హార్డ్ డిస్క్ లోని ఫైల్ సిస్టం లో చెల్లచెదురుగా వున్న ఫైళ్ళను ఒక దగ్గరకు చేర్చి,వరుస క్రమంలో పెట్టటానికి డీఫ్రాగ్ మెంటేషన్ వుపయోగపడుతుంది. దీనివలన హార్డ్ డిస్క్ లో ఫైల్స్ ఒకదగ్గరికి, ఖాళీ ప్రదేశం ఒకదగ్గరకు వస్తాయి. దీనితో హార్డ్ డిస్క్ లో ఒక ఫైల్ సేవ్ చెయ్యటానికి లేదా రిట్రీవ్ చెయ్యటానికి పట్టే సమయం బాగా తగ్గుతుంది. సాధారణంగా హార్డ్ డిస్క్ ప్రోపర్టీస్ లో లభించే డీఫ్రాగ్ మెంటేషన్ టూల్ ని వుపయోగిస్తాం, ఇది చాలా ఎక్కువ సమయం పడుతుంది. దీనికన్నా పదిరెట్లు వేగంగా పనిచేసే డీఫ్రాగ్ మెంట్ టూల్ ఒకటి వుంది అదే Power Defragmenter 2.0.125, దీనిని http://www.softpedia.com/progDownload/Power-Defragmenter-Download-20185.html నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇది జిప్ ఫైల్ మరియు సైజ్ 473KB వుంటుంది. డౌన్లోడ్ అయిన ఫైల్ ని అన్ జిప్ చేసి Power Defragmenter GUI అనే ఫైల్ పై డబుల్ క్లిక్ చెయ్యాలి. ఈ క్రింది విండో ఓపెన్ అవుతుంది.

’Next'బటన్ క్లిక్ చేస్తే నాలుగు ఆప్షన్లు వస్తాయి, హార్డ్ డిస్క్ మొత్తం డీఫ్రాగ్ మెంట్ చెయ్యాలంటే ’Defragment Disk' ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.

’Next'బటన్ క్లిక్ చేసి, డీఫ్రాగ్ మెంట్ చెయ్యవల్సిన డ్రైవ్ సెలెక్ట్ చేసి , ’Defragment'బటన్ క్లిక్ చెయ్యాలి

