మన అనుమతి లేకుండా ఎవరైనా మన విండోస్ సిస్టం లో మార్పులు చెయ్యకుండా కాపాడుకోవటం కోసం True System Security Tweaker అనే పోర్టబుల్ అప్లికేషన్ ఉపయోగపడుతుంది. దీనిలో 470 పైగా సెక్యూరిటీ ట్వీక్స్ ఉన్నాయి మరియు కస్టమైజ్ చేసుకొనే సదుపాయం కలదు. దీనిలో ప్రధానంగా User Restrictions మరియు Windows Common Restrictions అనే రెండు క్యాటగిరీలున్నాయి. True System Security Tweaker ని ఉపయోగించి కావలసిన యూజర్లకు సిస్టం ఫీచర్స్ ని డిసేబుల్ చెయ్యవచ్చు, స్టార్ట్ మెనూ ఐటమ్స్ ని దాచిపెట్టవచ్చు, డెస్క్ టాప్, కంట్రోల్ ఫ్యానెల్, డ్రైవర్స్, నెట్ వర్క్ ఇలా అన్నిటినీ కంట్రోల్ చెయ్యవచ్చు. ఈ అప్లికేషన్ ని ఉపయోగించి మనం చేసిన మార్పులను వద్దనుకొంటే రీసెట్ కూడా చేసుకోవచ్చు. True System Security Tweaker ని పాస్ వార్డ్ తో ప్రొటెక్ట్ చేసుకొనే సదుపాయం కలదు.
మరింత సమాచారం కోసం True System Security Tweaker సైట్ ని చూడండి.
డౌన్లోడ్: True System Security Tweaker
ధన్యవాదాలు