Chrome Speak అనే గూగుల్ క్రోమ్ ఎక్స్ టెన్షన్ ఏదైనా వెబ్ పేజ్ లోని టెక్స్ట్ ని వాయిస్ లోకి మారుస్తుంది. అవసరమైతే వాయిస్ స్పీడ్, పిచ్ మార్చుకునే సదుపాయం కూడా కలదు. ముందుగా Chrome Web Store కి వెళ్ళి Add to Chrome పై క్లిక్ చేసి ఈ ఎక్స్ టెన్షన్ ని ఇనస్టలేషన్ చేసుకోవాలి. అయితే ఇది క్రోమ్ 14.0 లేదా ఆపైన వెర్షన్లలో మాత్రమే పనిచేస్తుంది. ఇనస్టలేషన్ పూర్తి అయిన తర్వాత కావలసిన వెబ్ సైట్ కి వెళ్ళి వినవలసిన టెల్స్ట్ ని సెలెక్ట్ చేసుకొని దానిపై మౌస్ రైట్ క్లిక్ చేసి అక్కడ ’Read Selected Text' పై క్లిక్ చెయ్యటమే. సెలెక్ట్ అయిన టెక్స్ట్ రీడ్ చెయ్యబడుతుంది.
డౌన్లోడ్: Chrome Web Store
ధన్యవాదాలు