Monday, August 16, 2010

Double Driver - విండోస్ డ్రైవర్స్ ని బ్యాక్ అప్ తీసుకోవటానికి ఉచిత యుటిలిటీ...

క్రొత్త పీసీ కొన్నప్పుడు హార్డ్ వేర్ సంబంధించిన డ్రైవర్స్ సీడీ కూడా వస్తుంది. విండోస్ పాడై తిరిగి ఇనస్టలేషన్ చేసినప్పుడు డ్రైవర్స్ ఇనస్టలేషన్ చెయ్యటానికి డ్రైవర్స్ సీడీ తప్పకుండా అవసరమవుతుంది. సీడీ పై గీతలు పడినా లేదా సీడీ లేకున్నా డ్రైవర్స్ ఇనస్టలేషన్ చెయ్యటం కుదరదు. సిస్టం ని పూర్తిగా స్కాన్ చేసి ఇనస్టలేషన్ చేసి వున్న హార్డ్ వేర్ కి సంబంధించిన డ్రైవర్స్ ని సీడీ లేదా వేరొక డ్రైవ్ లోకి బ్యాక్ అప్ తీసుకోవటానికి Double Driver అనే ఉచిత బ్యాక్ అప్ యుటిలిటీ ఉపయోగడుతుంది. ఇది పోర్టబుల్ అప్లికేషన్ ఇనస్టలేషన్ చెయ్యవలసిన అవసరం లేదు, అప్లికేషన్ ని రన్ చేసి ’Backup Now' బటన్ పై క్లిక్ చెయ్యటమే.



డౌన్లోడ్ మరియు ఇతర సమాచారం కోసం Double Driver సైట్ ని చూడండి.

ధన్యవాదాలు