Files Terminator అనే ఉచిత అప్లికేషన్ పీసీ లోని ఫైల్స్ లేదా ఫోల్డర్లను రికవర్ చెయ్యటానికి వీలు లేకుండా శాశ్వతం గా తొలగించి డిస్క్ స్పేస్ ని ఖాళీగా ఉంచుతుంది. పాత పీసీ అమ్మేటప్పుడు హార్డ్ డిస్క్ ని పూర్తిగా ఎరేజ్ చెయ్యాలనుకునే వారికి ఈ అప్లికేషన్ వారికి బాగా ఉపయోగపడుతుంది. Files Terminator డౌన్లోడ్ చేసుకుని ఇనస్టలేషన్ చేసుకున్న తర్వాత డిలీషన్ మెథడ్ ని ఎంచుకుని ప్రక్కనున్న Destroy File(s) లేదా Destroy Folder పై క్లిక్ చేసి తొలగించవలసిన ఫైల్ లేదా ఫోల్డర్ ని సెలెక్ట్ చేసుకోవాలి అంతే ఫైల్/ఫోల్డర్ శాశ్వతంగా మన డిస్క్ నుండి తొలగిపోతుంది.
ఫైళ్ళను తొలగించటానికి one pass Pseudorandom, British HMG IS5, two pass Russian GOST P50739-95, three pass US DoD 5220.22M, seven pass German VSITR, Canadian RCPM TSSIT OPS-II, Bruce Schneier and the 35-pass Peter Gutmann మొదలగు పద్ధతులను ఈ సాప్ట్ వేర్ ఉపయోగిస్తుంది.
డౌన్లోడ్ మరియు ఇతర సమాచారం కోసం Files Terminator సైట్ చూడండి.
ధన్యవాదాలు