైనా మన మొబైల్ పాడైనప్పుడు లేదా పోయినప్పుడు లేదా క్రొత్త ఫోన్ కొన్నప్పుడు మన కాంటాక్ట్స్ ని తిరిగి పొందటానికి ఈ సైట్ ఉపయోగపడుతుంది. మొబికాల్.నెట్ కి వెళ్ళి మన మొబైల్ ఫోన్ ని సపోర్ట్ చేస్తుందా లేదా ని చెక్ చేసుకోవచ్చు తర్వాత అకౌంట్ క్రియేట్ చేస్తే మన్ మొబైల్ కి పాస్ వార్డ్ పంపబడుతుంది. సింక్ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకొని బ్యాక్ అప్ తీసుకోవచ్చు.



Mobical Features:
- Store and backup your phone’s address book, calendar details, browser bookmarks, notes and phone settings online.
- Access and manage stored data from any web-enabled mobile or PC.
- Always keeps your backup and phone data synchronized.
- Restore online backup files to any mobile.
- Synchronize data between multiple mobile phones at the same time.

మరింత సమాచారం కోసం మొబికాల్ సైట్ చూడండి.

ధన్యవాదాలు

GMail క్రొత్త ఫీచర్ : ఫైల్ అటాచ్ మెంట్లను డ్రాగ్-అండ్-డ్రాప్ పద్ధతిలో డౌన్లోడ్ చేసుకోవచ్చు...

GMail లో డ్రాగ్-అండ్-డ్రాప్ పద్ధతిలో ఫైళ్ళను జత చెయ్యటం గురించి ఇంతకుముందు తెలుసుకున్నాం... ఇప్పుడు ఫైల్ అటాచ్ మెంట్లను కూడా డ్రాగ్-అండ్-డ్రాప్ పద్ధతిలో డౌన్లోడ్ చేసుకోవచ్చు... ఈ క్రొత్త ఫీచర్ క్రోమ్ ఆధారిత బ్రౌజర్లలో మాత్రమే పని చేస్తుంది.

దానికి సంబంధించిన వీడియోని చూడండి:


మరింత సమాచారం కోసం GMail బ్లాగ్ చూడండి.

ధన్యవాదాలు