Watch 4 Folder అనే పోర్టబుల్ అప్లికేషన్ టూల్ ని ఉపయోగించి ఒక ఫోల్డర్ లో జరిగే 15 రకాల ఈవెంట్లను మరియు ఫైల్ యాక్టివిటీలను మోనిటర్ చెయ్యవచ్చు. దాని కోసం క్రింద యివ్వబడిన సింపుల్ స్టెప్స్ ని ఫాలో అవ్వటమే...
ముందుగా Watch 4 Folder డౌన్లోడ్ చేసుకొని అన్ జిప్ చేసి ఎటువంటి ఇనస్టలేషన్ అవసరం లేకుండా w4f22 ఫైల్ పై క్లిక్ చేసి అప్లికేషన్ ని రన్ చెయ్యవచ్చు.
స్టెప్ ౧: మోనిటర్ చెయ్యవలసిన ఫోల్డర్ ని సెలెక్ట్ చేసుకోవాలి.
స్టెప్ ౨: మోనిటర్ చెయ్యటానికి కావలసిన ఈవెంట్లను సెలెక్ట్ చేసుకోవాలి. Watch 4 Folder టూల్ లో వున్న ఈవెంట్లు:
- File create
- File Delete
- File Change
- File Rename
- Association Change
- Free Space change
- Folder Create
- Folder Delete
- Folder Rename
- Folder Change
- Media Insert
- Media Remove
స్టెప్ ౩: పైన ఈవెంట్లకు తగిన యాక్షన్లను సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే ఫోల్డర్ లో ఏమైనా మార్పులు జరిగిన వెంటనే లాగ్ ఫైల్ లో వ్రాయటం లేదా పాప్ అప్ మెసేజ్ లేదా డెస్క్ టాప్ అలర్ట్ యిలా ... కావలసిన యాక్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి.
స్టెప్ ౪: చివరగా ’Start Monitoring' బటన్ పై క్లిక్ చెయ్యాలి. ’Tray' బటన్ పై క్లిక్ చెయ్యటం వలన ఈ టూల్ సిస్టం ట్రే లో కూర్చుంటుంది.
డౌన్లోడ్: Watch 4 Folder
ధన్యవాదాలు