CloudMagic అనే బ్రౌజర్ ఎక్స్ టెన్షన్ ని ఉపయోగించి జీ-మెయిల్ లో చాలా వేగంగా అంటే టైప్ చేస్తూనే కావలసిన సమాచారాన్ని సెర్చ్ చేసి పొందవచ్చు. CloudMagic ప్రస్తుతానికి ఫైర్ ఫాక్స్ మరియు క్రోమ్ బ్రౌజర్లలో మాత్రమే పనిచేస్తుంది మరియు జీమెయిల్ లో మాత్రమే సెర్చ్ చేస్తుంది. మిగతా మెయిల్ (హాట్ మెయిల్, యాహూ మొదలగు వాటికి) మరియు గూగుల్ డాక్స్ సపోర్ట్ త్వరలో రానుంది.
అయితే ముందుగా CloudMagic సైట్ కి వెళ్ళి 'Install Now' పై క్లిక్ చేసి వచ్చే సూచలను ఫాలో అయి ఇనస్టలేషన్ చేసుకోవాలి, తర్వాత జీమెయిల్ లాగిన్ అవ్వాలి... ఒకవేళ అల్రెడీ లాగిన్ అయి వుంటే కనుక రీఫ్రెష్ చెయ్యాలి. అక్కడ cloudmagic సెర్చ్ బాక్స్ వస్తుంది. డ్రాప్ డౌన్ యారో పై క్లిక్ చేసి ’Manage Accounts' ని సెలెక్ట్ చేసుకోవాలి, అక్కడ మన జీమెయిల్ ఐడి మరియు పాస్ వార్డ్ ఎంటర్ చెయ్యాలి అవి మిగతా ఈ-మెయిల్ క్లైంట్స్ మాదిరిగానే మన లోకల్ కంప్యూటర్ లో సేవ్ చెయ్యబడతాయి. ఇప్పుడు మరల జీ-మెయిల్ కి వెళ్ళి కావలసిన సమాచారానికి సంబంధించిన పదం టైప్ చేస్తుంటే క్రింద సజెషన్స్ వస్తాయి, కావలసిన దానిపై క్లిక్ చేసి ఆ మెయిల్ ని ప్రక్కనే చూడవచ్చు. చాలా సింపుల్ కదా అయితే ట్రై చెయ్యండి.
పైన నేను చెప్పినది అర్ధం కాకపోతే కనుక ఈ క్రింది వీడియోని చూడండి:
డౌన్లోడ్: CloudMagic
ధన్యవాదాలు