Monday, August 9, 2010

రూపాయి క్రొత్త సింబల్ ని మన పీసీ లో ఉపయోగించటం ఎలా?

డాలర్ లాగే మన రూపాయి కి కూడా క్రొత్త చిహ్నం వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే... ఆల్రెడీ కొంత మంది ఆ సింబల్ ఉపయోగిస్తున్నారు... మీరు కూడా మీ పీసీ లో ఆ రూపాయి చిహ్నాన్ని పొందాలనుకుంటున్నారా... అదీ సింపుల్ స్టెప్స్ లో ....

౧. ముందుగా http://blog.foradian.com/rupee-font-version-20 సైట్ కి వెళ్ళి Rupee Foradian.ttf అనే ఫాంట్ ని డౌన్లోడ్ చేసుకోండి.

౨. డౌన్లోడ్ చేసుకొన్న ఫాంట్ ని Copy చేసుకొని, Control Panel కి వెళ్ళి Fonts ఫోల్డర్ లో Paste చెయ్యాలి. అంతే Rupee Foradian ఫాంట్ ఇనస్టలేషన్ చెయ్యబడింది.

ఇక ఎప్పుడైనా ఎదైనా అప్లికేషన్ (Word లేదా Excel)లో రూపాయి చిహ్నం కావాలను ఆ అప్లికేషన్ ని ఓపెన్ చేసి Font (Times New Roman/ Arial) ని Rupee Foradian గా మార్చాలి. తర్వాత [1] నంబర్ కీ కి ఎడమచేతి ప్రక్కన వున్న [~]కీ ప్రెస్ చేస్తే రూపాయి చిహ్నం వస్తుంది.

చాలా సింపుల్ కదా ట్రై చెయ్యండి.


వీడీయో:


మరింత సమాచారం కోసం http://blog.foradian.com/rupee-font-version-20 సైట్ ని చూడండి.

ధన్యవాదాలు