Thursday, August 5, 2010

Comodo Programs Manager - విండోస్ ప్రోగ్రామ్స్, డ్రైవర్స్, ఫీచర్స్ మరియు అప్ డేట్స్ మేనేజ్ చెయ్యటానికి...

కొమోడో నుండి వస్తున్న మరో ఫ్రీవేర్ Comodo Programs Manager ... దీనిలో Add/Remove Programs ఫంక్షన్, సిస్టం Drivers and Services, Windows Features, మరియు Windows Updates అన్నీ ఒకే గొడుగు క్రింద వున్నాయి. చక్కని యూజర్ ఇంటర్ ఫేజ్ ని కలిగి అన్నీ ఒకే చోట వుండటం వలన విండోస్ ని మేనేజ్ చెయ్యటం సులువుగా వుంటుంది.



పైన చూపిన చిత్రం లో సైడ్ బార్ లో వున్న Programs ని ఉపయోగించి సిస్టం లోని కావలసిన ప్రోగ్రామ్ ని తొలగించవచ్చు లేదా రిపేర్ చేసుకోవచ్చు. ఏదైనా ప్రోగ్రాని తొలగించే ముందు దాని బ్యాక్ అప్ క్రియేట్ చేసుకోవాలంటే కనుక పైన వున్న Settings కి వెళ్ళి బ్యాక్ అప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవటం ద్వారా బ్యాక్ అప్ క్రియేట్ చేసుకోవచ్చు. తొలగించిన ప్రోగ్రామ్ ని తిరిగి పొందటానికి Restore Backup పై క్లిక్ చెయ్యాలి.

అలాగే Drivers and Services అన్ని డ్రైవర్లను మరియు సర్వీసెస్ ను మెయింటైన్ చెయ్యవచ్చు. డ్రైవర్లను సిస్టం నుండి uninstall చెయ్యవచ్చు. check/uncheck ఆప్షన్ ని ఉపయోగించి కావలసిన Windows Features ని ఆన్ లేదా ఆఫ్ చెయ్యవచ్చు. Windows Updates సిస్టం లో ఇనస్టలేషన్ చెయ్యబడిన అన్ని అప్ డేట్ల లిస్ట్ ని చూపెడుతుంది.

మరింత సమాచారం మరియు డౌన్లోడ్ కొరకు Comodo Programs Manager సైట్ ని చూడండి.

డౌన్లోడ్: Comodo Programs Manager

ధన్యవాదాలు