Wednesday, August 25, 2010

Process Lasso - పీసీ ఫెర్మార్మెన్స్ ని పెంచే ఆటోమాటిక్ విండోస్ ప్రాసెస్ ట్యూనర్....

Process Lasso ఒక శక్తివంతమైన విండోస్ ఆప్టిమైజేషన్ టూల్... ఒక విధంగా చెప్పాలంటే విండోస్ టాస్క్ మేనేజర్ కి ప్రత్యామ్నాయం అని చెప్పవచ్చు. ఇంతకు ముందు పెయిడ్ వెర్షన్ గా వుండేది, ఇప్పుడు షేర్ వేర్ గా లభిస్తుంది. Process Lasso సిస్టం రన్ అవుతున్న అన్నీ ప్రోగ్రామ్స్/ ప్రాసెస్ ల కి సంబంధిన పూర్తి సమాచారాన్ని చూపెడుతుంది మరియు అవి కొన్ని నియమాలకు కట్టుబడేలా చేస్తుంది.

Process Lasso ని ముందుగా ఆ సైట్ కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి, డౌన్లోడ్ జిప్ ఫైల్ సైజ్ 1.50 MB మాత్రమే, అన్ జిప్ చేసి ఇనస్టలేషన్ చేసుకొన్న తర్వాత అది సిస్టం ట్రే లో కూర్చుంటుంది.



Process Lasso ఇంటర్ ఫేజ్ విండోస్ టాస్క్ మేనేజర్ ని పోలి వుంటుంది, responsiveness, memory load మరియు processor use ని గ్రాఫ్ రూపంలో చూపెడుతుంది. ముందుగా చెప్పుకున్నట్లు All Processes టాబ్ లో Process Lasso సిస్టం లో ముందు/ వెనక రన్ అన్ని ప్రాసెస్ ల కి సంబంధించిన పూర్తి సమాచారం మరియు వాటి మెమొరీ/ సీపీయూ యూసేజ్ ని చూపెడుతుంది. ఏదైనా ప్రాసెస్ పై మౌస్ రైట్ క్లిక్ చేస్తే వచ్చే ఆప్షన్లను ఉపయోగించి ఆ ప్రాసెస్స్ కి Priority Class ని సెట్ చెయ్యవచ్చు, అవసరం లేని వాటిని అంతం చెయ్యవచ్చు, తిరిగి రీస్టార్ట్ చెయ్యవచ్చు, ఇలా ఎన్నో అడ్వాన్స్ డు ఫీచర్స్ దీనిలో వున్నాయి. Process Lasso ని ఉపయోగించి రీసోర్స్ అల్లోకేషన్ ని పూర్తిగా మన కంట్రోల్ లో ఉంచుకోవచ్చు.



Active Processes టాబ్ లో ముందు భాగం (foreground)లో రన్ అవుతున్న అప్లికేషన్ల లిస్ట్ చూపెడుతుంది. యాక్షన్స్ లాగ్ కూడా క్రియేట్ చెయ్యబడుతుంది.

మరింత సమాచారం కోసం Process Lasso సైట్ ని చూడండి.

డౌన్లోడ్: Process Lasso (సైజ్: 1.53 MB)

ధన్యవాదాలు