Thursday, July 3, 2008

సిస్టమ్ త్వరగా షట్ డౌన్ లేదా రీబూట్ చెయ్యటానికి....


Start ---> Shut Down కి వెళ్ళి సిస్టం షట్ డౌన్ చెయ్యకుండా ఒక చిన్న కమాండ్ తో ఎలా షట్ డౌన్ చెయ్యాలో చూద్దాం...
ముందుగా shutdown -s -t 0 అనే కమాండ్ తో షార్ట్ కట్ క్రియేట్ చెయ్యాలి. దీని పై మౌస్ తో డబల్ క్లిక్ చేస్తే ఎటువంటి కన్పర్ మేషన్ డైలాగ్ బాక్స్ లేకుండా సిస్టమ్ త్వరగా షట్ డౌన్ అవుతుంది. షట్ డౌన్ కి ముందు టైమ్ సెట్ చెయ్యటానికి ఈ కమాండ్ లో ’౦’ (సున్న) బదులు ఏదైనా వాల్యూ యివ్వవచ్చు.

షట్ డౌన్ ని ఎప్పుడైనా ఎబార్ట్ చెయ్యటానికి shutdown -a కమాండ్ ని వుపయోగించవచ్చు.

అదేవిధంగా సిస్టం రీబూట్ / రీస్టార్ట్ చెయ్యటానికి shutdown -r -t 0 కమాండ్ వుపయోగపడుతుంది.

ధన్యవాదాలు