Wednesday, July 23, 2008

వెబ్ సైట్లను బ్లాక్ చెయ్యటం ఎలా?

మనం ఒక్కొక్కసారి కొన్ని వెబ్ సైట్లు మనం సిస్టంలో ఓపెన్ కాకూడదు అని అనుకొంటాం. నిర్దిస్టమైన వెబ్ సైట్లు ఓపెన్ కాకుండా ఏం చెయ్యాలో యిక్కడ వివరిస్తున్నాను. ముందుగా హార్డ్ డిస్క్ లోని 'Windows' ఫోల్డర్ లోని 'System32' --->'Drivers'---->'etc' ఫోల్డర్ లోని ’hosts' అనే ఫైల్ ని Notepad లో ఓపెన్ చెయ్యాలి.

ఇక్కడ ఉదాహరణ కు www.abc.com అనే సైట్ బ్లాక్ చెయ్యాలంటే ...Notepad లో ’Hosts' ఫైల్ ఓపెన్ అయిన తర్వాత చివరన 127.0.0.1 www.abc.com అని టైప్ చేసి, మెయిన్ మెనూ లోని ’File' కి వెళ్ళి ’Save' చేసి ఫైల్ ’Close' చెయ్యాలి. అంతే www.abc.com అనే సైట్ యిక ఏ బ్రౌజర్ లోనూ ఓపెన్ కాదు.


ధన్యవాదాలు