Tuesday, July 22, 2008

అప్ డేట్ చెకర్ - మీ సాప్ట్ వేర్ల అప్ డేట్లు చెక్ చేసుకోవటానికి!!

అప్ డేట్ చెకర్ - ఇది ఒక చిన్న యుటిలిటీ, దీనిని వుపయోగించి మన సిస్టం లో వున్న ఏయే సాప్ట్ వేర్ల కు అప్ డేట్లు అవసరం అవుతాయో తెలుసుకోవచ్చు. ఈ యుటిలిటీ ని http://www.filehippo.com/updatechecker/ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు, ఇది ఫ్రీవేర్ మరియు డౌన్ లోడ్ సైజ్ 148 KB. ముందుగా అప్ డేట్ చెకర్ ను డౌన్ లోడ్ చేసి, ఇనస్టలేషన్ చెయ్యాలి. తర్వాత డెస్క్ టాప్ పై క్రియేట్ చెయ్యబడిన ’Update Checker' ఐకాన్ పై మౌస్ డబుల్ క్లిక్ చెయ్యాలి. ఇది సిస్టం ను పూర్తిగా స్కాన్ చేసి ఇనస్టలేషన్ చెయ్యబడిన సాప్ట్ వేర్లు మరియు వాటి వెర్షన్లను చెక్ చేసి, అప్ డేట్స్ అవసరమైన సాప్ట్ వేర్ల లిస్ట్ ను Filehippo.com కి పంపుతుంది. అంటే అప్ డేట్ చేసుకోవలసిన లిస్ట్ మన బ్రౌజర్ లో ఓపెన్ అవుతుంది. దీని కోసం సిస్టం నెట్ కి తప్పనిసరిగా కనెక్ట్ అయ్యివుండాలి.

నా సిస్టం ను నేను చెక్ చేసినప్పుడు ఈ క్రిందివాటిని అప్ డేట్ చేసుకోవాలని చూపించింది.


ఫైన్ చూపబడిన లిస్ట్ లో అవసరమైన దాని పై క్లిక్ చేసి అప్ డేట్ చేసుకోవచ్చు.

అప్ డేట్ చెకర్ విండోస్ విస్టా, ఎక్స్పీ, 2003, 2000, ME,98 లలో పనిచేస్తుంది. ఇది పనిచెయ్యాలంటే మైక్రోసాప్ట్ .నెట్ ఫ్రేమ్వర్క్ అవసరం.

ధన్యవాదాలు