USB డ్రైవ్ లను USB పోర్ట్ లకు కనెక్ట్ చేసి డాటా ట్రాన్స్ ఫర్ చేస్తూ ఉంటాం ...కొన్ని డ్రైవ్ ల నుండి ఒక్కొక్కసారి డాటాతో పాటు స్పైవేర్లు / మాల్వేర్లు కూడా పీసీ లోకి ప్రవేశిస్తాయి. మనకు తెలియకుండా యితరులు మన సిస్టం కి USB డ్రైవ్ లు కనెక్ట్ చెయ్యకుండా USB పోర్ట్ లను డిసేబుల్ చెయ్యవచ్చు, దీని కోసం USB Port Locked అనే పోర్టబుల్ అప్లికేషన్ ఉపయోగపడుతుంది.
USB Port Locked ని ఉపయోగించటం చాలా సులువు, అప్లికేషన్ ని రన్ చేసి ’Lock USB Port' బటన్ పై క్లిక్ చేస్తే పోర్ట్ లాక్ అవుతుంది, అన్ లాక్ కోసం ’Un-Lock USB Port' బటన్ పై క్లిక్ చెయ్యాలి. అంతే చాలా సింపుల్ కదా!!!
USB Port Locked రెండు వెర్షన్లలో లభిస్తుంది....ఒకటి పాస్ వార్డ్ లేకుండా రెండవది పాస్ వార్డ్ ఉపయోగించి పోర్ట్ లాక్ చేసేది.
డౌన్లోడ్: USB Port Locked
ధన్యవాదాలు